మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇప్పటికే గేమ్ చేంజర్ సినిమా పూర్తి చేశాడు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన 2025 సంవత్సరంలో రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమా పూర్తి అయిన తర్వాత ఆయన బుచ్చిబాబు దర్శకత్వంలో తన 16వ సినిమా చేస్తున్నాడు. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వి కపూర్ ఎంపికైంది. అయితే గతంలో రెహమాన్ కి ఇచ్చిన ఒక మాటకు కట్టుబడి నిన్న కడప దర్గాని రామ్ చరణ్ తేజ బుచ్చిబాబుతో కలిసి సందర్శించాడు. కడప దర్గాలో జరిగే 80 నేషనల్ ముషాయిరా గజల్ ఈవెంట్ కి హాజరు కావాల్సిందిగా రామ్ చరణ్ ని రెహమాన్ కోరారు. ఆయన మాట కాదనలేక నిన్న కడప దర్గా సందర్శించారు. అయితే ఇక్కడ ఒక పెద్ద వివాదం తెరమీదకు వస్తోంది.
Kasthuri: నటి కస్తూరి భర్త, కొడుకు, కూతుళ్ల గురించి తెలుసా?
అదేంటంటే మామూలుగా రాంచరణ్ వెళ్లి దర్గాని సందర్శించి వస్తే పెద్దగా చర్చ జరిగేది కాదేమో కానీ ప్రస్తుతం రామ్ చరణ్ తేజ అయ్యప్ప మండల దీక్షలో ఉన్నారు. 41 రోజుల పాటు కఠినమైన అయ్యప్ప దీక్ష చేస్తున్న రామ్ చరణ్ తేజ ఒక దర్గాని ఎలా సందర్శించారు అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే అయ్యప్ప దీక్ష నియమాల ప్రకారం దీక్షలో ఉండగా శవం ఎదురొస్తే వెంటనే పీఠం ఏర్పాటు చేసుకున్న సన్నిధానానికి వెళ్లి తల స్నానం చేసి మరోసారి విధిగా విభూతి ధరించాల్సి ఉంటుంది. అంతటి కఠినమైన నియమాలు ఎన్నో అయ్యప్ప దీక్షలో ఉన్నాయి. అలాంటిది ముస్లిం దర్గా అంటే అప్పటి ముస్లిం పెద్దలలో మరణించిన వారి ఒక సమాధి.
అలాంటి చోటకు అయ్యప్ప దీక్షలో ఉన్న రామ్ చరణ్ ఎలా వెళ్లాడు? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే నిజానికి ఇదేమీ పాపం కాదు, ఎందుకంటే అయ్యప్ప ఇరుముడి పూర్తయి శబరిమల పయనమైన తర్వాత మార్గమధ్యంలో ఉన్న ఎరుమేలిలో అయ్యప్ప భక్తులు విధిగా ఆగుతుంటారు. అక్కడ అయ్యప్ప స్నేహితుడిగా ప్రచారంలో ఉన్న వావరు అనే ఒక ముస్లిం మాజీ బందిపోటు సమాధిగా ఉన్న దర్గాని దర్శిస్తారు. దర్శించడమే కాదు అక్కడ నుంచి పేటతుళ్ళి ఆడుతూ పక్కనే ఉన్న ధర్మశాస్త్ర ఆలయాన్ని కూడా సందర్శిస్తారు. అక్కడి ఉన్న స్థల పురాణం ప్రకారం వావరు అనే ముస్లిం బందిపోటు ఆ మార్గంలో వెళ్లే అందరి వద్ద దోపిడీ చేస్తూ ఉంటాడు.
అలాగే ఓసారి అయ్యప్పను కూడా దోపిడీ చేసేందుకు ప్రయత్నిస్తే అయ్యప్ప వావరుకి జ్ఞాన బోధ చేసి ఇకపై దొంగతనాలు చేయను అనే మాట తీసుకుంటాడు. అంతేకాదు తనకు స్నేహితుడిగా మారిన కారణంగా ఇకమీదట శబరిమలలో తనను దర్శించుకోవడానికి వచ్చే ప్రతి భక్తుడు విధిగా నీ దర్గాని దర్శిస్తారని మాట ఇచ్చాడట. ఆ కారణంగా ఇప్పటికీ శబరిమల వెళ్లే భక్తులు సింహభాగం ఎరుమేలిలో ఆగి వావరు సమాధిని దర్శించి మరీ శబరిమల పయనమవుతారు. అలాంటి విషయాలు అయ్యప్ప దీక్షలోనే పొందుపరిచి ఉన్నాయి. కాబట్టి ఓవర్ స్వామి దర్గాను సందర్శించినప్పుడు లేని ఇబ్బంది కడప దర్గాను సందర్శిస్తే ఎందుకు వచ్చింది అని కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు.