శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా, నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం కుబేర. ఈ సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నెల 20వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో, ఇప్పటికే మేకర్స్ సెన్సార్ బోర్డుకు సెన్సార్ కోసం అప్లై చేశారు. ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ ఈ నెల 9వ తేదీనే పూర్తయింది. సెన్సార్ అధికారులు సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. 13+ సినిమాగా దీన్ని అభివర్ణించారు. అయితే, సెన్సార్ సర్టిఫికేషన్ తర్వాత సినిమా యూనిట్ 19 చోట్ల విజువల్స్ కట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మొత్తం విజువల్స్ డ్యూరేషన్ ఏకంగా 13 నిమిషాలు ఉండడం గమనార్హం. అంటే, సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత, తాము ఈ విజువల్స్‌ను సినిమా నుంచి తొలగిస్తున్నట్లు సెన్సార్ సభ్యులకు సినిమా టీం రిపోర్ట్ చేసింది.
Also Read:Sonam Raghuvanshi Case: మేఘాలయలో భర్త హత్య.. సోనమ్‌ని పట్టించిన ‘‘వాట్సాప్’’
ఈ నేపథ్యంలో సినిమా నిడివి గణనీయంగా తగ్గే అవకాశం కనిపిస్తోంది. నిజానికి, ఈ సినిమా నిడివి గురించే ముందు నుంచి కంప్లైంట్స్ ఉన్నాయి. ఇప్పుడు తాజా సెన్సార్ రిపోర్టుతో ఆ కంప్లైంట్ కాస్త క్లియర్ అయినట్లే చెప్పొచ్చు. రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను ఏషియన్ సునీల్ తన స్నేహితుడు పుష్కర్ రామ్మోహన్ రావుతో కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా, హిందీతో పాటు తమిళంలో కూడా రిలీజ్ చేస్తున్నారు. వాస్తవానికి, తెలుగు, తమిళం ఏకకాలంలో షూట్ చేసినట్లు నిర్మాతలు వెల్లడించారు. దీన్ని ద్విభాషా చిత్రంగా పేర్కొంటూ, హిందీలో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.