ఉత్తరాంధ్రలో కీలకంగా ఉండే ఉమ్మడి విజయనగరం జిల్లా ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. అధినేతలు సైతం ఇక్కడ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపించేవారు. రోజులన్నీ ఒకేలా ఉండవన్నట్టు రాజకీయం మారిపోయింది. 2014 ఎన్నికల తర్వాత అది స్పష్టంగా కనిపిస్తోంది. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చినా.. పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు శిబిరంలో కొందరు… ఆయనంటే గిట్టని వారు మరో శిబిరంలో చేరిపోయారు. 2014లో టీడీపీ గెలిచాక.. జిల్లా ఇంఛార్జ్…
విజయనగరం రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తిగా ఉంటాయి. అలాంటి చోట టీడీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంటోంది. ఎవరి నోట విన్నా ఆ మహిళా నేతలే పేర్లే చర్చల్లో ఉంటున్నాయి. విజయనగరంపై పట్టుకోసం అదితి గజపతిరాజు, మాజీ ఎమ్మెల్యే మీసాల గీత గట్టిగా పోటీ పడుతున్నారు. 2019 ఎన్నికల నుంచి ఇప్పటి వరకు అదే పరిస్థితి ఉంది. 2019లో సిట్టింగ్ ఎమ్మెల్యే మీసాల గీతను కాదని.. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజుకు టికెట్ ఇచ్చారు.…