Renu Desai : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఆమె సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూ.. సొసైటీలో జరిగే విషయాలపై స్పందిస్తూ ఉంటుంది. తాజాగా ఆమె ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొని చాలా విషయాలను పంచుకుంది. ‘నేను సనాతన ధర్మాన్ని పాటిస్తాను. మోడీ భక్తురాలిని అనుకున్నా నాకేం అభ్యంతరం లేదు. మన ధర్మం ఎలా బతకాలో, ఎలా నడుచుకోవాలో నేర్పించింది. అందుకే నేను సనాతని అని చెప్పుకుంటాను. ఎవరేం అనుకున్నా సరే నేను బీజేపీకి సపోర్టు చేస్తాను. నరేంద్ర మోడీ గారిని అమితంగా అభిమానిస్తూ ఉంటాను’ అంటూ చెప్పుకొచ్చింది.
Read Also : JR NTR : జూనియర్ ఎన్టీఆర్ తో బడా డైరెక్టర్ల ఫొటో.. ఎక్కడ కలిశారంటే..?
మీరు రాజకీయాల్లోకి వస్తారా అని యాంకర్ ప్రశ్నించారు. రేణూ స్పందిస్తూ.. ‘రాజకీయాల్లోకి రావాలని నాకు కూడా ఉంది. అది నా జాతకంలోనే ఉంది. గతంలో చాలా సార్లు అవకాశాలు వచ్చాయి. కానీ నేను వెళ్లలేదు. నా పిల్లల కోసం ఆగిపోయాను. వారిని చదివించాల్సిన బాధ్యత నా మీద ఉంది. నా బాధ ఎప్పుడూ అదే. నేను సృష్టికి విరుద్ధంగా వెళ్తున్నానా అనిపిస్తుంది. ఏదైనా పార్టీలోకి వెళ్తే కచ్చితంగా అందరికీ చెప్తాను. కానీ ఒక్కోసారి నేను రాజకీయాలను అన్ ఫిట్’ అంటూ నవ్వుతూ చెప్పేసింది. మొత్తానికి రేణూ దేశాయ్ కూడా రాజకీయాలపై తనకున్న ఇంట్రెస్ట్ ను ఇలా బయట పెట్టేసిందన్నమాట. మరి ఆమె నిజంగానే రాజకీయాల్లోకి వస్తుందా లేదా అన్నది చూడాలి.