Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record In Nakirekal Trs Infighting Is At Its Peak

TRS : నకిరేకల్ టీఆర్ఎస్ లో తారాస్థాయిలో ఇంటిపోరు.. తల పట్టుకుంటున్న అధిష్టానం

Published Date :July 11, 2022 , 11:31 am
By Premchand Chowdary
TRS : నకిరేకల్ టీఆర్ఎస్ లో తారాస్థాయిలో ఇంటిపోరు.. తల పట్టుకుంటున్న అధిష్టానం
  • Follow Us :
  • google news
  • dailyhunt

చిరుమర్తి లింగయ్య. నకిరేకల్ ఎమ్మెల్యే. 2018లో కాంగ్రెస్‌ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లోకి వచ్చారు. ఈయనేమో వేముల వీరేశం. మాజీ ఎమ్మెల్యే. టీఆర్ఎస్‌ నేత. గత ఎన్నికల్లో లింగయ్య చేతిలో ఓడిపోయారు వీరేశం. ఇక ఈయన కంచర్ల భూపాల్‌రెడ్డి. నల్లగొండ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే. ముగ్గురూ ముగ్గురే. ఈ ముగ్గురి చుట్టూనే ప్రస్తుతం నకిరేకల్‌ టీఆర్ఎస్‌ రాజకీయం రకరకాల మలుపులు తిరుగుతోంది. లింగయ్య పేరు చెబితేనే వీరేశం.. భూపాల్‌రెడ్డిలు ఒంటికాలిపై లేస్తున్నారు. ఇక కాంగ్రెస్‌ను వీడి కారెక్కినప్పటి నుంచి వీరేశం, భూపాల్‌రెడ్డిలతో ఢీ అంటే ఢీ అనడమే సరిపోతోందని తల పట్టుకుంటున్నారు లింగయ్య.

నియోజకవర్గంలో ఇంటిపోరుతో లింగయ్య ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టు నకిరేకల్‌లో జరుగుతున్న పరిణామాలు వెల్లడిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ టికెట్‌పై చాలా ఆశలు పెట్టుకున్నారు వీరేశం. నకిరేకల్‌లో పట్టు కోల్పోకుండా రకరకాల ప్రయత్నాలు చస్తున్నారు. ఈ క్రమంలో జరుగుతున్న సంఘటనలు చిరుమర్తి వర్సెస్‌ వేముల అన్నట్టుగా ఉంటున్నాయి. అధినాయకత్వం ఆశీసులతో నియోజకవర్గంలో పనులు చేసుకుంటున్నా.. వీరేశం ప్రత్యర్థిగా మారడంతో ఏం పాలుపోవడం లేదట లింగయ్యకు. గ్రామాల్లో పర్యటిస్తుంటే వీరేశం మనుషులు అడ్డుకోవడంతోపాటు పార్టీ కమిటీల కూర్పులోనూ తగువులు తప్పడం లేదట.

ఎమ్మెల్యే.. మాజీ ఎమ్మెల్యేల మధ్య గొడవ ఇలా ఉంటే.. నకిరేకల్‌లో లింగయ్యకు మరో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి నుంచి తలపోట్లు తప్పడం లేదట. భుపాల్‌రెడ్డి నల్లగొండ ఎమ్మెల్యే అయినప్పటికీ..ఆయన సొంతూరు నకిరేకల్‌ నియోజకవర్గంలోని చిట్యాల మండలంలో ఉంది. ఆ మండలంలో ఆధిపత్యం కోసం భూపాల్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారట. అక్కడ తన మాట నెగ్గడం లేదనే ఆవేదనలో ఉన్నారట లింగయ్య. ఒకవైపు వీరేశం.. ఇంకోవైపు భుపాల్‌రెడ్డి కుమ్మేస్తున్నారని అనుచరుల దగ్గర చెప్పి వాపోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లోకి వస్తే.. స్వపక్ష నాయకులే విపక్షంగా మారతారని ఊహించలేదని చెబుతున్నారట.

సమస్య శ్రుతిమించి.. రాజకీయంగా ఇబ్బందిగా మారడంతో వేముల వీరేశం.. ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డిలపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారట ఎమ్మెల్యే లింగయ్య. ప్రస్తుతం ఈ వర్గాల మధ్య సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో పోరాటం సాగుతోంది. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఎన్నికల దిశగా వేడెక్కుతుండటంతో అందరి దృష్టీ పార్టీ పెద్దలు తీసుకునే నిర్ణయంపై ఉందట. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు నిర్వహిస్తున్నారు. ఆ సర్వేల ఫలితం ఏంటోకానీ.. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టుగా ఎవరికి అనుకూలంగా వాళ్లు చర్చకు పెట్టేస్తున్నారు. మరి.. ఎన్నికల నాటికి నకిరేకల్‌ టీఆర్‌ఎస్‌ రాజకీయం ఎలాంటి టర్న్‌ తీసుకుంటుందో చూడాలి.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • chirumarthi lingaiah
  • Kancharla Bhupal Reddy
  • Nakrekal
  • Nalgonda MLA
  • vemula veeresham

తాజావార్తలు

  • Yuvraj Singh 6 Sixes Story: “నా కొడుకు కెరీర్‌ను ముగించావు”.. యువరాజ్‌తో స్టువర్ట్ బ్రాడ్ తండ్రి ఎమోషనల్!

  • Prabhas Fauji : ప్రభాస్ ‘ఫౌజీ’ స్పీడ్ మామూలుగా లేదుగా!

  • Jasmine Perfume at Home: ఇంట్లోనే మల్లె పువ్వులతో పెర్ఫ్యూమ్ ఇలా తయారు చేయండి.. ఖరీదైన పెర్ఫ్యూమ్‌లు కూడా పనికిరావు అంతే..!

  • Dacoit Overseas Review : డెకాయిట్ ఓవర్శీస్ రివ్యూ.. సగం ఉడికిన ప్రేమ వ్యధ

  • Iran Missile Attack: సౌదీ ‘జీవనాడి’పై క్షిపణి దాడి.. చమురు పైప్‌లైన్‌ను దెబ్బతీసిన ఇరాన్!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions