దూలం చుట్టూ అసమ్మతి స్వరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆయన మొదటిసారి ఎమ్మెల్యే. అంతా బాగుంది అని అనుకుంటున్న సమయంలో సొంత కేడరే ఆయనకు పక్కలో బల్లెంలా తయారైందట. విపక్షాల సంగతి ఎలా ఉన్నా.. స్వపక్షం నుంచే ఎమ్మెల్యేకు అవినీతి ఆరోపణలు తప్పడం లేదు. సోషల్ మీడియాలోనూ కామెంట్స్.. పోస్టింగ్స్‌తో కేక పెట్టిస్తున్నారు.
వైసీపీలోని వ్యతిరేకవర్గం దెబ్బకు ఉక్కిరిబిక్కిరి..!
కృష్ణాజిల్లాలో కీలకమైన నియోజకవర్గాల్లో కైకలూరు ఒకటి. పశ్చిమ గోదావరి, కృష్ణాజిల్లా బోర్డర్లో ఉంటంతో.. ఇక్కడ ఎవరు గెలిచినా ప్రత్యేకమే. అటువంటి నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు దూలం నాగేశ్వరరావు. ఆయన DNRగా స్థానికులకు సుపరిచితం. అధికారపార్టీ శాసన సభ్యుడైనా.. ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న సొంతపార్టీవర్గం దెబ్బకి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు ఎమ్మెల్యే.
Also Read
ఎమ్మెల్యేకు సొంతపార్టీ కేడర్ నుంచి రివర్స్ పంచ్‌లు
గతంలో సర్పంచ్‌గా పనిచేశారు DNR. 2014లోనే వైసీపీ నుంచి బరిలో దిగాలని చూసినా.. కొన్ని కేసుల్లో ఆరోపణలు రావడంతో ఉప్పల రాంప్రసాద్‌ను పార్టీ బరిలో నిలిపింది. చివరకు 2019 నాటికి పరిస్థితిని అనుకూలంగా మలుచుకుని.. వైసీపీ అధిష్ఠానాన్ని మెప్పించి.. పోటీ చేసి ఎమ్మెల్యే గెలిచారు DNR. వైసీపీ అధికారంలోకి రావడంతో.. అదే సరైన టైమ్ అనుకున్నారో ఏమో పూర్తిస్థాయిలో ఆధిపత్యం మొదలు పెట్టేశారట. ఈ క్రమంలో పార్టీ కేడర్‌తో దూరం వచ్చిందట. గెలిపించడానికి పనికొచ్చిన తాము.. మిగతా విషయాల్లో గుర్తుకు రాలేదా అని గుర్రుగా ఉన్న పార్టీ శ్రేణులు DNRకు రివర్స్ పంచ్‌లు ఇస్తున్నాయి.
రూ.250 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణ
ప్రస్తుతం ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుపై సొంత పార్టీ నేతలే తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఆయన వ్యతిరేక వర్గంలో బీసీ, ఎస్సీ నేతలు చేరిపోయారు. ఎమ్మెల్యేగా గెలిచిన రెండున్నరేళ్ల కాలంలో DNR 250 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని వైసీపీ రాష్ట్ర బీసీ కార్యదర్శి పాపారావు, మాల మహానాడు నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లో రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర 60 ఎకరాలు, విశాఖలో మరో 50 ఎకరాలు, కైకలూరులో 50 ఎకరాలను DNR కొనుగోలు చేసినట్టు వ్యతిరేక వర్గం లెక్కల చిట్టా బయటపెట్టింది. ఇదేకాదు.. కొల్లేరులోని వందల ఎకరాలను బినామీలకు చెరువులుగా ఇచ్చారని ఆరోపిస్తోంది DNR వ్యతిరేకవర్గం. పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో YCP నుంచి పోటీ చేసేందుకు భారీగా వసూలు చేశారన్నది వ్యతిరేకవర్గం ఆరోపణ. పైగా సొంత సామాజికవర్గానికే ప్రాధాన్యం ఇస్తున్నారని పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.
వ్యతిరేకవర్గం ఆరోపణల్లో పసలేదంటున్న ఎమ్మెల్యే వర్గం
వ్యతిరేకవర్గం చేస్తున్న ఈ ఆరోపణల్లో నిజాలు లేవని.. అవి పసలేని విమర్శలుగా ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు వర్గం కౌంటర్ ఇస్తోంది. అయితే కైకలూరులో ఎమ్మెల్యేకు జరగాల్సిన నష్టం జరిగిపోయిందని ప్రచారం మొదలైంది. సోషల్ మీడియాను ఎమ్మెల్యే వ్యతిరేకవర్గం ఓ రేంజ్లో వాడుకుంటోదట. పోస్టింగ్‌లు.. కామెంట్స్ హోరెత్తిపోతున్నాయి. తొలుత ఈ అంశాన్ని లైట్ తీసుకున్నా.. సమస్య ముదురి DNRకు తలనొప్పిగా మారినట్టు తెలుస్తోంది. టీడీపీ సైతం వ్యతిరేకవర్గం చేస్తున్న ఆరోపణలకు వంత పాడటంతో ఎమ్మెల్యే ఇబ్బంది పడుతున్నట్టు సమాచారం. ఎన్నికల సమయంలో గెలుపుకోసం అన్ని వర్గాలతో సన్నిహితంగా ఉన్న DNR.. గెలిచాక పార్టీలో కొందరిని దూరం పెట్టినట్టు చర్చ జరుగుతోంది. ఆ ప్రభావమే కైకలూరు వైసీపీ రాజకీయాలను వేడెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. మరి.. ఈ చిచ్చు ఇక్కడితో ఆగుతుందో.. మరింత రచ్చకెక్కుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
-
Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
-
Varalaxmi Sarathkumar: “నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా”
-
Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
-
Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!