Tollywood: నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర సహా టాలీవుడ్ ఏరియాస్ లెక్కలివే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ అంటే కేవలం రెండు తెలుగు రాష్ట్రాలే అనుకుంటే పొరపాటే. ఒక సినిమా ఎంత పెద్ద హిట్ అయింది, ఎంత వసూళ్లు రాబట్టింది అని లెక్కలు కట్టేటప్పుడు బాక్సాఫీస్ వద్ద Film Distribution System చాలా విభిన్నంగా, ఆసక్తికరంగా పనిచేస్తుంది. మనకు కేవలం కలెక్షన్ల నంబర్లు మాత్రమే తెలుస్తాయి కానీ, ఆ నంబర్ల వెనుక ఉన్న అసలైన ఏరియాల విభజన, సరిహద్దుల లెక్కలు చాలా మందికి తెలియవు. టాలీవుడ్ బిజినెస్ ఏయే ప్రాంతాలుగా విడిపోయిందో ఇప్పుడు క్షుణ్ణంగా చూద్దాం.
1. నైజాం (Nizam)
తెలుగు సినిమాల వసూళ్లలో నైజాం ఏరియాది ఎప్పుడూ సింహభాగమే. దీని పరిధిలోకి తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 10 పాత జిల్లాలు వస్తాయి. దీంతో పాటు కర్ణాటకలోని రెండు ముఖ్యమైన జిల్లాలు (రాయచూర్, కొప్పల్) కూడా నైజాం పరిధిలోకే లెక్కించబడతాయి. హిందీ సినిమాల పంపిణీ విషయానికి వస్తే.. తెలంగాణ మొత్తంతో పాటు, హైదరాబాద్ సమీపంలోని 6 కర్ణాటక జిల్లాలు, మరఠ్వాడా ప్రాంతం కూడా ఈ నైజాం కిందికే వస్తాయి.
Also Read
- Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
- Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
- Mithali Raj: 'నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు'.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
- Mithali Raj: 'సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..' పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
2. సీడెడ్ (Ceded)
రాయల సీమగా పిలవబడే ఈ ఏరియా మాస్ హీరోల సినిమాలకు పెట్టింది పేరు. సీడెడ్ లో ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 4 రాయలసీమ జిల్లాలు. కర్ణాటకలోని బళ్లారి జిల్లా. పాత ప్రకాశం జిల్లాలోని మార్కాపురం రెవెన్యూ డివిజన్ కూడా సీడెడ్ లెక్కల్లోకి వస్తుంది.
3. కోస్తాంధ్రా
ఆంధ్ర ప్రాంతాన్ని పంపిణీదారులు ఆరు వేర్వేరు ఏరియాలుగా విభజించి వ్యాపారం చేస్తారు:
వైజాగ్ (Vizag) లేదా ఉత్తరాంధ్ర : విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు.
ఈస్ట్ (East): తూర్పు గోదావరి జిల్లా.
వెస్ట్ (West): పశ్చిమ గోదావరి జిల్లా.
కృష్ణా (Krishna): కృష్ణా జిల్లా.
గుంటూరు (Guntur): గుంటూరు జిల్లాతో పాటు పాత ప్రకాశం జిల్లాలోని ఒంగోలు రెవెన్యూ డివిజన్.
నెల్లూరు (Nellore): నెల్లూరు జిల్లాతో పాటు పాత ప్రకాశం జిల్లా కందుకూరు రెవెన్యూ డివిజన్.
అయితే హిందీ చిత్రాల పంపిణీ సమయంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలను కలిపి ఒకే ఒక్క ‘AP’ ఏరియాగా పరిగణిస్తారు)
పొరుగు రాష్ట్రాల్లో
కర్ణాటక: రాయచూర్, కొప్పల్, బళ్లారి జిల్లాలను మినహాయించి కర్ణాటకలోని మిగిలిన అన్ని జిల్లాలు దీని కిందకు వస్తాయి. అదనంగా తమిళనాడు హోసూర్, కృష్ణగిరి జిల్లాలు కూడా కర్ణాటక బిజినెస్ పరిధిలో ఉంటాయి. (హిందీ సినిమాలకైతే మైసూర్ టెరిటరీ, ముంబై టెరిటరీ అని వేర్వేరు విభజనలు ఉంటాయి).
తమిళనాడు: హోసూర్, కృష్ణగిరి మినహా తమిళనాడులోని మిగిలిన అన్ని జిల్లాలు. (హిందీ సినిమాల పంపిణీలో మాత్రం తమిళనాడు, కేరళ రెండింటినీ కలిపి ‘TNK’ అనే ఒకే టెరిటరీగా చూస్తారు).
ఒడిశా: ఒడిశా రాష్ట్రం మొత్తం ఒకే ఏరియా.
ముంబై: మహారాష్ట్ర, గోవా, గుజరాత్ రాష్ట్రాల మొత్తం పరిధిని ముంబై ఏరియాగా పిలుస్తారు.
నార్త్ ఇండియా: పైన పేర్కొన్న రాష్ట్రాలు కాకుండా భారతదేశంలో మిగిలిన అన్ని రాష్ట్రాలు ఈ కేటగిరీ కిందకు వస్తాయి.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?