Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ జిల్లాలో సొంత పార్టీలోనే ఆ మహిళా నేతను వద్దనుకుంటున్నారా..? పార్టీ మరీ అంత హైప్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు అంటున్నారా..? అవకాశం ఉంటే పదవులు ఇవ్వండి అంతే కానీ పదవులను కొత్తగా సృష్టించకండి అని ఓపెన్‌గానే చెప్పేస్తున్నారా..? పార్టీకి ఏం చేశారని జిల్లాలు దాటి మరి ప్రయారిటీ ఇస్తున్నారని నిలదీస్తున్నారా? ఇంతకీ ఎవరా మహిళా నేత..? ఏమిటామె కథ..? లెట్స్ వాచ్.
కాపు ఉద్యమ నాయకుడు, దివంగత ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి గత సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేనకు మద్దతు పలికి ఎన్నికల తర్వాత పార్టీలో చేరారు. అప్పటినుంచి గ్లాసు పార్టీతో ప్రయాణం చేస్తున్నారు. క్రాంతికి మంచి పొజిషన్ ఇస్తామని జనసేన అగ్ర నాయకత్వం హామీ కూడా ఇచ్చిందని అప్పట్లో పార్టీలో చర్చ జరిగింది. అయితే, క్రాంతి సొంత నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లాలో ఉంటుంది. గతంలోనే జనసేన పార్టీ జిల్లాల వారీగా సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కోఆర్డినేషన్ చేసుకోవడానికి కమిటీలు పనిచేస్తాయి. అయితే క్రాంతికి తూర్పుగోదావరిలో కాకుండా కాకినాడ జిల్లాలో అవకాశం ఇచ్చింది పార్టీ. ప్రస్తుతం కాకినాడ మేయర్ పదవి కూటమిలో భాగంగా జనసేనకే దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read
అయితే, కోర్టు కేసుల కారణంగా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగడం లేదు. కానీ… ప్రకటించిన రిజర్వేషన్ల జాబితా ప్రకారం కాకినాడ కార్పొరేషన్ బీసీ మహిళకు రిజర్వ్ అయింది. మొదట క్రాంతికి కాకినాడ కార్పొరేషన్ మేయర్‌గా అవకాశం కల్పిస్తారని ప్రచారం జరిగింది. అయితే రిజర్వేషన్ల ఈక్వేషన్స్ ఆమెకు కలసి రాకుండా పోయాయి. అయితే… ఇప్పుడు ఆమె తండ్రి సొంత నియోజకవర్గ ప్రత్తిపాడులోని ఏలేశ్వరం ZPTCగా క్రాంతి పోటీ చేస్తారని స్థానికంగా గట్టిగానే ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత జనసేన కోటాలో కాకినాడ జడ్పీ చైర్‌పర్సన్‌గా అవకాశం కూడా ఇస్తారని జనసేనలోనే చర్చలు జరుగుతున్నాయట.
రాజకీయంగా అందరికీ అవకాశాలు రావు. వచ్చినప్పుడు మాత్రమే ఉపయోగించుకోవాలి. కానీ మరి ఇన్ని ఆప్షన్స్ క్రాంతికి అవసరమా అంటున్నారట పార్టీ నేతలు. పార్టీ కూడా ఆమెకు అంత ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదని గుసగుసలాడుకుంటున్నారట జనసైనికులు. అసలు ఆమె పార్టీకి ఏం చేసిందని ప్రశ్నిస్తున్నారట. జిల్లాలోనే ఉన్న మరొకరికి అవకాశం ఇవ్వండి.. ఎవరు కాదన్నారు..? ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి ఇక్కడ మా మీద రుద్దుతామంటే అందరూ యాక్సెప్ట్ చేయలేరని చర్చించుకుంటున్నారట. మొదట రాజమండ్రి నుంచి కాకినాడ కార్పొరేషన్‌కు, ఆ తర్వాత స్థానిక సంస్థల పోటీ చేయడానికి కన్వీనెంట్‌గా ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లికి ఆమె ఓటు ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని అనేవాళ్ళు ఉన్నారు. అధికారులు కూడా ఆ విషయంలో హైరానా పడుతున్నారట.
ZPTCగా పోటీ చేయాలంటే స్థానికంగా కచ్చితంగా ఓటు ఉండి తీరాలి. అందుకే ఆ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట. ముద్రగడ పద్మనాభం కుమార్తె అయినప్పటికీ… లేని విషయాలకు హైప్ ఇవ్వాల్సిన అవసరం లేదని, ఎవరు ఎంతవరకు తూగగలరో పార్టీ కూడా గుర్తించాలని అంటున్నారట జనసేన నేతలు. మరోవైపు జిల్లాలో టీడీపీ నేతల్లో కూడా ఈ విషయం చర్చనీయాంశంగా మారిందట. నిజంగానే కాకినాడ జడ్పీ చైర్పర్సన్ పదవిని జనసేనకు అప్పగించేస్తారా..? లేదంటే వాళ్లే ప్రచారం చేసుకుంటున్నారా అనే చర్చ టీడీపీలో జరుగుతోందట. ఇప్పటికే కాకినాడ జిల్లాను జనసేన జిల్లాగా మార్చేశారు. ఇక ఈ మాత్రం కూడా టీడీపీకి మిగిల్చరా అని తమ్ముళ్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారట. తాము త్యాగరాజులుగా మిగిలిపోతామని మీరు మాత్రం పల్లకి ఎక్కి ఊరేగండని ఆక్రోషం వెళ్లగకుతున్నారట. తీరు మార్చుకోకపోతే రోజులు ఎప్పుడు ఒకేలాగా ఉండవని అని గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారట టీడీపీ నాయకులు.
క్రాంతి ZPTCగా పోటీ చేసి జనసేన కోటాలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ కాబోతున్నారని ఆ పార్టీలో చర్చలైతే జరుగుతున్నాయి. కానీ ఆమెకు నాయకులు, కార్యకర్తల మద్దతు మాత్రం లేదట. ఆమెకు అవకాశాలు ఇవ్వొద్దని తాము చెప్పం కానీ… ఎక్కడ్నుంచో తీసుకొచ్చి ఇక్కడ హంగామా చేయకండి అని జనసైనికులు అంటున్నారట. వారికి తెలుగు తమ్ముళ్లు కూడా కోరస్ పలుకుతున్నారట.
తాజావార్తలు
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
-
OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
-
Flight Ticket Price Control: విమాన టికెట్ల ధరలకు కళ్లెం.? కేంద్రం కొత్త రూల్స్.!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!