AP Municipal Elections: నామినేషన్ల ఉపసంహరణలపై కూటమి సమన్వయ కమిటీల దృష్టి.. అసంతృప్తులకు బుజ్జగింపులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Municipal Elections: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీలు నామినేషన్ల ఉపసంహరణలపై ప్రత్యేక దృష్టి సారించాయి. మేయర్, మున్సిపల్ చైర్మన్ స్థానాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పోటీకి తెరదించేందుకు కూటమి సమన్వయ కమిటీలు ప్రయత్నిస్తున్నాయి. కూటమి పార్టీల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావడంతో పాటు, స్థానికంగా తలెత్తుతున్న విభేదాలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాయి.
ముఖ్యంగా విశాఖపట్నం, విజయనగరం, ఏలూరు కార్పొరేషన్లపై కూటమి నేతలు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ కార్పొరేషన్లలో మేయర్ స్థానాలకు సంబంధించి కూటమి పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ లేకుండా సమన్వయం సాధించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. అలాగే వివిధ మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోనూ టీడీపీ, జనసేన, బీజేపీ తరఫున నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో అభ్యర్థుల ఎంపిక, పోటీ విషయంలో సమన్వయం కీలకంగా మారింది.
Also Read
- AP High Court: పంచాయతీ ఎన్నికల నామినేషన్లపై హైకోర్టు కీలక తీర్పు.. అధికారులకు ఆదేశాలు!
- AP Crime: జనసేన పార్టీ పేరుతో భారీ మోసం.. 20 మందికి రూ.7 కోట్ల టోకరా!
- YS Jagan: 2024తో పోలిస్తే వైసీపీ ఓటింగ్ పెరిగింది.. జగన్ కీలక వ్యాఖ్యలు
- AP High Court: పండుగలు, సెలవుల్లో బస్సు టికెట్ ధరల పెంపుపై హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు
బీ-ఫామ్ పొందిన అభ్యర్థులకే అధికారిక గుర్తింపు
ఎన్నికల్లో కూటమి తరఫున అధికారిక అభ్యర్థులుగా బీ-ఫామ్ పొందిన వారికే గుర్తింపు ఉంటుందని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకే స్థానానికి కూటమిలోని వేర్వేరు పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసిన చోట సమస్యలను పరిష్కరించేందుకు నేతలు కసరత్తు చేస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణల ప్రక్రియలో భాగంగా పోటీ నుంచి తప్పుకోవాల్సిన అభ్యర్థులతో చర్చలు జరుపుతున్నారు.
అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నాలు
టికెట్లు ఆశించి నిరాశకు గురైన నాయకులు, నామినేషన్లు దాఖలు చేసిన అసంతృప్త అభ్యర్థులను బుజ్జగించేందుకు కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారు. స్థానిక పరిస్థితులు, పార్టీ శ్రేణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ ఎక్కడికక్కడ స్థానిక కమిటీ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారు. కూటమి పార్టీల మధ్య విభేదాలు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపకుండా, పరస్పర అంగీకారంతో అభ్యర్థులను ఖరారు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. మొత్తంగా, మున్సిపల్ ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య పోటీని తగ్గించి, అధికారికంగా నిర్ణయించిన అభ్యర్థులకు మద్దతు కూడగట్టడంపై సమన్వయ కమిటీలు దృష్టి సారించాయి. నామినేషన్ల ఉపసంహరణల గడువులోగా ఎంతవరకు ఏకాభిప్రాయం సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Civils Candidates: సివిల్స్ ఇంటర్వ్యూ అభ్యర్థులకు రూ.లక్ష ప్రోత్సాహకం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన..
-
Protein Rich Foods: ఒంట్లో బలం అమాంతం పెంచే హై ప్రోటీన్ రొట్టె.. చాలా సింపుల్ ఇలా చేసుకోండి!
-
Nvidia: ఎన్విడియా సీఈఓ జాన్సన్ హువాంగ్ రాజీనామా..
-
Asaduddin Owaisi: “అబ్దుల్ ఇక చాప పరవడు”.. అఖిలేశ్‌కు ఒవైసీ సవాల్..
-
Nvidia CEO: జెన్సన్ హువాంగ్ పదవిపై నిర్ణయం.. కీలకంగా మారిన భారత సంతతి ఆర్తి షా!
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!