Vizianagaram YCP Politics: విజయనగరం జిల్లా రాజకీయాలు హాట్‌హాట్‌గా మారుతున్నాయి. వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంటోంది. నేతల మధ్య పోరు కన్నా.. అది సామాజికవర్గాల రణంగా మారడంతో మరింత వేడెక్కుతోంది. ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి పేరు చెబితే విజయనగరం బీసీ నేతలు రుస రుసలాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కోలగట్లకు కాకుండా బీసీలకు వైసీపీ టికెట్ కేటాయించాలని స్వరం పెంచుతున్నారు అధికారపార్టీలోని ఆ వర్గం నాయకులు. మూడు నెలలుగా ఇదే పెద్ద చర్చగా ఉంది. ఏ కార్యక్రమం చేపట్టినా…
విజయనగరం వైసీపీలో రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయా? కొత్త నీరు పార్టీలో పెత్తనం చేయబోతోందా? సొంత కుటుంబ సభ్యులే శత్రువుతో చేతులు కలిపారా? బంధువుల మధ్య తలెత్తిన ఆధిపత్యపోరు చినికిచినికి గాలివానగా మారుతోందా? ఇన్నాళ్లు పెద్ద దిక్కుగా ఉన్న ఆ నేత వీటన్నింటిని ఎలా చూస్తున్నారు? ఏం జరుగుతోంది? బొత్స సొంత జిల్లాలో మేనల్లుడి హవా? విజయనగరం జిల్లా పేరు చెబితే బొత్స సత్యనారాయణ గుర్తుకు వస్తారు. రాజకీయ నేపథ్యం ఏ మాత్రంలేని కుటుంబం నుంచి వచ్చిన బొత్స…