SSMB 29: మహేష్ కోసం ప్రియాంకని దింపడం వెనుక ఇంత స్కెచ్ ఉందా ?
- మహేష్ బాబు సినిమాలో ప్రియాంక చోప్రాని క్యాస్ట్ చేసిన రాజమౌళి
- ఆమెను తీసుకోవడం వెనుక పెద్ద స్కెచ్
- ఫిలింనగర్ వర్గాల్లో జోరుగా సాగుతున్న ప్రచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ఫిక్స్ చేయలేదు కానీ ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు మాత్రం బయటకు రానీయకుండా చూసుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. సైలెంట్ గా షూట్ కూడా చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే ఈ సినిమాలో ప్రియాంక చోప్రాను తీసుకోవడానికి కారణం పెద్దదే అని తెలుస్తోంది. రాజమౌళి గత చిత్రం ఆర్ఆర్ఆర్ సినిమాకి ఒక ఆస్కార్ అవార్డు లభించిన సంగతి తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరీలో ఈ సినిమాకి అవార్డు లభించింది. అయితే ఆ అవార్డుని అమెరికా కుర్రాడిని పెళ్లి చేసుకుని హాలీవుడ్లో సెటిల్ అయిన ప్రియాంక చోప్రాకి చెందిన ఏజెన్సీ ద్వారానే అప్లై చేసినట్లుగా చెబుతున్నారు.
SSMB 29: మహేష్ – ప్రియాంక విత్ బాలీవుడ్ హీరో.. సైలెంటుగా పని కానిస్తున్న జక్కన్న
Also Read
ఆస్కార్ రావడానికి వెనుక ప్రియాంక చోప్రా ఏజెన్సీ కృషి కూడా గట్టిగానే ఉందనే వాదన వినిపిస్తోంది. దానికి కృతజ్ఞతగా రాజమౌళి ఆమెను ఈ సినిమాలోకి తీసుకున్నారని అంటున్నారు. ఇలా తీసుకోవడానికి కూడా ఒక కీలకమైన కారణం ఉందని అంటున్నారు. అదేంటంటే తన సొంత సినిమా కాకపోయినా తన ఏజెన్సీ ద్వారా ప్రియాంక చోప్రా ఆర్ఆర్ఆర్ సినిమాని గట్టిగా ప్రమోట్ చేయించి ఆస్కార్ స్థాయికి తీసుకువెళ్లింది. అదే ఆమె స్వయంగా నటించిన సినిమా అయితే ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకుని దాన్ని మరింత పుష్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. దానికి తోడు ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ లో చక్రం తిప్పుతోంది. ఆమెకు అక్కడ మంచి క్రేజ్ ఏర్పడింది కూడా. కాబట్టి ఆమెను రాజమౌళి తెలివిగా ఈ సినిమాలో భాగం చేశారనే ప్రచారం జరుగుతోంది. అయితే అందులో నిజా నిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదు ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా సహా జాన్ అబ్రహంల మీద సీన్స్ షూట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
తాజావార్తలు
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!