Devi Sri Prasad: దేవీశ్రీ దూరం అవుతున్నాడా? పక్కన పెడుతున్నారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ మ్యూజిక్ వరల్డ్‌లో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్ అదే ‘రాక్ స్టార్’ దేవీశ్రీ ప్రసాద్‌కు ఏమైంది? అని. నిజానికి ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలకు ఫస్ట్ ఛాయిస్‌గా నిలిచిన ఈ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్, ఇప్పుడు కేవలం పాటలకే పరిమితం అవుతున్నారా? బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) విషయంలో ఆయనను పక్కన పెడుతున్నారా లేక ఆయనే తప్పుకుంటున్నారా? చర్చ ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. సాధారణంగా దేవీశ్రీ ప్రసాద్ అంటే అద్భుతమైన మెలోడీలు, మాస్ బీట్లే కాదు.. అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు కూడా కేరాఫ్ అడ్రస్. కానీ, ఇటీవల కొన్ని క్రేజీ ప్రాజెక్టుల విషయంలో సీన్ మారుతోంది. పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి దేవీశ్రీ పాటలు ఇచ్చారు. కానీ, రీ-రికార్డింగ్ బాధ్యతలను మాత్రం తమన్‌కు అప్పగించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
Also Read :Anirudh Ravichander: అనిరుధ్ ‘అల్బుకర్క్యూ రికార్డ్స్’తో కలిసిన యూనివర్సల్ మ్యూజిక్
Also Read
అంతేకాదు, దేవీశ్రీకి అత్యంత సన్నిహితుడైన సుకుమార్ సినిమా ‘పుష్ప 2’ విషయంలోనూ ఇలాంటి చర్చే నడిచింది. కొన్ని సీన్స్‌కు శ్యామ్ సి.ఎస్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించారనే వార్తలు వైరల్ అయ్యాయి. గతంలో ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన చిరంజీవి-బాబీ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతున్నా.. అక్కడ కూడా దేవీశ్రీ పేరు కాకుండా తమన్ పేరు వినిపిస్తుండటం గమనార్హం. రీసెంట్గా జరిగిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈవెంట్‌కు దేవీశ్రీ హాజరుకాకపోవడంపై దర్శకుడు హరీష్ శంకర్ వివరణ ఇస్తూ.. ఆయన బిజీగా ఉండటం వల్లే రాలేదని చెప్పారు. అయితే, ప్రస్తుతం చేతిలో పెద్దగా సినిమాలు లేని దేవీశ్రీకి అంత టైం దొరకడం లేదా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. మరోవైపు, దేవీశ్రీ ప్రసాద్ ‘ఎల్లమ్మ’ అనే సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఆయన నెలలో 10 రోజులు నటనకు, 20 రోజులు సంగీతానికి కేటాయిస్తానని కండిషన్ పెట్టుకున్నట్లు టాక్. హీరోగా బిజీ అవ్వడం వల్లే రీ-రికార్డింగ్ లాంటి ఎక్కువ సమయం తీసుకునే పనులకు ఆయన దూరమవుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read :Renu Desai: అనసూయ తర్వాత ఇప్పుడు రేణు దేశాయ్.. సెలబ్రిటీలను టార్గెట్ చేస్తే జైలుకే!
‘ఆర్య’ నుంచి ‘పుష్ప 2’ వరకు సుకుమార్ ఆస్థాన సంగీత దర్శకుడిగా దేవీశ్రీ కొనసాగుతున్నారు. త్వరలో పట్టాలెక్కనున్న రామ్ చరణ్ – సుకుమార్ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఒకవేళ ఇక్కడ కూడా దేవీశ్రీ కాకుండా వేరే ఆప్షన్ వెతుక్కుంటే మాత్రం, రాక్ స్టార్ స్టార్ హీరోలకు దూరం అవుతున్నారనే వార్తలకు మరింత బలం చేకూరుతుంది. రీ-రికార్డింగ్ విషయంలో దేవీశ్రీ ఇస్తున్న అవుట్‌పుట్ మేకర్స్‌కు నచ్చడం లేదా? లేక ఆయన బిజీ షెడ్యూల్ వల్ల డెడ్ లైన్స్ మిస్ అవుతున్నారా? అన్నది క్లారిటీ లేదు. ఏది ఏమైనా, టాలీవుడ్‌ను ఏలిన ఒక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇలా కేవలం పాటలకే పరిమితం కావడం అభిమానులకు కాస్త నిరాశ కలిగించే విషయమే. దీనిపై రాక్ స్టార్ స్పందిస్తే తప్ప ఈ పుకార్లకు చెక్ పడేలా లేదనే చెప్పాలి.
తాజావార్తలు
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
-
Sir Garfield Sobers: ప్రముఖ క్రికెట్ దిగ్గజం కన్నుమూత.. బర్త్‌డేకు ముందు గార్ఫీల్డ్ సోబర్స్ మృతి
-
Parthiv Patel: హిట్‌మ్యాన్‌ను తక్కువ అంచనా వేయొద్దు’.. రోహిత్ రిటైర్మెంట్ మధ్య మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
-
Trump: ట్రక్ డ్రైవర్లకు ట్రంప్ బిగ్ షాక్.. భారతీయులపై తీవ్ర ప్రభావం!
-
Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?