Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Ap Police On Macherla Issue Off The Record

AP Police On Macherla Issue… OFF The Record: ఏపీ పోలీసుల తీరుపై సందేహాలు

Published Date :December 19, 2022 , 10:04 pm
By NTV WebDesk
AP Police On Macherla Issue… OFF The Record: ఏపీ పోలీసుల తీరుపై సందేహాలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

మాచర్ల విధ్వంసాన్ని పోలీసులు ముందే పసిగట్ట లేదా? బాస్‌ల మధ్య కోఆర్డినేషన్‌ లోపం.. రావణకాష్టానికి దారితీసిందా? మాచర్ల గొడవలపై డిపార్ట్‌మెంట్‌లో జరుగుతున్న పోస్టుమార్టం ఏంటి? బాధ్యులపై చర్యలు ఉంటాయా?

చాలాకాలం తర్వాత మాచర్లలో మంటలు
పోలీసుల పనితీరుపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది మాచర్ల విధ్వంసం. ఒక్కసారిగా రెండు వర్గాలు నడిరోడ్డుపై బాహాబాహీకి దిగడం.. అది ఉధృతరూపం దాల్చడం.. వాహనాలకు నిప్పు పెట్టడం.. సంచలనంగా మారాయి. అంత జరుగుతున్నా క్షేత్రస్థాయిలో ఉన్న పోలీసు సిబ్బంది ఉన్నతాధికారులకు సరైన సమాచారం ఇవ్వలేదా? లేక పైస్థాయిలో వచ్చిన గ్యాప్‌తో సమస్య చెయ్యి దాటిపోయిందా?. లోపం ఎక్కడున్నప్పటికీ చాలాకాలం తర్వాత మాచర్లలో మంటలు రేగాయి. ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని టీడీపీ చేపడుతున్నట్టు సమాచారం లేకే.. గొడవలను నియంత్రించ లేకపోయామని DIG సహా పోలీసు పెద్దలు చెబుతున్నారు. అయితే టీడీపీ ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడే రాష్ట్రంలో ఏయే నియోజకవర్గాల్లో గొడవలు జరిగే ఆస్కారం ఉందో నిఘా వర్గాలు హెచ్చరించాయట. వాటిల్లో కొన్ని చిన్నా చితకా ఘటనలు జరిగేవి ఉంటే.. ఫ్యాక్షన్‌ ప్రభావం ఉన్న చోట పరిస్థితి తీవ్రంగానే ఉంటుందని అప్రమత్తం చేసినట్టు తెలుస్తోంది. ఆ జాబితాలో మాచర్ల ఉందట. అయితే పోలీస్‌ బాస్‌, ఇంటెలిజెన్స్‌ వర్గాల మధ్య కొద్దిరోజుల క్రితం మెమో వార్‌ నడిచింది. ఆ ప్రభావం మాచర్లలో కనిపించిందనేది కొందరి అభిప్రాయం.

జిల్లా ఎస్పీ మాచర్లకు వచ్చాకే వాస్తవాలు తెలిశాయా?
పోలీసులు తేరుకునే లోపుగానే మాచర్లలో పరిస్థితి అదుపుతప్పింది. ఘర్షణలను మొదలైనా.. ఇక్కడ పెద్దగా గొడవలేమీ లేవని .. అన్నీ సర్దుబాటు అయిపోతాయని.. మీడియాలో చూపించినట్టు ఏమీ లేదని.. ఉన్నతాధికారులకు స్థానిక పోలీసులు చెప్పారనే చర్చ నడుస్తోంది. దీంతో ఇతర ప్రాంతాల నుంచి మాచర్లకు అదనపు సిబ్బందిని పంపే ప్లాన్‌ టైమ్‌కు వర్కవుట్‌ కాలేదని అభిప్రాయ పడ్డారట. జిల్లా ఎస్పీ మాచర్లకు వచ్చేంత వరకు కచ్చితమైన సమాచారం ఉన్నతాధికారులకు చేరలేదనేది ఖాకీ వర్గాల వాదన. స్థానికంగా ఉన్న ఒత్తిళ్లో.. ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తారనే భయమో ఏమో మరోసారి పొలిటికల్‌ పార్టీలకు పోలీసులు కార్నర్‌ అయ్యారు. దీంతో స్థానిక పోలీసుల తీరుపై పోలీస్‌ బాసులు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. మాచర్ల గొడవలపై పైస్థాయిలో సమీక్ష చేసినట్టు చెబుతున్నారు.

క్షేత్రస్థాయిలో బాధ్యులను తేల్చేలా పోస్టుమార్టం
మాచర్ల గొడవలపై నమోదైన కేసుల్లో నిందితులను పట్టుకున్న తర్వాత.. క్షేత్రస్థాయిలో జరిగిన పొరపాట్లపై పోలీసు ఉన్నతాధికారులు మరోసారి విస్తృతంగా సమీక్ష చేస్తారని అనుకుంటున్నారు. బాధ్యులను తేల్చే పనిలో పడ్డారట. పల్నాడులోని మాచర్లలో హింసకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. ఆ దిశగా స్పెషల్ ఆపరేషన్‌ చేపట్టారట. వాస్తవానికి మాచర్లలో ఆ రోజు జరిగిన ఘటనలో స్థానికంగా ఉన్న ఓ పోలీస్‌ అధికారి చొరవ తీసుకుని.. టీడీపీ ఇంఛార్జ్‌ బ్రహ్మారెడ్డిని నియోజకవర్గం నుంచి బయటకు వెళ్లడానికి ఒప్పించిపోకపోయి ఉంటే మరింత దారుణం జరిగేదనే వాదన కూడా ఉంది. అందుకే పోలీసుల పోస్టుమార్టంలో ఏం తేలుస్తారో..? అనే ఉత్కంఠ సిబ్బందిలో నెలకొందట.
.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap police
  • failure
  • macherla issue
  • off the record
  • TDP vs YSRCP

తాజావార్తలు

  • Hyderabad: కష్టపడి సీఐని చేస్తే.. చావునే బహుమతిగా ఇచ్చింది! భార్య వేధింపులకు భర్త బలి..

  • CM Chandrababu: మంత్రులు, కలెక్టర్లు ఆటిట్యూడ్ మార్చుకోవాలి.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్!

  • Petrol, Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై కేంద్రం కీలక ప్రకటన..

  • JAAT 2 : బాక్సాఫీస్ వద్ద మరో మాస్ జాతర.. బోయపాటి శ్రీనుతో ‘జాట్ 2’?

  • Farooq Abdullah: కాల్పులపై స్పందించిన ఫరూక్ అబ్దుల్లా.. ఏమన్నారంటే..!

ట్రెండింగ్‌

  • Ear Care Tips: మీ చెవుల ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ 4 తప్పులు అస్సలు చేయకండి.!

  • Summer Hacks : వేసవిలో వాటర్ ట్యాంకు నీరు వేడెక్కుతోందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో నీటిని చల్లగా ఉంచండి..!

  • Leica కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌, 50MP ట్రిపుల్ కెమెరాల సెటప్ తో Xiaomi 17 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP టెలిఫోటో కెమెరా, 6000mAh బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • 80W ఫాస్ట్ ఛార్జింగ్, 100x జూమ్ కెమెరాతో HONOR Magic V6 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions