గడిచిన రెండు ఎన్నికలలోనూ వైసీపీకి ఉమ్మడి విజయనగరం జిల్లా ఏజెన్సీలో తిరిగులేని మెజారిటీని అందించారు జనం. ఇప్పుడు సాలూరు, పార్వతీపురం, కురుపాం, పాలకొండ సెగ్మెంట్లను కలుపుతూ కొత్తగా మన్యం జిల్లాను ఏర్పాటు చేసింది. జిల్లా వైసీపీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టారు మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి. ఆ హోదాలో జిల్లా కేంద్రంలో మొదటి సమావేశం ఏర్పాటు చేశారు కూడా. ఈ సందర్భంగా ఫ్లెక్సీలతో నగరాన్ని ముంచేశారు. అంతా కలిసి సాగుతారు అని అనుకుంటున్న తరుణంలో నాయకుల మధ్య…