Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Andhra Pradesh Mlc Elections

Andhra Pradesh MLC Elections: ఒక్క దెబ్బకు అనేక పిట్టలు..YCP ఎమ్మెల్యేలకు సెమీ ఫైనల్ గా ఎమ్మెల్సీ ఎన్నికలు ?

Published Date :July 20, 2022 , 12:11 pm
By Premchand Chowdary
Andhra Pradesh MLC Elections: ఒక్క దెబ్బకు అనేక పిట్టలు..YCP ఎమ్మెల్యేలకు సెమీ ఫైనల్ గా ఎమ్మెల్సీ ఎన్నికలు ?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Andhra Pradesh MLC Elections:

 

ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. ఇది పాత లెక్క. ఒకే దెబ్బకు అనేక పిట్టలు.. ఇది అధికారపార్టీ తాజా వ్యూహం. పట్టభద్రుల MLC అభ్యర్థుల ఎంపిక ద్వారా రియల్‌ పొలిటికల్‌ గేమ్‌కు వైసీపీ సంకేతాలు ఇచ్చిందా? ఎమ్మెల్యేలకు ఇది సెమీఫైనల్స్‌ అనే చర్చ సాగుతోందా? అధికారపార్టీ ఆలోచనలేంటి? లెట్స్‌ వాచ్‌..!

అధికార వైసీపీ రాజకీయ చతురతకు మరింత పదును పెట్టింది. తొలిసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రేసులోకి అడుగుపెట్టి.. అభ్యర్ధులను ప్రకటించింది. ఉత్తరాంధ్ర నుంచి ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్‌ను ఎంపిక చేసింది. తద్వారా బహుముఖ ప్రయోజనాలను అధికారపార్టీ లక్ష్యంగా పెట్టుకుందనే చర్చ ప్రారంభమైంది. వాస్తవానికి సీతంరాజు విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధపడుతున్నారు. హైకమాండ్ అవకాశం కల్పిస్తుందనే ధీమాతో సిట్టింగ్ ఎమ్మెల్యేతో ఢీ అంటే ఢీ అంటున్నారు. దీంతో తరచూ అక్కడ కుమ్ములాటలు బయట పడుతున్నాయి.

ఇప్పుడు సీతంరాజును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడంతో .. అధినేత ఆలోచనల్లో భాగంగానే ఆ నిర్ణయం జరిగిందని టాక్‌. అంతేకాదు ఎమ్మెల్సీని గెలిపించుకునే బాధ్యత తాము తీసుకున్నామనే సంకేతాలను పార్టీ పంపించిందని సీతంరాజు వర్గం చర్చించుకుంటోంది. సాధారణంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సందర్భం లేదు. ఈసారి పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. తొలిసారి వైసీపీ పోటీ చేస్తోంది. అనేక సమీకరణాలను వడపోసిన తర్వాతే ఆ నిర్ణయం తీసుకుందనే చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకే ఇస్తున్నారనే అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నంలా కనిపిస్తోంది.

ఉత్తరాంధ్ర సీటును బ్రాహ్మణ సామాజికవర్గానికి కేటాయించడం ద్వారా ఉభయ తారకమైన ఆలోచన చేసిందనే చర్చ నడుస్తోంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో బ్రాహ్మణ సామాజికవర్గం ఓట్ బ్యాంక్ ఎక్కువ. విద్యావంతులు, ఉద్యోగులు అధికశాతం ఉంటారు. వీరిలో మెజార్టీ ఓటర్లు వివిధ కారణాలతో బీజేపీ, టీడీపీకి దగ్గరగా ఉంటారనే అభిప్రాయం ఉంది. అలాంటి సెగ్మెంట్‌ను ఆకర్షించడం ద్వారా మరింత బలోపేతం కావాలనే ఆలోచన చేసినట్టుగా తెలుస్తోంది. రాజకీయంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో బ్రాహ్మణులకు ప్రాధాన్యం లేదనే అభిప్రాయం చాలాకాలంగా ఉంది. వీటన్నింటినీ ఒకేసారి పరిష్కారించేందుకే సీతంరాజును ఎంపిక చేసినట్టు విశ్లేషిస్తున్నారు.

2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో 30మంది బరిలో ఉంటే.. పోటీ ప్రధాన అభ్యర్ధుల మధ్యే సాగింది. పీడీఎఫ్ కూటమి తరఫున అజశర్మ.. బీజేపీ, టీడీపీ అభ్యర్ధిగా పీవీఎన్ మాధవ్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో మాధవ్ గెలిచారు. ఇప్పుడు బీజేపీకి జనసేనతో మాత్రమే పొత్తు ఉంది. ఈ రెండు పార్టీల బలం ఎంత వరకు నెగ్గుకొస్తుందనేది ఒక ప్రశ్న. టీడీపీ వైఖరి వెల్లడి కావాల్సి ఉంది. పోటీకి ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ ముఖ్యనేత ఒకరు చర్చలు జరుపుతున్నారట. వైసీపీ మాత్రం ఫుల్ క్లారిటీతో ఉంది. అభ్యర్ధులను ప్రకటించడం ద్వారా తన వైఖరిని స్పష్టంగా చెప్పేసింది అధిష్ఠానం. పైగా ఎమ్మెల్యేలకు పెద్ద టాస్క్ ఇవ్వనుందనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికలను సెమీఫైనల్స్‌గా భావించి ఎమ్మెల్యేలు కూడా రంగంలోకి దిగక తప్పదు.

నిరుద్యోగ సమస్యను డీల్‌ చేయడం.. ఓటర్లను ఎక్కువగా నమోదు చేయించడం ఎమ్మెల్యేలకు పెద్ద టాస్కే. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా లెక్కలు వేసుకుని హైకమాండ్ నిర్ణయించిన అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యత ఎమ్మెల్యేలదే. ఈ దిశగా వైసీపీ శాసనసభ్యులు పెద్ద కసరత్తు చేయాల్సిందే. అందుకే ఈ ఎన్నికలు బరిలో ఉండే అభ్యర్థుల కంటే ఎమ్మెల్యేలకు సెమీఫైనల్‌గా భావిస్తున్నారట. మరి.. ఈ సమస్యను వారెలా అధిగమిస్తారో.. ప్రత్యర్థులపై ఎలా పైచెయ్యి సాధిస్తారో చూడాలి.

 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh MLC Elections
  • bjp
  • janasena
  • MLC ELECTIONS
  • Seethamraju Sudhakar

తాజావార్తలు

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

  • Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions