Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Shekar Kammula Interview For Kubera Movie

Shekar Kammula: కుబేర లాంటి సినిమాని ఇప్పటివరకూ చూసి వుండరు!

Published Date :June 18, 2025 , 6:07 pm
By Bhargav Chaganti
Shekar Kammula: కుబేర లాంటి సినిమాని ఇప్పటివరకూ చూసి వుండరు!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న, హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘కుబేర’. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న ఈ కుబేర ఇండియన్ సినిమాలో గేమ్-ఛేంజర్‌గా నిలవబోతోందని మేకర్స్ నమ్ముతున్నారు. ఇప్పటికే విడుదలైన కుబేర ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. పోయిరా మామ, ‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’, పీపీ డమ్ డమ్ సాంగ్స్ చార్ట్ బస్టర్ రెస్పాన్స్ తో మ్యూజిక్ చార్ట్స్ లో టాప్ ట్రెండింగ్ లో వున్నాయి. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హై ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు. కుబేర తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ శేఖర్ కమ్ముల విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.

కుబేర తీయడానికి మోటివేషన్ ఏమిటి?
-మోటివేషన్ అంటూ ఏం లేదు కానీ ఇది ఒక ఇంట్రెస్టింగ్ లైన్ అనిపించింది. ఒక సూపర్ రిచ్ ప్రపంచం, ఇంకొకటి అట్టడుగున ఉండే ప్రపంచం.. బిలినియర్ వర్సెస్ బెగ్గర్.. అది ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. నిజానికి ఇది కథగా చెప్పడం చాలా కష్టం. చాలా పెద్ద పాయింట్. అది మెల్లగా ఇవాల్వ్ అయిన ఒక ఎమోషనల్ థ్రిల్లర్ తయారయింది. అక్కడ నుంచి డెవలప్ చేయడం జరిగింది.

Also Read

  • Sai Pallavi: ‘రామాయణ’ టీమ్‌పై సాయిపల్లవి ఫ్యాన్స్‌ ఫైర్!
  • Box Office Clash : ఒకేరోజు రిలీజ్ అవుతున్న 'ఎపిక్' & 'చెన్నై లవ్ స్టోరీ'
  • Drishyam 3 : అడ్వాన్స్ సేల్స్ లో దూసుకెళ్తున్న దృశ్యం 3.. మోహన్ లాల్ మరో ఇండస్ట్రీ హిట్ ఇస్తాడా?
  • Kanchana4: ‘కాంచన 4’ నుండి.. ఫ్యాన్స్‌కు షాకింగ్ అప్‌డేట్!
Add as a preferred
source on google

-తనకి ఏమీ వద్దు అనుకునే ఒక బెగ్గర్.. తనకి ప్రపంచంలో అన్ని కావాలనుకునే ఒక బిలినియర్.. వారి మధ్య కాన్ఫ్లిక్ట్ ఉంటే ఎలా ఉంటుందనేది చాలా ఇంట్రెస్టింగ్.

– ఈమధ్యకాలంలో చాలా సినిమాలు కథలు వస్తున్నాయి కానీ ఇలాంటి ఒక కథ నేను చెప్పినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కథ డెఫినెట్ గా చెప్పబడాలి. ఈ కథ అవేర్నెస్ ని తీసుకొస్తుంది. మంచి థ్రిల్లింగ్ పాయింట్.

-సినిమాని తెలుగు తమిళ్ రెండు భాషల్లో షూట్ చేశాం. కథపరంగా ఎలాంటి మార్పు ఉండదు కానీ లెంత్ లో ఒక నిమిషం తేడా వుంటుంది. లిప్ సింక్ పరంగా ప్రతిది విడివిడిగా తీశాం. టెక్నికల్ గా రెండు సినిమాలు తీసినట్లే. అందుకే కొంచెం టైం పట్టింది.

ఈ కథకు నాగర్జున గారే కావాలి మీరు పట్టుపట్టారని తెలిసింది?
– కొన్ని షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ నాగార్జున గారు చేస్తే బాగుంటుంది. ఈ క్యారెక్టర్ కి ఆయన పర్ఫెక్ట్ యాప్ట్. ఆయనని స్క్రీన్ మీద చూసినప్పుడు ఒక వావ్ ఫ్యాక్టర్ ఉంటుంది. అయితే ఇందులో ఆయన్ని ఒక వేరే విధమైన యాక్టింగ్, మేనేజర్స్ తో క్యారెక్టర్ కి తగ్గట్టుగా చూపించడం జరిగింది.

-నాగార్జున గారు మనం, ఊపిరి ఇలా చాలా చిత్రాల్లో డిఫరెంట్ వేరియేషన్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో కూడా ఆయన చాలా కొత్తగా కనిపిస్తారు. ఈ క్యారెక్టర్ లోకి ఆయన అద్భుతంగా ఇమిడిపోయారు.

-రష్మిక కూడా అందర్నీ సర్ప్రైజ్ చేస్తుంది. తనకి మంచి అవకాశం వస్తే నెక్స్ట్ లెవెల్ లో నటించే హీరోయిన్ తను.

కుబేర పాత్ర కోసం ధనుష్ గారిని ఎంపిక చేయడానికి కారణం?
-ఈ క్యారెక్టర్ ని ఆయన తప్పితే ఎవరూ చేయలేరు. సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ కూడా ఇదే మాట చెబుతారు. అంతా అద్భుతంగా పెర్ఫాం చేశారు. అవుట్ స్టాండింగ్ పర్ఫామెన్స్ అనేది చిన్న మాట. ఆ క్యారెక్టర్ లో ఇంకా ఎవరిని ఊహించలేరు. ఆయన సినిమా పూర్తి అయ్యేవరకూ ఆ క్యారెక్టర్ లోనే ఉంటారు. ఏదైనా సింగిల్ టేక్ లో చేసేస్తారు.

కుబేర కూడా మీ మార్క్ లోనే ఉంటుందా?
-నిజానికి నా మీద ఒక మార్క్ పడింది కానీ నేను ఒక మార్కు కోసం ఎప్పుడూ సినిమాలు చేయలేదు. కథకు ఏం కావాలో అదే చేశాను. అయితే ఎక్కువగా బ్లాక్ బస్టర్ ఆయన సినిమాలు మ్యూజికల్ హిట్స్, లవ్ స్టోరీలు ఉంటాయి కాబట్టి అలా ఒక ముద్ర వచ్చింది.

-లీడర్ సినిమా చాలా హానెస్ట్ గా చెప్పిన కథ. అందులో లవ్ స్టోరీ పెట్టాలి మంచి పాటలు పెట్టాలని అనుకోలేదు. హ్యాపీ డేస్ లో కూడా అంతే. కాలేజ్ స్టోరీ అంటే కాల్ స్టోరీ లాగే ట్రీట్ చేయడం జరిగింది. అందుకే మీకు నచ్చింది. కుబేర కూడా అంతే. ఈ కథకు కావలసింది చేశాను. మార్క్ అనేది కథ ప్రకారం ఉంటుంది. అయితే ఇలాంటి కథని ఇలా చేశారా అనే వావ్ ఫ్యాక్టర్ కుబేర చూసినప్పుడు ఆడియన్స్ లో ఉంటుంది. అందుకే ముందుగానే ఈ కంటెంట్ ఏంటనేది ట్రైలర్ టీజర్ లో క్లియర్ గా చెప్పాము. రిచ్, పూర్ మధ్య జరిగే కథని ముందుగానే ఎస్టాబ్లిష్ చేశాం.

-ఇది ఒక డిఫరెంట్ సినిమా. నేను ఏ సినిమా తీసిన హానెస్ట్ గానే చేస్తాను. అది ఈ సినిమాలో పదింతలు కనిపిస్తుంది.

ఇలాంటి ఒక ఇదియాలజీ ఎవరినైనా నొప్పించేలా ఉంటుందా?
-లేదండి. ఇది ఐడియాలాజికల్ బాటిల్ ఉండే సినిమా కాదు. అయితే సినిమా చూస్తున్నప్పుడు ఇలాంటి ఒక రెండు ప్రపంచాలు ఉన్నాయనే అవేర్నెస్ వస్తుంది.

దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ గురించి ?
-దేవిశ్రీ ప్రసాద్ గారితో జర్నీ సూపర్ గా ఉంది. కమర్షియల్ గా ఆయన కింగ్. కుబేర కి అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. హై ఇచ్చే చాలా మూమెంట్స్ వున్నాయి. మ్యూజిక్ చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.

ఇది మీ కెరీర్ లో భారీ బడ్జెట్ సినిమా కదా ..నిర్మాతలు సపోర్టు గురించి?
-ఇంత పెద్ద స్టార్ కాస్ట్, పెద్ద బడ్జెట్ నిర్మాతల వల్లే సాధ్యమైంది. నేను ఏమి అడిగినా అది కాదనకుండా ఇచ్చారు. చాలా అద్భుతంగా సపోర్ట్ చేశారు.

సినిమాలో నాగార్జున గారు ధనుష్ గారి క్యారెక్టర్స్ ఎలా ట్రావెల్ చేస్తాయి?
అది మీరు సినిమాలోనే చూడాలి.(నవ్వుతూ) చాలా బ్యూటిఫుల్ గా వుంటుంది.

జిమ్ షర్బ్ గురించి?
-ఆయన నన్ను చాలా సర్ప్రైజ్ చేశారు. ఎంత పెద్ద డైలాగ్ అయినా నేర్చుకునేవారు. చాలా పర్ఫెక్ట్ గా ఒక లైన్ మిస్ కాకుండా చెప్పేవారు. ఈ సినిమా తర్వాత ఆయనకి మరిన్ని అవకాశాలు ఇక్కడ వస్తాయి.

ఈ సినిమా ప్రాసెస్ లో ఛాలెంజింగ్ అనిపించింది ఏమిటి ?
-ముంబై షూట్ చాలా డిఫికల్ట్., అక్కడ పర్మిషన్స్ రావు. చాలా కండిషన్స్ ఉంటాయి. ముంబై వాళ్లే వేరే చోట షూట్ చేసుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో అక్కడ షూట్ చేయడం అనేది చాలా చాలెంజింగ్ గా అనిపించింది.

ముంబై బ్యాక్ డ్రాప్ తీసుకోవడానికి కారణం ఏమిటి?
-ఈ కథే ముంబై బ్యాక్ డ్రాప్ కోరుకున్నది. కథపరంగా ముంబై తప్పనిసరి.

ఈ 25 ఇయర్స్ జర్నీ చూసుకున్నప్పుడు ఎలా అనిపిస్తుంది?
-ఎక్కడో ఒక చిన్న ఇంట్లో ఫస్ట్ సినిమా తీశాను. ఇప్పుడు ఇంత పెద్ద సినిమా చేశాను. ఈ జర్నీ అంత చూసుకున్నప్పుడు ఎమోషనల్ గా అనిపిస్తుంది. ప్రేక్షకులు చాలా ప్రేమని ఇచ్చారు. ఎప్పుడు నాపై ఒక నమ్మకాన్ని ఉంచారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను. అది చాలా ఆనందాన్ని ఇచ్చే విషయం. నా సినిమాల్ని అప్రిషియేట్ చేసి ఆడియన్స్ నాకు ఒక స్థాయిని ఇచ్చారు. అంతకంటే నేను ఏం కోరుకోను.

కుబేర కి పార్ట్ 2 ఉంటుందా?
లేదండి. ఇక్కడితో అయిపోతుంది. నేను ఒక్కటి తీసినప్పటికే సరిపోతుంది(నవ్వుతూ)

లీడర్ కి సీక్వల్ ఉంటుందా?
అది నేను ఆలోచిస్తూ ఉంటాను. కథ నాకు క్లారిటీ ఉంది. కానీ లీడర్ తీసినప్పటికీ ఇప్పటికీ పరిస్థితులన్నీ చాలా మారిపోయాయి. దేశం, ప్రజల్లో చాలా మార్పులు వచ్చేసాయి. థింకింగ్ మారిపోయింది. దాన్ని సరిగ్గా పట్టుకోవాలి

నెక్స్ట్ కూడా పాన్ ఇండియా సినిమా చేయబోతున్నారా?
-అలా ఏం లేదండి. ఈ సినిమా కూడా పాన్ ఇండియా చేయాలి అని చేసింది కాదు. కథలోన ఒరిజినల్ గా ట్రూ పాన్ ఇండియా ఎక్స్పీరియన్స్ ఉంది. దేశం మొత్తం రిలేట్ అయ్యే కథ ఇది. నిజానికి పాన్ ఇండియా సినిమా చేయడం చాలా కష్టం. పాటలు డబ్బింగ్ లిరిక్స్ ఇవన్నీ చూసుకోవడం సామాన్యమైన విషయం కాదు.

నాని గారితో మీరు ఒక సినిమా అనుకున్నారని విన్నాం ?
-షాలిడ్ గా అనుకోలేదు. దానికి కొంచెం టైం పడుతుంది. ఇంకా వర్క్ చేయాలి.

ఆల్ ది బెస్ట్
-థాంక్యూ

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • kubera movie
  • Shekar Kammula interview
  • Shekar Kammula interviews

తాజావార్తలు

  • Sai Pallavi: ‘రామాయణ’ టీమ్‌పై సాయిపల్లవి ఫ్యాన్స్‌ ఫైర్!

  • Dropped Catch: ఆ ఒక్క క్యాచ్ మిస్.! ఫలితం.. ఐపీఎల్ 2026 నుండి ముంబై ఇండియన్స్ అవుట్..

  • Box Office Clash : ఒకేరోజు రిలీజ్ అవుతున్న ‘ఎపిక్’ & ‘చెన్నై లవ్ స్టోరీ’

  • Urvil Patel: కోచ్ చెప్పాడు, కొట్టాను.. నయా సెన్సేషన్ ఉర్విల్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Drishyam 3 : అడ్వాన్స్ సేల్స్ లో దూసుకెళ్తున్న దృశ్యం 3.. మోహన్ లాల్ మరో ఇండస్ట్రీ హిట్ ఇస్తాడా?

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions