Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Did Politics Start In Tdp Who Is The Only Woman Leader Not Declining

టీడీపీలో సిగ పట్లు మొదలయ్యాయా..? తగ్గేదే లేదంటున్న మహిళా నేత ఎవరు..?

Published Date :May 18, 2022 , 12:07 pm
By Premchand Chowdary
టీడీపీలో సిగ పట్లు మొదలయ్యాయా..? తగ్గేదే లేదంటున్న మహిళా నేత ఎవరు..?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

విజయనగరం రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తిగా ఉంటాయి. అలాంటి చోట టీడీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంటోంది. ఎవరి నోట విన్నా ఆ మహిళా నేతలే పేర్లే చర్చల్లో ఉంటున్నాయి. విజయనగరంపై పట్టుకోసం అదితి గజపతిరాజు, మాజీ ఎమ్మెల్యే మీసాల గీత గట్టిగా పోటీ పడుతున్నారు. 2019 ఎన్నికల నుంచి ఇప్పటి వరకు అదే పరిస్థితి ఉంది.

2019లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే మీసాల గీతను కాదని.. కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజుకు టికెట్‌ ఇచ్చారు. అప్పటి నుంచి అశోక్‌ వర్గానికి.. గీత వర్గానికి అస్సలు పడటం లేదు. అదితి.. గీతల మధ్య ఉప్పు నిప్పులా ఉంది రాజకీయం. టీడీపీ ఆఫీసు అశోక్‌ బంగ్లాలో ఉండటంతో.. విజయనగరంలోనే మరోచోట పార్టీ ఆఫీస్‌ తెరిచి చర్చగా మారారు గీత. ఆ వివాదం పార్టీ పెద్దల వరకు వెళ్లింది. అయినా వెనక్కి తగ్గలేదు మాజీ ఎమ్మెల్యే.

Also Read

  • Off The Record: రచ్చ రచ్చ అవుతున్న గజ్వేల్ కాంగ్రెస్ గొడవ
  • Off The Record: విభేదాలకు చెక్ పెట్టబోతున్న పవన్ కల్యాణ్‌..!
  • Off The Record: ఆ జిల్లా కలెక్టర్ ని చూసి ఎమ్మెల్యేలు భయపడుతున్నారా..?
  • Off The Record: కలిసిరాని నియోజకవర్గాన్ని టీడీపీ పూర్తిగా సైడ్ చేసేసినట్టేనా?
Add as a preferred
source on google

2019 ఎన్నికల్లో ఓడిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన అదితి.. కరోనా టైమ్‌లో బయటకు రాలేదు. మున్సిపల్‌ ఎన్నికల సమయంలో మాత్రం తళుక్కుమన్నారు. రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నట్టు చంద్రబాబుకు అదితి చెప్పారని ప్రచారం జరిగింది. కానీ.. విజయనగరంలో టీడీపీ కార్యక్రమాలు చూసుకోవాలని అధినేత చెప్పారట. దాంతో నియోజకవర్గంలో అదితికే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని పార్టీలో ఆమె అనుచరులు ప్రచారం మొదలుపెట్టేశారు.

జరుగుతున్న పరిణామాలపై గుర్రుగా ఉన్న మీసాల గీత.. ఎన్నికల నాటికి రాజకీయాల్లో మార్పులు వస్తాయనే లెక్కలతో ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం ఇద్దరి మధ్య విజయనగరం నీదా నాదా అనేట్టు ఇద్దరి మధ్య పోరు నడుస్తోంది. అయితే మాజీ ఎమ్మెల్యేకు మనసులో ఎక్కడో డౌట్‌ తేడా కొడుతోందట. కానీ అదేమీ బయటపడకుండా 2024 ఎన్నికలే లక్ష్యంగా గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకుంటున్నారు గీత. ప్రస్తుతంఉన్న పరిస్థితుల్లో రెండు వర్గాలు కలిసి నడవకపోతే ప్రత్యర్థులు లబ్ధి పొందే ప్రమాదం ఉందని తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారట. ఈ విషయం తెలిసినా రెండు వర్గాలు ప్రస్తుతం కలిసి పనిచేసే పరిస్థితులు కనిపించడం లేదు. తండ్రి చాటు తనయగా కాకుండా అదితి సొంతంగా రాజకీయాలు చేస్తే చూడాలని ఉన్నట్టు సెటైర్లు వేస్తోంది మాజీ ఎమ్మెల్యే వర్గం. పార్టీ పెద్దలు కూడా ఇద్దరి మధ్య సయోధ్యకు ప్రయత్నం చేయడం లేదు. అందుకే రానున్న రోజుల్లో విజయనగరం టీడీపీ రాజకీయం ఎలాంటి మలుపులు తిరుగుతుందో అనే ఆసక్తి నెలకొంది. మరి విజయనగరం టీడీపీలో సిగపట్లకు ఎండ్‌కార్డు పడుతుందో లేదో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ashok Gajapathi raju
  • tdp
  • Vijanagaram MLA Meesala Geetha
  • vijayanagaram

తాజావార్తలు

  • Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్‌గా ఇలా ట్రై చేయండి!

  • Tamil Politics: విజయ్‌పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?

  • RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!

  • PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..

  • PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions