బొత్స బంధువుల మధ్య ఆధిపత్య పోరు…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయనగరం వైసీపీలో రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయా? కొత్త నీరు పార్టీలో పెత్తనం చేయబోతోందా? సొంత కుటుంబ సభ్యులే శత్రువుతో చేతులు కలిపారా? బంధువుల మధ్య తలెత్తిన ఆధిపత్యపోరు చినికిచినికి గాలివానగా మారుతోందా? ఇన్నాళ్లు పెద్ద దిక్కుగా ఉన్న ఆ నేత వీటన్నింటిని ఎలా చూస్తున్నారు? ఏం జరుగుతోంది?
బొత్స సొంత జిల్లాలో మేనల్లుడి హవా?
Also Read
విజయనగరం జిల్లా పేరు చెబితే బొత్స సత్యనారాయణ గుర్తుకు వస్తారు. రాజకీయ నేపథ్యం ఏ మాత్రంలేని కుటుంబం నుంచి వచ్చిన బొత్స ఉమ్మడి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా ఎదిగారు. ఆయన ఉన్న పార్టీలో ఆయన ఎంత చెబితే అంతే.. అంతే జరుగుతుంది. ఓ దశలో సీఎం పదవి రేసులో కూడా నిలిచారు. అలాంటి బొత్స వైసీపీ అధికారంలోకి రావడంతోనే మునిసిపల్ శాఖ మంత్రి అయ్యారు. పార్టీలో, ప్రభుత్వంలో బొత్స హవా సంగతి ఎలా ఉన్నా.. సొంత జిల్లాలో ఆయన మేనల్లుడి ప్రభ మాత్రం వెలిగిపోతోంది.
జడ్పీ ఛైర్మన్‌గా ఉన్న చిన్న శ్రీను..!
విజయనగరం వైసీపీ రాజకీయాలు ఈ మధ్య ఆసక్తిగా కనిపిస్తున్నాయి. బొత్స మేనల్లుడు చిన్న శ్రీను జడ్పీ చైర్మన్ అయ్యారు. చిన్న శీను బొత్సకు రైట్ హ్యాండ్. బొత్స రాష్ట్ర స్థాయి రాజకీయాలతో బీజీ బీజీగా ఉండే రోజుల్లో జిల్లాలో చిన్న శ్రీనుదే హవా. గ్రౌండ్ లెవల్లో అన్నీ శీను కనుసన్నల్లోనే జరిగేవట. జిల్లాలో ఏదైనా పనికోసం ఎవరైనా వచ్చినా వాళ్లను చిన్న శ్రీనును కలవమని చెప్పేవారట బొత్స. ఒకరకంగా చెప్పాలంటే బొత్స అంటే చిన్న శ్రీను… చిన్న శ్రీను అంటే బొత్స అన్న మాట.
చిన్న శ్రీను జడ్పీ ఛైర్మన్ అయ్యాక బొత్సతో గ్యాప్?
అలాంటి చిన్న శ్రీను జడ్పీ చైర్మన్ అయ్యాక బొత్సకు దూరం అయ్యారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేలు సహా చిన్నా చితకా నేతలు చిన్న శ్రీనును ఫాలో అవుతున్నారట. అంతేకాదు.. విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికి బొత్సతో అస్సలు పొసగదు. వారిద్దరు కాంగ్రెస్‌లో ఉన్నప్పటి నుంచి విబేధాలు ఉన్నాయి. అవి వైసీపీలో కూడా కంటిన్యూ అవుతున్నాయి. అలాంటి వీరభద్రస్వామి ఇప్పుడు చిన్న శ్రీనుకు దగ్గర అయ్యారు. వాళ్లిదరూ కలిసిమెలిసి తిరుగుతున్నారు. విజయనగరం కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు రెండూ వీరభద్రస్వామి, చిన్న శ్రీను వర్గీయులకే దక్కాయి.
చిన్న శ్రీను అనుచరుడికే ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం?
స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధిగా శృంగవరపుకోట నియోజకవర్గానికి చెందిన ఇందుకూరి రఘురాజు ఎంపిక అయ్యారు. ఆయన కూడా చిన్న శ్రీను ఫాలోయరేనట. ఇది దేనికి సంకేతమో ఎవరికీ అంతుబట్టడం లేదు.
నెల్లిమర్లలో బొత్స వర్సెస్ బడ్డుకొండ..!
దీనికంతటికీ కారణం బొత్స ఫ్యామిలీలో జరుగుతున్న రాజకీయాలే కారణం అట. బొత్సకు వరసకు తమ్ముడు అయ్యే బడ్డుకొండ అప్పలనాయుడు నెల్లిమర్ల ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ బొత్స సొంత తమ్ముడు లక్ష్మణరావు.. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా వర్గం నడుపుతున్నారు. స్థానిక ఎన్నికల సమయంలో పూసపాటిరేగలో ఈ ఇద్దరి మధ్య బహిరంగంగానే వాగ్వాదం జరిగింది. లక్ష్మణరావు తనను ఇబ్బందిపెడుతున్నారుని అప్పలనాయుడు హైకమాండ్‌కు ఫిర్యాదు కూడా చేశారు. వచ్చే ఎన్నికల్లో నెల్లిమర్ల నుంచి పోటీ చేయాలని లక్ష్మణరావు భావిస్తున్నారు. అందుకే ఎమ్మెల్యే అప్పలనాయుడికి వ్యతిరేకంగా శిబిరం నడుతుపున్నారట. లక్ష్మణరావును అదుపు చేయాలని అప్పలనాయుడు అప్పట్లో బొత్సాను కోరారు కూడా. బొత్సా చెప్పారో లేక తనంతటతానే తగ్గారో కానీ ఆ తర్వాత లక్ష్మణరావు స్పీడ్ తగ్గించారు.
ఎమ్మెల్యే బడ్డుకొండకు చిన్న శ్రీను బావ..!
ఇక్కడ విశేషం ఏంటంటే… బొత్స తమ్ముడి లక్ష్మణరావుతో ఇబ్బందిపడుతున్న నెల్లిమర్ల ఎమ్మెల్యే అప్పలనాయుడుకి చిన్న శ్రీను బావ అవుతారు. బొత్స తమ్ముడి చేతిలో ఇబ్బందిపడ్డ బావ కోసం చిన్న శ్రీను వేరు కుంపటి పెట్టారో లేక… జడ్పీ చైర్మన్‌గా తనకంటూ ఓ వర్గం ఉండాలని అనుకుంటున్నారో కానీ… మొత్తానికి ఆయన జిల్లా రాజకీయాల్లో సపరేట్గా మారిపోయారు. అంతేకాదు.. ఎప్పుడూ బొత్స వెనక కనిపించే చిన్న శ్రీను ఇప్పుడు అస్సలు కనిపించడం లేదు. పైడితల్లి అమ్మవారి జాతరకు బొత్స వచ్చినప్పుడు పక్కన చిన్న శ్రీను ఉండేవారు. మొన్న మాత్రం ఇద్దరూ విడివిడిగా వచ్చారు. దీంతో విజయనగరం వైసీపీలో సమీకరణాలు మారుతున్నాయా అనే చర్చ జరుగుతోంది.
తాజావార్తలు
-
Aryavir Sehwag: తండ్రిని మించిన కొడుకు.. సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ బ్యాటింగ్ స్టైల్ చూశారా?
-
Irumbudi Collections: బాక్సాఫీస్‌లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి!
-
Ambati Rambabu: నన్ను కేసులతో బెదిరించాలనుకుంటే బెదిరేవారు ఎవరూ లేరు.. అంబటి సంచలన వ్యాఖ్యలు
-
Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలపై వైద్యశాఖ భారీ కసరత్తు.. 1,110 వైద్య శిబిరాలు, 30 ఫీల్డ్ ఆస్పత్రులు..
ట్రెండింగ్
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?