Site icon NTV Telugu

Off The Record: కవితపై ఎటాక్కి బీఆర్ఎస్ సిద్ధమవుతోందా?

Kavitha

Kavitha

Off The Record: కేసీఆర్‌ కుమార్తె కవితకు ఇక గులాబీ ముళ్ళు గట్టిగా గుచ్చుకోబోతున్నాయా? ఆమె విషయంలో బీఆర్‌ శ్రేణులు అటాకింగ్‌ మోడ్‌లోకి వచ్చేశాయా? అందుకోసం పార్టీ అధిష్టానం పచ్చ జెండా ఊపేసిందా? ఇక దుమ్ము దులుపుడు కార్యక్రమం మొదలవబోతోందా? అదే నిజమైతే…. కవిత వైపు నుంచి రియాక్షన్స్‌ ఎలా ఉండవచ్చు? బీఆర్‌ఎస్‌ లీడర్స్‌ ఒక్కసారిగా విరుచుకుపడితే ఆమె తట్టుకోగలరా? లెట్స్‌ వాచ్‌.

Read Also: Dharmavaram Murder: పడగ విప్పిన ఫ్యాక్షన్ .. ధర్మవరంలో అచ్చం సినిమా తరహా మర్డర్

తెలంగాణలో, ప్రత్యేకించి బీఆర్‌ఎస్‌, కేసీఆర్‌ కుటుంబ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లతో సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను మరిపిస్తున్నాయి. పార్టీ వ్యవహారాల మీద కవిత వ్యాఖ్యలు, కీలక నాయకులు హరీష్‌రావు, సంతోష్‌రావు మీద తీవ్ర స్థాయి ఆరోపణలు, పార్టీ నుంచి కవిత సస్పెన్షన్‌, తర్వాత ఆమె రాజీనామా…. ఇలా రకరకాల పరిణామాలతో ఇప్పటికే పొలిటికల్‌ టెంపరేచర్‌ ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. అయితే… ఇన్ని రోజులూ… ఈ మొత్తం ఎపిసోడ్‌లో కవిత మాటే గట్టిగా వినిపించింది. ఆమె ఏం మాట్లాడినా… అడపా దడపా తప్ప, బీఆర్‌ఎస్‌ వైపు నుంచి పెద్దగా రియాక్షన్స్‌ రాలేదు. నిన్న మొన్నటిదాకా గులాబీ వ్యవహారాల్లో కీలకంగా ఉన్న నాయకురాలు, పైగా అధినేత కుమార్తె, ఎమ్మెల్సీ హోదా…. ఇలా రకరకాల లెక్కలేసుకుంటూ సంయమనం పాటించాయి బీఆర్‌ఎస్‌ శ్రేణులు. మామూలుగా ఇదే పరిస్థితిలో వేరే నాయకులు ఎవరున్నా… ఆ రివర్స్‌ అటాక్‌ వేరే లెవల్‌లో ఉండేది. కానీ… కేసీఆర్‌ కుమార్తె కావడంతో… నాయకులెవరూ తొందరపడలేదు. ఒకానొక సందర్భంలో ఆమె గురించి ఎవరూ మాట్లాడవద్దని ఇంటర్నల్‌గా ఆదేశాలు కూడా ఇచ్చిందట బీఆర్‌ఎస్‌ అధిష్టానం. ఆ క్రమంలోనే… ఒక్క మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తప్ప మిగతా వాళ్ళందరూ కామ్‌గానే ఉన్నారు.

Read Also: Viral: ప్రజా స్వామ్యానికి ముప్పుగా మారనున్న సోషల్ మీడియా..విషయమేమిటంటే..

జగదీశ్ రెడ్డి కూడా… తననుద్దేశించి కవిత తీవ్ర స్థాయి కామెంట్స్‌ చేశారన్న కోపంతోనే స్పందించినట్టు చెప్పుకుంటున్నారు. కానీ… ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయ్‌… కవిత అంతలా ఓపెనైపోయి ఆరోపణలు చేశాక ఇక ఉపేక్షించకూడదని డిసైడైందట గులాబీ అధిష్టానం. తనకు తాను పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాక ఇక మనకు మాత్రం మొహమాటం ఎందుకనుకుంటూ అటాక్ మోడ్‌ ఆన్‌ చేసేశారట బీఆర్‌ఎస్‌ పెద్దలు. కవిత మీద నాయకులు స్పందించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసినట్టు చెప్పుకుంటున్నారు. కవిత మాటలకు గట్టిగా కౌంటర్స్‌ ఇవ్వమని పార్టీ హైకమాండ్‌ నుంచి ఆదేశాలు వచ్చినట్టు తెలిసింది. కొందరు మాజీ మంత్రులు ఇప్పటికే ఆ పనిలో ఉన్నారట. అయితే, ఇక్కడ కూడా వాళ్ళు కాస్త జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కవితను వ్యక్తిగతంగా టార్గెట్‌ చేయకుండా ఆమె ఆరోపణలు చేసిన హరీష్‌రావు, సంతోష్‌రావును వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతైనా ఆమె… తమ అధినేత కూతురు కాబట్టి… ఇప్పుడు అనవసరంగా తొందరపడి నోరు పారేసుకుంటే… రేపు కాలం కలిసొచ్చి మళ్ళీ వాళ్ళు వాళ్ళు ఒకటైతే.. అనవసరంగా మేం ఇరుక్కుపోతామన్న అభిప్రాయమే ఉందట ఎక్కువ మందిలో. అందుకే.. ఆచితూచి, జాగ్రత్తగా, శ్రద్ధగా… మొక్కకు అంటుకట్టినట్టుగా విమర్శలు మొదలుపెట్టారు గులాబీ నాయకులు.

Read Also: Tragedy In Prakasam: కన్నతండ్రే కాలయముడయ్యాడు.. ముగ్గురు పిల్లలను చంపేసి.. తండ్రి ఆత్మహత్య

ఇంకొందరు ప్రధానంగా జాగృతి కేంద్రంగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తెలంగాణ జాగృతి పేరుతో పార్టీకి అనుబంధంగా కార్యక్రమాలు నిర్వహించి కవిత ఒక్కరే హైలైట్‌ అయ్యారని, మిగతా నాయకుల్ని పట్టించుకోలేదంటూ ఎదురుదాడి మొదలుపెట్టారు. అటాక్‌… అంటూ పార్టీ అధిష్టానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినా… ఎక్కువ మంది మాత్రం ప్రస్తుతానికి జాగ్రత్తలు పాటిస్తున్నారట. ప్రస్తుతానికి అటాక్‌ చేస్తున్న నాయకుల సంఖ్య తక్కువగానే ఉన్నందున కవిత వైపు నుంచి కూడా ఎలాంటి రియాక్షన్స్‌ లేవు. కానీ… మెల్లిగా పరిస్థితులు మారి సీరియస్‌నెస్‌ పెరిగితే అట్నుంచి కూడా కౌంటర్స్‌ ఉంటాయని, వాటి తీవ్రత ఎలా ఉంటుందోనన్న ఆసక్తి సర్వత్రా పెరుగుతోంది. ఇప్పటికే పార్టీ ముఖ్యుల మీద రకరకాల ఆరోపణలు చేసిన కవిత… తన దగ్గర అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. అంటే… రేపు బీఆర్‌ఎస్‌ వైపు నుంచి దుమ్ము దులుపుడు ప్రోగ్రామ్‌ మొదలైతే…. దాన్ని తట్టుకోవడానికి కవిత కూడా…. తన దగ్గర ఉన్న ఆధారాలను బయట పెడతారా? నిజంగా అదే జరిగితే… గులాబీ దళం ఇరుకున పడుతుందా అన్న రకరకాల చర్చలు జరుగుతున్నాయి రాజకీయవర్గాల్లో. కేసీఆర్‌, కేటీఆర్‌ తప్ప పార్టీలోని మిగతా అంతా కవిత టార్గెట్‌ రేంజ్‌లో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఇలా… మొత్తం మీద ముందు ముందు మరింత ఆసక్తికరమైన సన్నివేశాల్ని చూసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు తెలంగాణ పొలిటికల్‌ పండిట్స్‌.

Exit mobile version