తమిళనాడులో తెలుగు సినిమాలకు థియేటర్లు ఇవ్వడం లేదు అనే చర్చ మొదలైందని. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దానికి ఉదాహరణ ఇటీవల కిరణ్ అబ్బవరం క సినిమా నిలిచింది. మనం తమిళ వాళ్ళ సినిమాలను మన సినిమాలుగా భావిస్తూ గుండెల్లో పెట్టేసుకుని భారీగా థియేటర్లో కేటాయిస్తూ హిట్టు చేస్తూ అసలు భాషతో సంబంధం లేకుండా హిట్ చేస్తున్నా కానీ తెలుగు సినిమాలకు మినిమం థియేటర్స్ కాదు కదా ఒకటి రెండు థియేటర్లు ఇవ్వడానికి కూడా వెనకాడుతున్న పరిస్థితి నెలకొంది. కిరణ్ అబ్బవరం ఒక ఐదు సినిమా ధియేటర్లలో తెలుగు వర్షన్ వేసుకుంటాము అని అడిగినా కూడా థియేటర్లో ఇవ్వలేదు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే తెలుగు భాషకు మాత్రమే కాదు తమిళనాడులో తమిళం తప్ప వేరేది సినిమాకు థియేటర్లు దొరకటం అనేది ఒక పెద్ద గగనంగా మారిపోయింది. అన్ని భాషల సినిమాల లాగానే తమిళ సినిమాలు కూడా భారీ స్థాయిలోనే రిలీజ్ అవుతున్నాయి.
Naga Chaitanya :సాయి పల్లవితో డాన్స్ అంటే భయం!
ఇతర భాషల్లో సైతం రిలీజ్ చేస్తున్నారు కానీ ఇతర భాషల నుంచి వచ్చిన సినిమాలను మాత్రం తమిళనాడులో పెద్దగా ఎంకరేజ్ చేయడం లేదు. ప్రస్తుతం సూర్య కంగువ ప్రమోషన్స్ కోసం అన్ని రాష్ట్రాలు తిరుగుతూ ఈరోజు బెంగళూరు వెళ్ళాడు. ఒక రకంగా చెప్పాలంటే బెంగళూరు అదేనండి కన్నడ వాసులకు కూడా తమ భాష మీద ప్రేమ ఎక్కువ. తమ సినిమాల మీద ప్రేమ ఎక్కువ. కానీ మలయాళ, తమిళ, తెలుగు అనే భేదం లేకుండా అన్ని సినిమాలను ఆదరిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఒక జర్నలిస్ట్ సూర్యను నేరుగా ప్రశ్నించారు. ఈ కంగువ సినిమాని కర్ణాటకలో భారీ ఎత్తున వందల స్క్రీన్స్ ఇచ్చి రిలీజ్ చేస్తున్నారు. మీ తమిళనాడులో కూడా మా కన్నడ సినీ పరిశ్రమకు చెందిన శివన్న సినిమాని ఈ రేంజ్ లో రిలీజ్ చేయగలరా అని అడిగితే దానికి సూర్య షాక్ అయ్యాడు.
వెంటనే నేను డిస్ట్రిబ్యూటర్ సర్కిల్లో లేను, ఈ విషయం మీద ఏదైనా మీటింగ్లో నన్ను మాట్లాడమంటే మాత్రం ఖచ్చితంగా నేను మాట్లాడతాను. నావల్ల అయింది నేను చేయడానికి ప్రయత్నిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ అనేది వేరే ప్రపంచం ధియేటర్ ఓనర్లు డిస్ట్రిబ్యూటర్లు చూసుకుంటారు. నా పరిధిలో ఉన్నదైతే నేను చేస్తా అంటూ ఆయన కామెంట్ చేశారు. అయితే ఈ విషయంలో సూర్య ఇంకాస్త మెచ్యూర్డ్ గా సమాధానం చెప్పి ఉండొచ్చు. ఈ అంశం తన దృష్టికి కూడా వచ్చిందని, దీని పరిష్కారానికి ఏం చేయాలో పెద్దలు నిర్ణయిస్తారని చెప్పి ఉండవచ్చు కానీ తాను ఆ పొజిషన్లో లేను కాబట్టి మాట్లాడలేను అంటూ దాటవేయడం ఆయన అభిమానులకు అందరికీ జీర్ణం అవడం లేదు.