Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Covert Politics In Sangareddy District Bjp

Off The Record: కోవర్ట్ రాజకీయాల హీట్

Published Date :December 23, 2022 , 9:55 pm
By NTV WebDesk
Off The Record: కోవర్ట్ రాజకీయాల హీట్
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

పార్టీల రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు నియోజకవర్గాలకు వస్తే.. స్థానిక నేతలు శాలువాలు కప్పి సత్కరిస్తారు.. లేదా పూల బొకేలు చేతిలో పెడతారు. ఆ జిల్లాలో మాత్రం జాతీయ పార్టీ జిల్లా అధ్యక్షుడికి పిడిగుద్దులు రుచి చూపించారట. వచ్చిన నాయకుడిని ఓ రేంజ్‌లో కుమ్మేశారట. సొంత పార్టీ నేతపై కేడర్‌ ఆగ్రహం వ్యక్తం చేయడానికి దారి తీసిన కారణాలేంటి?

Also Read

  • Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
  • Off The Record : వైసీపీకి డోర్స్ క్లోజ్.. పవనే నా బాస్! రూమర్లకు చెక్ పెట్టిన బాలినేని
  • Off The Record : కారు స్పీడ్ పెంచేందుకు వ్యూహకర్త రెడీ? కేసీఆర్ కొత్త టీమ్.. పాత జోష్ వస్తుందా?
  • Off The Record : పీఎం హైదరాబాద్ టూర్ పై పొలిటికల్ చర్చ..
Add as a preferred
source on google

సంగారెడ్డి జిల్లా బీజేపీలో కోవర్టు రాజకీయాల హీట్‌
బీజేపీలో క్రమశిక్షణ ఎక్కువ అని చెబుతారు. అసంతృప్తి ఉన్నా పెద్దగా బయటకు చెప్పుకోరు. కాకపోతే పార్టీ పెద్దలకు ఫిర్యాదులూ గట్టిగానే వెళ్తుంటాయి. వాటిపై చర్యలు తీసుకుంటారు. ఈ విధానం లాభం లేదని అనుకున్నారో ఏమో.. సంగారెడ్డి జిల్లా బీజేపీ నేతలు ఎంచుకున్న మార్గం కాషాయ శిబిరంలో చర్చగా మారింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డిపై స్థానిక నేతలకు పీకలదాకా ఆగ్రహం ఉందట. ఆయనే కోవర్టు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు పార్టీ నాయకులు. ఈ సమస్య శ్రుతిమించి ఆయనపై సొంత పార్టీ నేతలే దాడి చేసే వరకు వెళ్లినట్టు కాషాయ దండు చెవులు కొరుక్కుంటోంది.
.
పాతవారిని విస్మరించడంపై కేడర్‌ గగ్గోలు
జిల్లాలో బీజేపీ పుంజుకుంటుంది అని భావిస్తున్న చోట.. ఇతర పార్టీల నేతలను తీసుకొచ్చి కోవర్టు రాజకీయాలు చేస్తున్నారనేది నరేందర్‌రెడ్డిపై స్థానిక నాయకుల ఆరోపణ. కొద్దికాలంగా నియోజకవర్గాల్లో వర్గపోరుకు ఇదే కారణమని ఫిర్యాదు చేస్తున్నారట. బీజేపీలో చేరిన కొత్తవారికి ప్రాధాన్యం ఇవ్వడంలో తప్పులేకపోయినా.. అదే పనిగా పాతవారిని విస్మరిస్తే అనుమానించాల్సి వస్తోందని కేడర్‌ వాపోతోందట. ఈ ఏడాది సెప్టెంబర్‌లో సంగారెడ్డిలో బీజేపీ ప్రజాగోస.. బీజేపీ భరోసా యాత్ర చేపట్టింది. ఇక్కడ బీజేపీ ఇంఛార్జ్‌ను కాదని.. మరో నేత వచ్చి యాత్ర చేయడం వెనుక నరేందర్‌రెడ్డి పాత్ర ఉందని ఆరోపిస్తున్నారు. ఈ నెల 14న జహీరాబాద్‌లోనూ సరిగ్గా సంగారెడ్డి లాంటి ఘటనే జరిగిందని పార్టీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. జహీరాబాద్‌ బీజేపీ ఇంఛార్జ్‌ను కాదని.. మరో వ్యక్తి పెత్తనంతో సమస్యలు వస్తున్నాయని పార్టీ పెద్దలకు చెప్పారట.

జహీరాబాద్‌ వచ్చిన జిల్లా చీఫ్‌పై దాడి?
జహీరాబాద్‌ బీజేపీలో ప్రస్తుతం ఇద్దరు నేతల మధ్య టికెట్‌ ఫైట్ నడుస్తోంది. సమస్య చినికి చినికి గాలి వానగా మారడంతో.. సర్దుబాటు చేయడానికి నరేందర్‌రెడ్డి చొరవ తీసుకున్నారట. అలా వచ్చిన నరేందర్‌రెడ్డిపై పార్టీ కేడర్‌ దాడి చేసినట్టు చెబుతున్నారు. దాంతో అక్కడ నుంచి మెల్లగా జారుకున్నారట నరేందర్‌రెడ్డి. ఇప్పటికే జిల్లాలోని పలు నియోజకవర్గాల బీజేపీ కేడర్‌ నుంచి జిల్లా అధ్యక్షుడి తీరుపై రాష్ట్ర పార్టీకి ఫిర్యాదులు వెళ్లినట్టు తెలుస్తోంది. కోవర్టు రాజకీయాలు.. వర్గపోరును ప్రోత్సహించేలా నరేందర్‌రెడ్డి తీరు ఉందని ఆ ఫిర్యాదుల్లో ప్రధానంగా ఆరోపించారట. జహీరాబాద్‌ ఘటనలు కూడా రాష్ట్ర నాయకత్వం దృష్టికి కూడా వెళ్లిందట. సంగారెడ్డి బీజేపీలో గొడవలు మరింత శ్రుతిమించకుండా రాష్ట్ర పార్టీ పెద్దలు చర్యలు తీసుకుంటారో లేదో అని కేడర్‌ చెవులు కొరుక్కుంటోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bandi sanjay
  • bjp
  • cm kcr
  • off the record
  • sangareddy

తాజావార్తలు

  • AIADMK MLAs Support Vijay: అన్నాడీఎంకేలో భారీ చీలిక.. విజయ్‌ గూటికి 30 మంది ఎమ్మెల్యేలు..

  • Madhav Tiwari: నేను 4 ఓవర్లు బౌలింగ్ చేశా, ఇప్పటికీ నమ్మలేకపోతున్నా.. డీసీ ప్లేయర్ ఆనందం!

  • High Court: భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య.. జస్ట్ రూ.500 జరిమానా విధించి నిర్దోశిగా తేల్చిన హైకోర్టు

  • Cannes 2026: కేన్స్ ఫెస్టివల్‌లో దేశీ గ్లామర్ షో.. ఖర్చులు చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!

  • Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!

ట్రెండింగ్‌

  • Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్‌ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!

  • 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..

  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions