Site icon NTV Telugu

Off The Record: విశాఖలో టీడీపీ ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యేల మధ్య కోల్డ్ వార్ నడుస్తుందా?

Vsp

Vsp

Off The Record: టీడీపీ అధిష్టానానికి అత్యంత దగ్గరి వాడైన ఆ ఎంపీ… తన పరిధిలోని ఎమ్మెల్యేల మీద కత్తిగట్టారా? హైకమాండ్‌ అండతో పెత్తనం చేయాలనుకుంటున్నారా? ఎమ్మెల్యేలు కూడా తగ్గేదే లే అంటున్నారా? ఇన్నాళ్ళు ఉన్న కోల్డ్‌వార్‌ ఇక డైరెక్ట్‌ అయిపోయినట్టేనా? ఎమ్మెల్యేలు, ఎంపీ మధ్య ఉన్నది సమన్వయ లోపమా? లేక దీర్ఘకాలపు రాజకీయ వ్యూహమా? ఎక్కడ జరుగుతోందా తంతు?

Read Also: Off The Record: NRI టీడీపీ ఎమ్మెల్యేని తొక్కేయడానికి వ్యూహాలు రచిస్తున్నారా?

విశాఖ టీడీపీలో పరిస్థితులు మారుతున్నాయా? గ్రేటర్ మీద పట్టుబిగించేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీ మధ్య పోటీ మొదలైందా అంటే… ఎస్‌, పరిస్థితులన్నీ అలాగే కనిపిస్తున్నాయన్నది పరిశీలకుల సమాధానం. పార్టీ అధిష్టానానికి అత్యంత దగ్గరి బంధువు కావడంతో… మొదట్లో విశాఖ ఎంపీ శ్రీభరత్‌కు విపరీతమైన ప్రాధాన్యం లభించింది. ఆయన కూడా సీనియర్ శాసనసభ్యులతో సమన్వయం చేసుకుంటూ వెళ్ళినట్టే కనిపించింది. కానీ… కాలం గడిచే కొద్దీ అంతర్గత పరిణామాలు కోల్డ్ వార్‌కు దారి తీస్తున్నాయంటున్నారు. నా పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలంతా నా మాట వినాల్సిందేననే ధోరణిలో ఎంపీ వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం పెరుగుతోంది. ఎంపీ ఇటీవల ఎమ్మెల్యేలతో కలిసి కార్యక్రమాలకు వెళ్ళేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదన్న ప్రచారం జరుగుతోంది. అలాగే.. కీలక పోస్టింగులు, బదిలీల విషయంలోనూ… కోటరీకి పెద్దపీట వేస్తున్నారే తప్ప స్థానిక ఎమ్మెల్యేలను పరిగణనలోకి తీసుకోవడం లేదనే గుసగుసలు ఎక్కువయ్యాయి.

Read Also: Off The Record: పొంగులేటిని బాంబుల శ్రీనివాస్ అని ట్రోల్ చేస్తున్నారా..? ఎందుకు..?

VMRDAకు సంబంధించిన కీలకమైన పోస్ట్‌ విషయంలో శ్రీభరత్ పట్టుబట్టి తీసుకుని వచ్చిన అధికారిని మార్చేయాలంటూ ప్రభుత్వ పెద్దలను కలిసే ప్రయత్నాల్లో ఉన్నారట ఎమ్మెల్యేలు.అదే సమయంలో వివిధ కారణాలతో శాసనసభ్యులకు వ్యతిరేక వర్గంగా ముద్రపడ్డ నాయకులను ఎంపీ చేరదీస్తున్నారనే విమర్శలు ఎక్కువయ్యాయి. ఎంపీ కారణంగా ఎస్.కోట టీడీపీలో రెండు వర్గాల మధ్య వార్‌ ఓపెనైపోయినట్టు చెప్పుకుంటున్నారు. ఇటు భీమిలి రాజకీయాల్లో కూడా ఫింగర్ పెట్టేందుకు భరత్ ప్రయత్నాలు చేయగా… సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ చాతుర్యం ముందు ఆ ఎత్తులు వర్కవుట్ కావడం లేదని తెలుస్తోంది. విశాఖ సౌత్‌లో జనసేన ఎమ్మెల్యే వంశీ కృష్ణ యాదవ్., ఎంపీల మధ్య సాన్నిహిత్యం బాగానే వున్నప్పటికీ రాజకీయ విభేదాలు స్పష్టం అవుతున్నాయి. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ సీతంరాజు సుధాకర్ భరత్ వర్గీయుడు కాగా ఎమ్మె ల్యేకి, సీతంరాజుకు మధ్య కో ఆర్డినేషన్ సమస్యగా మారింది. విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు మొదటి నుంచి వర్గ రాజకీయాలకు దూరం. ఇక్కడ సీనియర్లను ప్రోత్సహించే ఆలోచనతో ఎంపీ ప్రయత్నాలు చేసినప్పటికీ నియోజకవర్గం చుట్టూ లక్ష్మణరేఖ గీసేసి తిప్పికొడుతున్నారట గణబాబు.

Read Also: Disha Patani : వర్షాకాలంలో ఘాటు పెంచేస్తున్న దిశాపటానీ

ఇక, పెందుర్తిలో అయితే ఎడతెగని పంచాయితీ నడుస్తోంది. జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుకు….మాజీ ఎమ్మెల్యే గండిబాబ్జీకి ఒక్క నిముషం పొసగడం లేదు. పార్టీ అధ్యక్షుడైన బాబ్జీ ఎంపీకి ప్రధాన అనుచరుడు. తూర్పు నియోజకవర్గంలో నాలుగోసారి విజయం సాధించిన వెలగపూడి రామకృష్ణ బాబుకి ఇంత కాలం వ్యతిరేక వర్గం అనే మాటే లేదు. ఎన్నికలప్పుడు తప్ప మిగిలిన సమయాల్లో ఆయన రాజకీయాల జోలికి వెళ్ళకపోవడమే అందుకు కారణమని చెప్పుకుంటారు. అటువంటి చోట కూడా శ్రీభరత్ ఒక వర్గాన్ని పెంచి పోషిస్తున్నట్టు చెప్పుకుంటున్నాయి టీడీపీ వర్గాలు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న గాజువాక నియోజకవర్గ ఇష్యూస్ లోనూ ఎంపీ వేలెట్టడం ఇటీవల చర్చనీయాంశం అయింది. భూ కబ్జాలకు ప్రయత్నించిన వాళ్ళకు ఎంపీ అండగా నిలిచారనే ప్రచారం జరగడం….ఈ వ్యవహారాన్ని పల్లా సీరియస్ గా తీసుకోవడం కీలక పరిణామం. ఇక విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఇన్చార్జ్ ను నియమించి తెరవెనుక వ్యవహారాలు నడిపిస్తున్నారట ఎంపీ. ఈ రకంగా విశాఖ టిడిపిలో గ్రూపు రాజకీయాలు పెరుగుతున్నాయని, అందుకు కారణం ఎంపీ తన సొంత వర్గాన్ని ప్రోత్సహించే ప్రయత్నం చేయడమేనన్న వాదన బలపడుతోంది.

Read Also: PIB Fact Check: నో ‘ఫ్రీ స్యూటీలు’.. ఫ్యాక్ట్‌చెక్ షాకింగ్ పోస్ట్

దాదాపు ప్రతిచోట ఎమ్మెల్యేలు ఒక వర్గం, ఎంపీది మరో వర్గంగా నడుస్తోందని, ఇది పార్టీకి మంచిది కాదంటున్నారు ద్వితీయ శ్రేణి నాయకులు. ఎమ్మెల్యేలను ఎంపీ.. ఎంపీని ఎమ్మెల్యేలు ప్రభావితం చేసుకునే వాతావరణం ఎట్టిపరిస్ధితుల్లోనూ మంచి చేయదని సీనియర్స్‌ గగ్గోలు పెడుతున్నారు. సాధారణంగా ఎంపీలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోరు. శ్రీభరత్‌ మాత్రం అందుకు భిన్నంగా వెళ్తున్నారన్న చర్చలు నడుస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే… వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో దిగేందుకు శ్రీ భరత్‌ రంగం సిద్ధం చేసుకుంటున్నారని, దాని కోసం ఇప్పటి నుంచే తన వర్గాన్ని తయారు చేసుకుంటున్నారన్న అనుమానం కలుగుతోందంటున్నారు పరిశీలకులు. తనకు అనుకూలమైన నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకునే క్రమంలోనే… వీలున్న అన్ని చోట్ల వేళ్ళు పెడుతున్నట్టు అంచనా వేస్తున్నారు. కారణం ఏదైనా కావచ్చుగానీ… కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే ఎమ్మెల్యేలు, ఎంపీ మధ్య విభేదాలు వీధికెక్కడం మంచిది కాదంటున్నాయి టీడీపీ శ్రేణులు.

Exit mobile version