తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద నిర్మాతలు చిన్న సినిమాలు చేయడం, చిన్న సినిమాల నిర్మాతలు ఒక్కసారిగా తమ రేంజ్ పెంచుకోవడానికి పెద్ద సినిమాలు చేయడం పెద్ద విషయమేమీ కాదు. అది సర్వ సాధారణ ప్రక్రియ. అయితే ఈ చిన్న సినిమాలు చేసే విషయంలో బడా నిర్మాతలుగా పేరుందిన కొందరు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అసలు విషయం ఏమిటంటే సినిమాలలో చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ పుణ్యమా అని గబ్బర్ సింగ్ లాంటి సినిమా చేసి బ్లాక్ బస్టర్ నిర్మాతగా మారిపోయాడు. దాదాపు పాతిక 50 సినిమాలు చేసినా రాని గుర్తింపు ఒక్క సినిమాకే తెచ్చేసుకున్నాడు. అలాంటి ఆయన ఈ మధ్య రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరై తాను ఒకప్పుడు పెద్ద సినిమాలు మాత్రమే చేయాలనుకునే వాడినని చిన్న సినిమాలకు పెద్ద సినిమాలకు పడే కష్టం ఒకటే కదా అనుకునేవాడిని అని చెప్పుకొచ్చాడు.
Gadadhari Hanuman: పాన్ ఇండియా భాషలలో ‘గదాధారి హనుమాన్’.. ?
అయితే అదంతా ఇప్పుడు తప్పని పెద్ద పెద్ద కాంబినేషన్ లు సెట్ చేసుకుని టైం వేస్ట్ చేసుకోవడం కంటే అందుబాటులో ఉన్న వాళ్ళతో సినిమాలు చేసేసి దడ దడ రిలీజ్ చేసేసి బ్లాక్ బస్టర్లు కొట్టాలని అభిప్రాయపడ్డాడు. చిన్న సినిమాలు కూడా చేస్తానంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆయన అలా అనడానికి కూడా కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలుగా వచ్చిన కమిటీ కుర్రాళ్ళు సినిమాతో పాటు ఆయ్ కూడా మంచి హిట్ అవ్వడమే కాక కలెక్షన్లు కూడా తెచ్చిపెట్టాయి. నిర్మాతలు ఖర్చుపెట్టిన దానికంటే ఎక్కువే వెనక్కి రాబట్టడమే కాక ఓటీటీ డీల్స్ అదనంగా లాభాలను తెచ్చిపెట్టాయి. అయితే ఇది ఈ బండ్ల గణేష్ వర్షన్ అయి ఉండవచ్చు. మరొక పక్క ఒక బడా నిర్మాత అందుకు భిన్నమైన కామెంట్స్ చేశారు.
ఆయన ఇప్పటికే చాలా పెద్ద సినిమాలు, పెద్దపెద్ద కాంబినేషన్ సినిమాలు చేశారు. అప్పుడప్పుడు చిన్న చిన్న సినిమాలు కూడా చేస్తున్నారు. బ్యానర్లు వేరైనా బ్యాకెండ్ లో ఉండి నడిపించేది ఆయనే. అలాంటి ఆయనను ఒక చిన్న సినిమా డిస్ట్రిబ్యూట్ చేయాలని సదరు చిన్న సినిమా నిర్మాత అప్రోచ్ అయితే చిన్న సినిమాకి అన్ని కోట్లు ఖర్చు పెట్టారా? ఇప్పుడు వెనక్కి రావడం కష్టమే అన్నట్లుగా మాట్లాడారట. చిన్న సినిమాల మార్కెట్ బాలేదని ఆయన ఆ విధంగా కామెంట్ చేసి ఉండవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఒకపక్క వరుస సినిమాలు చేస్తూ వస్తున్న సదరు బడా నిర్మాత తన బ్యాకింగ్ లో ఒక చిన్న సినిమాని కూడా రిలీజ్ కి రెడీ చేసుకుంటున్నారు. అలాంటి ఆయన మరో చిన్న సినిమా మీద నమ్మకం వదిలేసుకోమని సదరు నిర్మాతకు చెప్పడం గురించి ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు సినిమా చిన్నదా? పెద్దదా? అని ప్రేక్షకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
కంటెంట్ బాగుంటే దేనిని అయినా ఆదరిస్తున్నారు. అందుకు ఉదాహరణ ఆగస్టు 15 వీకెండ్ అని చెప్పొచ్చు. భారీ బడ్జెట్, స్టార్ కాస్టింగ్ తో రిలీజ్ అయిన డబుల్ ఇస్మార్ట్ సినిమాతో పాటు మిస్టర్ బచ్చన్ సినిమా బోల్తా పడితే అదే రోజు పెద్దగా బ్యాకింగ్ లేకుండా ఆసక్తికరమైన ప్రమోషన్స్ తో వచ్చిన చిన్న సినిమా ఆ వీక్ మొత్తాన్ని ఆక్రమించింది. నిజానికి దానికి వారం ముందు రిలీజ్ అయిన మరో చిన్న సినిమా కమిటీ కుర్రాళ్ళు కూడా ఆసక్తికర వసూళ్లు రాబట్టింది. ఇప్పటికీ ఈ రెండు చిన్న సినిమాలు థియేటర్లలో నడుస్తున్నాయంటే కంటెంట్ కి తెలుగు ప్రేక్షకులు ఇస్తున్న వాల్యూ అర్థం చేసుకోవచ్చు. అయినా ఇద్దరు బడా నిర్మాతలు ఒకరేమో చిన్న సినిమాలు అయినా దడదడ చేసుకుంటూ పోవాలి, కంటెంట్ ఈజ్ కింగ్ అంటుంటే మరొకరు మాత్రం చిన్న సినిమానా, అబ్బే ఇప్పుడు కష్టం అంటూ పెదవి విరుస్తూ ఉండడం గమనార్హం. ఏదేమైనా ఈ గందరగోళ పరిస్థితి గురించి ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చలే జరుగుతున్నాయి.