Kasthuri: నటి కస్తూరి భర్త, కొడుకు, కూతుళ్ల గురించి తెలుసా?
- ఒక కేసులో అరెస్ట్ అయిన కస్తూరి శంకర్
- తెలుగు, తమిళ మీడియాలో పెద్ద చర్చ
- ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల ఒక కేసులో అరెస్ట్ అయిన కస్తూరి శంకర్ గురించి తెలుగు, తమిళ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. అయితే ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అనే విషయం మీద మాత్రం చాలా మందికి క్లారిటీ లేదు. కాబట్టి ఆ విషయం మీకు తెలిపే ప్రయత్నం చేస్తున్నాం. చెన్నైలోని ఎతిరాజ్ కాలేజీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నటి కస్తూరి ఆతా ఉన్ కోయిలిలే చిత్రంతో తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టింది. సంపన్న కుటుంబంలో జన్మించిన నటి కస్తూరి తండ్రి శంకర్ ఇంజనీర్, తల్లి సుమతి న్యాయవాది.. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత, కస్తూరి 1992లో సినిమాల్లోకి రాకముందు మిస్ చెన్నై పోటీ టైటిల్‌ను గెలుచుకుంది. అదే సంవత్సరం ఫెమినా మిస్ మద్రాస్ పోటీ కూడా గెలుచుకుంది. చదువుకుంటూనే మోడలింగ్‌లోనూ పాల్గొంది. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగు పెట్టింది. కస్తూరి సినిమాల్లోకి రావడానికి ప్రముఖ నటుడు ధనుష్ తండ్రి కస్తూరి రాజా కారణం. ఆయనే సినీ పరిశ్రమకు కస్తూరిని పరిచయం చేశాడు.
Allu Arjun : పుష్ప -2 ట్రైలర్ పై వాళ్లు స్పందిచలేదెందుకు..?
Also Read
ఆ సినిమా తరువాత కస్తూరి రసతి వాదం నాన్, గవర్నమెంట్ మాప్పిళ్ళై, సెంథమిల్ పటు, అభిరామి, రాకైల్ కోయిల్, కొత్త ముఖం, ఆత్మ, ఉత్బే పురుట్, చైనుప్ పాడా, తెన్రాల్ వామ్డి తేరు, భారతీయుడు, కాదల్ కావేటి వంటి అనేక చిత్రాల్లో నటించింది. తమిళంతో పాటు మలయాళం, కన్నడ, తెలుగు భాషల్లో కూడా పలు చిత్రాల్లో నటించారు. సినిమాలో నటిస్తూ ఉండగానే ఆమెకు డాక్టర్ రవికుమార్‌తో వివాహమైంది. వారి ప్రేమకు గుర్తుగా కస్తూరికి కొడుకు సంకల్ప్, కూతురు శోభిని ఉన్నారు. కానీ, కూతురు శోభిని లుకేమియాతో బాధపడి బయట పడింది. ఇది ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్. సామాజిక కార్యకర్తగా ఉన్న కస్తూరి.. సమాజంలో జరుగుతున్న పరిణామాలపై వ్యాఖ్యానించే పేరుతో తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అటువంటి క్రమంలోనే ఇప్పుడు జైలు శిక్ష అనుభవిస్తోంది. తెలుగు మాట్లాడే మహిళలపై దుష్ప్రచారం చేసినందుకు ఆమె ఇప్పుడు జైల్లో శిక్ష అనుభవిస్తోంది.
తాజావార్తలు
-
India Summit Row: రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు ఏడు సూచనలు.. “బీజేపీని శత్రువుగా చూడొద్దు” అంటూ హితవు!
-
Kapildev: టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఈ ఇద్దరు దిగ్గజాలు పెద్ద తప్పు చేశారు..
-
Imran Khan: ‘‘ప్రాణాలతో తిరిగి రాకపోవచ్చు’’.. నిస్సహాయ స్థితిలో ఇమ్రాన్ ఖాన్ లేఖ!
-
Love Story: అనిరుధ్ మామ కళానిధి మారన్ ప్రేమ కథ తెలుసా?
-
INDIA Bloc: ఎన్నికల సంఘానికి 48 ప్రశ్నలు.. సుప్రీంకోర్టులో INDIA కూటమి పిటిషన్!
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!