ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – బ్లాక్‌బస్టర్ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో రూపొందనున్న భారీ పాన్-ఇండియా చిత్రం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి, ఇందుకోసం దర్శకుడు అట్లీ నిన్న హైదరాబాద్‌కు చేరుకున్నారు. సరిగ్గా ఇదే సమయంలో స్పిరిట్ సినిమా నుంచి తప్పుకుందని ప్రచారం జరుగుతున్న బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించనుందని తాజాగా వార్తలు వైరల్ అవుతున్నాయి.
Also Read: Peddi : ‘పెద్ది’ కోసం మున్నా భాయ్.. కొత్త షెడ్యూల్ షూట్ ఎక్కడంటే?
ఈ క్రేజీ కాంబో అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది. ‘జవాన్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాతో బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన అట్లీ, ఇప్పుడు అల్లు అర్జున్‌తో కలిసి మరో భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఒక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుందని, సన్ పిక్చర్స్ దాదాపు ₹700 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు టాక్. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనే చర్చ గత కొన్ని రోజులుగా సాగుతోంది. మృణాళ్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి నటీమణుల పేర్లు వినిపించినప్పటికీ, తాజాగా బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించనుందని బలమైన ప్రచారం జరుగుతోంది. దీపికా ఇప్పటికే ‘పఠాన్’, ‘జవాన్’ వంటి సినిమాలు చేసి అట్లీకి క్లోజ్ అయింది.
Also Read:Ustad : పవన్ ఫాన్స్ కి పండుగ లాంటి వార్త.. ఉస్తాద్ కూడా బరిలోకి
దానికి తోడు ఆమె పాన్-ఇండియా ఇమేజ్ ఈ ప్రాజెక్ట్‌కు అదనపు ఆకర్షణగా నిలవచ్చని అంటున్నారు. అల్లు అర్జున్ దీపికా జోడీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం ప్రీ-ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్‌లో సాగుతున్నాయి. నిన్న హైదరాబాద్‌కు చేరుకున్న అట్లీ, ఈ చిత్రానికి సంబంధించిన కీలక చర్చల్లో పాల్గొన్నారు. స్క్రిప్ట్ ఫైనలైజేషన్, కాస్టింగ్, లొకేషన్స్ ఎంపిక వంటి అంశాలపై ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ జూలై-ఆగస్టు 2025 నుంచి ప్రారంభం కానుందని, సెప్టెంబర్ 2025 నాటికి పూర్తి స్థాయిలో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం.