Tollywood : మన హీరోలు కొత్త కథలు చేయలేరా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో హీరోలుగా రాణిస్తున్న చాలామంది నటులకు మంచి ప్రతిభ ఉంది. నటులుగా వాళ్ళని వాళ్ళు ఎలివేట్ చేసుకొని స్టార్ హీరోలుగా మారిపోయారు. ఇక మీడియం రేంజ్ హీరోలు సైతం ఇప్పుడిప్పుడే వరుస సక్సెస్‌లను సాధిస్తూ తమ మార్కెట్‌ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే కొన్ని డిఫరెంట్ అటెంప్ట్లను చేయడానికి మన హీరోలు పెద్దగా ఆసక్తిని చూపించడం లేదు. దానివల్ల ఇతర భాషల్లో ఉన్న హీరోల వైపే మన దర్శకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అందులో భాగంగానే దుల్కర్ సల్మాన్ లాంటి హీరోలకు ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి. మన స్టార్ హీరోలు రిజెక్ట్ చేసిన కథలతోనే ఆయన ఇక్కడికి వచ్చి సూపర్ సక్సెస్‌ని సాధించి, తెలుగులో తన మార్కెట్‌ని విస్తరించుకుంటున్నారు.
‘మహానటి’, ‘సీతారామం’, ‘లక్కీ భాస్కర్’ లాంటి సినిమాల కథలు మొదట మన తెలుగు హీరోల దగ్గరికి వెళ్లాయి. కానీ వాళ్ళు ఆ కథలను రిజెక్ట్ చేయడంతో, మలయాళం ఇండస్ట్రీ నుంచి దుల్కర్ సల్మాన్‌ను తీసుకొచ్చి అతనితో సినిమా చేయించి సూపర్ సక్సెస్‌ని సాధించారు. ప్రస్తుతం ‘ఆకాశంలో ఒక తార’ సినిమా కూడా మొదట ఒక తెలుగు హీరో దగ్గరికి వెళ్లిందని, ఆయన ఆ కథను రిజెక్ట్ చేశాడని, దాంతో దుల్కర్ సల్మాన్‌ను రంగంలోకి దింపాల్సిన పరిస్థితి ఏర్పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read
మొత్తానికైతే దుల్కర్ సల్మాన్ లాంటి హీరో తెలుగు హీరోలందరికీ చెక్ పెడుతూ వరుస సక్సెస్‌లను సాధిస్తున్నాడు. కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలకు దుల్కర్ సల్మాన్ పెట్టింది పేరుగా మారిపోయాడు. ఇలాంటి హీరోలు మన దగ్గర లేరా అంటే ఉన్నారు. కానీ ఇమేజ్ చట్రంలో ఇరుక్కుని, “అలాంటి సినిమా మాకు సెట్ అవ్వదు, ఈ సినిమా చేస్తే మా మార్కెట్ పడిపోతుందేమో” అనే భయంలో ఉన్నారు. కాబట్టి మన హీరోలు మంచి సినిమాలను మిస్ అవుతున్నారు.
ఎప్పుడైతే ఇమేజ్ చట్రం నుంచి బయటకు వచ్చి, ఎలాంటి కథనైనా సరే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని హీరోలు స్వయంగా చెబుతారో, అప్పుడు మాత్రమే వాళ్ళ దగ్గరికి డిఫరెంట్ కథలు రావచ్చు. ఎప్పుడూ రొటీన్ సినిమాలను చేయడమే కాకుండా, అప్పుడప్పుడు డిఫరెంట్ తరహాలో ప్రయత్నం చేస్తే కూడా సక్సెస్‌లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే వాళ్ళ నటనను పూర్తిస్థాయిలో ఎలివేట్ చేసుకునే అవకాశం కూడా దక్కుతుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలతో వైవిధ్యభరితమైన సినిమాలు చేయడానికి చాలామంది దర్శకులు ఆసక్తి చూపిస్తారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-15 Live : కోటి దీపోత్సవంలో శ్రీనివాస కల్యాణం.. 15వ రోజు విశేషాలివే.!
-
Kaaka Movie: ‘కాకా’ నైజాం రైట్స్ ఆ సంస్థకే.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..!
-
Boyapati: చిరంజీవి, బాలయ్యల కోసం కథ రెడీ చేసిన స్టార్ డైరెక్టర్
-
RBI Repo Rate Hike: లోన్ తీసుకున్న వారికి బిగ్ అలర్ట్.. డిసెంబర్ 4న ఆర్బీఐ భారీ వడ్డీ బాంబు! పెరగనున్న ఈఎంఐలు..
-
Ramayana Part 1: రావణుడిని హైలైట్ చేయడం వెనుక అసలు మాస్టర్ ప్లాన్ ఇదే.. నమిత్ క్లారిటీ!
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్‌తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!