సంజు తర్వాత రణబీర్, విక్కీ కౌశల్ కెరీర్స్‌లో డ్రాస్టిక్ ఛేంజెస్ చోటుచేసుకున్నాయి. యానిమల్ అటు రణబీర్, ఛావాతో ఇటు విక్కీ బాక్సాఫీసును షేక్ చేసేసారు. ఆ సినిమాలతో ఉన్న పళంగా ఈ ఇద్దరి ఇమేజ్ కూడా డబుల్ అయ్యింది. ఇప్పుడు వీరి కాంబోలో మరో మూవీ తెరకెక్కుతోంది. అదే సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రాబోతున్న లవ్ అండ్ వార్. ఆలియా భట్ ఫీమేల్ లీడ్. ఈ ఇద్దరితో ఆమె నటిస్తోన్న సెకండ్ మూవీ కావడం విశేషం. వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి క్రేజీ గాసిప్స్ బాలీవుడ్ లో సర్య్యులేట్ అవుతున్నాయి.
Also Read : Shraddha Kapoor : సినిమాలపై శ్రద్ధ లేని ‘శ్రద్దా కపూర్’
లవ్ అండ్ వార్‌ను సంజయ్ లీలా భనాల్సీ పాన్ ఇండియా మూవీగా తీసుకురావాలని అనుకుంటున్నాడట. ముఖ్యంగా తెలుగు మార్కెట్ టార్గెట్ చేయాలనుకుంటున్నాడట. యానిమల్, ఛావాతో టాలీవుడ్‌లో రణబీర్, విక్కీ ఫేమ్ తెచ్చుకున్న నేపథ్యంలో ఇలా ప్లాన్ చేస్తున్నాడని టాక్. రణబీర్‌తో మాజీ ప్రేయసి దీపికా నటించబోతుందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. 40 నిమిషాల బ్యాగ్రౌండ్ స్టోరీ కోసం ఆమెను తీసుకోబోతున్నారట. వీరిద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ ఉన్నాయని, గతంలో సంజయ్ లీలా భన్సాలీతో వర్క్ చేసిన నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ పై పని చేయాలా లేదా అని కల్కి బ్యూటీ ఆలోచనలో పడ్డట్లు బాలీవుడ్ లో న్యూస్ హల్ చల్ చేస్తున్నాయి. అసలు అలియా నటిస్తున్న ఈ సినిమాలో దీపికా నటిస్తుందా అసలు ఇదంతా వర్కౌట్ అవుతుందా అనే సినీజనాలు చర్చించుకుంటున్నారు. మేకర్స్ ఈ వార్తలపై క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.