Off The Record: వైసీపీతో కలిసి కొందరు టీడీపీ నేతలు దోస్త్ మేర దోస్త్ అంటున్నారా?
- టీడీపీ ఎమ్మెల్యేలు కొందరిపై అడ్డగోలు సంపాదన ఆరోపణలు..
- వైసీపీ నేతలతో కలిసి దోస్త్ మేరా దోస్త్ అంటున్నారా?..
- సంపాదన తాపత్రయంలో విలువలు మర్చిపోయారా?..
- పల్నాడు జిల్లాలో అక్రమ మైనింగ్‌కు కేరాఫ్ నియోజకవర్గం..
- అక్రమాల్ని ప్రశ్నించకుండా ఉండేందుకు వైసీపీ నేతకు పర్సంటేజీలు?..
- గతంలో అడ్డగోలు మైనింగ్ చేసిన సదరు వైసీపీ లీడర్..
- లూప్‌హోల్స్ అన్నీ తెలుసు కాబట్టి నోట్ల కట్టలతో తాళం?..
- మట్టి, గ్రావెల్ మాఫియాకు కేరాఫ్ గుంటూరుకు దగ్గర్లోని నియోజకవర్గం..
- మాట్లాడకుండా ఉండేందుకు వైసీపీ నేతకు నెలకు రూ.5 లక్షలు?..
- వైసీపీ వాళ్ళతో కలిసి మా నోట మట్టి కొడుతున్నారని టీడీపీ కేడర్ ఆవేదన..
- మమ్మల్ని పట్టించుకోవడం లేదని గుర్రుగా జనసైనికులు
Off The Record: అక్కడ టీడీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ లీడర్స్ దోస్త్ మేరా దోస్త్ అంటున్నారా? రాష్ట్ర స్థాయి రాజకీయం ఎలాఉంటే మాకెందుకు? ఎవడెలా పోతే… మాకేంటి? లోకల్‌గా దందాలు సాఫీగా చేసుకున్నామాస లేదా అన్నదే ముఖ్యం అంటున్నారా? తమ అక్రమాల గురించి బయటికి మాట్లాడకుండా వైసీపీ లీడర్స్‌కు నెలవారీ మామూళ్ళు ఇస్తున్నారంటున్న ఆ ఎమ్మెల్యేలు ఎవరు? ఎక్కడ జరుగుతోందా తంతు?
Read Also: Kerala: కేరళ ఎమ్మెల్యేకు చేదు అనుభవం.. సమస్యలు పట్టించుకోవడం లేదని చొక్కాలాగిన మహిళలు
Also Read
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కొందరు అడ్డగోలు సంపాదనకు అలవాటు పడి ముందూ వెనకా ఆలోచించడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డబ్బులొస్తాయంటే చాలు… ఎంతకైనా దిగజారుతున్నారన్న చర్చలు గట్టిగానే జరుగుతున్నాయి ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో. దందాలకు అలవాటుపడ్డ కొందమంది శాసనసభ్యులు వైసీపీ నేతలతో మిలాఖత్ అయిపోయి దోస్త్ మేరా దోస్త్ అంటున్నారని, ఇద్దరూ కలిసే కమీషన్లు, వ్యాపారాలను పంచుకుంటున్నారన్న ప్రచారం సైతం జరుగుతోంది. ఎన్నికల్లో గెలవడానికి కోట్లు ఖర్చు పెట్టిన నేతలు… అధికారంలోకి రాగానే… తమ పెట్టుబడికి ఐదారు రెట్లు సంపాదించాలన్న తాపత్రయంతో విలువలకు తిలోదకాలిస్తున్నారన్న విమర్శలు పెరుగుతున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ ట్రెండ్‌ని బాగా ఫాలో అవుతున్నారన్న టాక్ బలంగా వినిపిస్తోంది. తమ అడ్డగోలు సంపాదన కోసం ఎవరితోనైనా రాజీపడేందుకు సై అంటున్నారట ఆ ఇద్దరూ. ముఖ్యంగా… పల్నాడు జిల్లాలో అక్రమ మైనింగ్‌కు కేరాఫ్‌గా మారిన ఓ నియోజకవర్గంలో ఇప్పుుడిదే జరుగుతోందట. తాను ఎంత అడ్డదిడ్డంగా మైనింగ్ చేసినా.. నిబంధనల్ని అస్సలు పట్టించుకోకపోయినా… అసలు అటువైపే చూడకుండా ఉండేందుకు ఆ నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత నోటిని నోట్ల కట్టలతో మూుయిస్తున్నారట సదరు శాసనసభ్యుడు.
Read Also: Delhi Liquor Policy: ఢిల్లీలో కొత్త లిక్కర్ పాలసీకి ప్లాన్!.. 25 ఏళ్ల వయసు తగ్గించే యోచన
ఇప్పుడు ఎవరైతే… వైసీపీ నేత కమీషన్లు దండుకుంటున్నారో…. అదే నాయకుడు గతంలో ఆ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్రమ మైనింగ్ చేశారట. అలాగే అక్రమ వసూళ్ళకు పాల్పడ్డారని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ ఎక్స్‌పీరియెన్స్‌తో… ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాసరే… ఎక్కడెక్కడ అక్రమాలు జరుగుతాయి, లూప్‌హోల్స్ ఎక్కడెక్కడ ఉంటాయో ప్రతీ విషయం తెలుసు కాబట్టి…ఆ నాయకుడి నోరు మూయించేందుకు… పల్నాడు మైనింగ్ ఎమ్మెల్యే…నెలకు ఇంతని రేటు ఫిక్స్ చేశారట. అందుకే ఇప్పుడు సదరు వైసీపీ నేత… కూటమి ప్రభుత్వానికి సంబంధించిన మిగతా విషయాల గురించి అనర్గళంగా మాట్లాడుతున్నారు తప్ప…సొంత నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ గురించి మాత్రం నోరు మెదపడం లేదంటున్నారు. ఇక గుంటూరుకు దగ్గరలో ఉన్న మరో నియోజకవర్గం మట్టి, గ్రావెల్ మాఫియాకు కేరాఫ్ అడ్రస్. జిల్లాలో మట్టి, గ్రావెల్ ఎవరికి అవసరమైనా ఇక్కడి నుంచే వెళ్తుంది. ఇందుకోసం ఐదారు చోట్ల అక్రమంగా మట్టి తవ్వకాలు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. వీటి మీద మాట్లాడకుండా ఉండేందుకు ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతకు నెలకు 5 లక్షల చొప్పున ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారట స్థానిక ఎమ్మెల్యే. అందుకే ఆ వైసీపీ నాయకుడు టీడీపీ మీద విమర్శలు చేస్తారేగానీ.. కళ్ళ ముందు నడుస్తున్న మాఫియా గురించి పల్లెత్తు మాట అనడం లేదట.
Read Also: Trump: గాజాపై ట్రంప్ ప్లాన్‌ను స్వాగతించిన పాక్.. మండిపడుతున్న స్వదేశీయులు
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. గతంలో పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇచ్చేవారని, ఇప్పుడు తాము చేసే అక్రమాలను బయటకి తెలియకుండా ఉండేందుకు… ప్రత్యర్థులతో కలిసిపోయి తమ నోట మట్టి కొడుతున్నారని వాపోతున్నారట తెలుగుదేశం కార్యకర్తలు. పైకి మాత్రం పరస్పర ఆరోపణలతో హోరెత్తించుకుంటూ… లోలోపల మామూళ్ళ రాజకీయం నడిపిస్తున్నారని, ఇలాంటి రాజీ వ్యవహారాలతో పార్టీ సర్వనాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తోందట టీడీపీ కేడర్. టీడీపీ, వైసీపీ నేతల మిలాఖత్ అలా ఉంటే… ఓ నియోజకవర్గానికి సంబంధించిన అక్రమ ఇసుక క్వారీయింగ్‌పై… అధికారులకు ఫిర్యాదు చేశారట జనసేన నాయకులు. ప్రభుత్వంలో తాము కూడా భాగస్వాములమైనా… టీడీపీ లీడర్స్ తమను పట్టించుకోవడం లేదన్నది వాళ్ళ బాధగా తెలుస్తోంది. ఈ లాలూచీ దందాల కారణంగానే… జిల్లాలో కూటమి నేతల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తుతున్నట్టు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Iran-Trump: మా కొత్త ఆయుధం ప్రదర్శిస్తే గుండెపోటు రావొచ్చు.. ట్రంప్‌నకు ఇరాన్ వార్నింగ్
-
Bhoghi : ‘కందుల సులోచన రాణి’గా.. అనుపమ.. ఫస్ట్ లుక్ బాగుంది
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Jasprit Bumrah: సీన్ రివర్స్.. బ్యాటర్ల ముందు బెంబేలెత్తిపోతున్న బుమ్రా.. కెరీర్లోనే చెత్త ప్రదర్శన!
-
Dhruva Natchathiram : విక్రమ్ సినిమా వస్తోంది.. కానీ సూర్యతో పోటీ తప్పేలా లేదు
ట్రెండింగ్
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!