Devara: దేవర హైప్.. సరిపోదా??
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Will Devara Hype Really Helps Movie: సరిపోదా శనివారం సినిమా రిలీజ్ తో ఆగస్టు నెల పూర్తయింది. సెప్టెంబరు నెలలో దేవర ఒక్కటే పెద్ద సినిమా మిగతా చిన్నాచితకా సినిమాలు ఉన్నాయి కానీ దేవర మీదే అందరి ఫోకస్ ఉంది. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడి సెప్టెంబర్ 27వ తేదీకి వెళ్ళింది. అయితే ఈ సినిమా హైప్ అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. నిజానికి కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా దేవర అనే సినిమా అనౌన్స్ చేశారు. కొరటాల ఆచారి లాంటి డిజాస్టర్ అందించి ఉండడం, జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద సహజంగానే అందరి ఆసక్తి ఉంది. దానికి తగ్గట్టుగానే హీరోయిన్గా అతిలోకసుందరి అని తెలుగు వారంతా భావించే జాన్వీ కపూర్ ను దించడం, ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం అని చెప్పడం విలన్ గా, సైఫ్ అలీ ఖాన్ ను దింపడం లాంటివి సినిమా మీద ఉన్న ఆసక్తిని అమాంతంగా పెంచేశాయి.
Swag Teaser: హేయ్ శ్రీవిష్ణు.. నువ్వేనా? ఇదేందయ్యా ఇదీ!
Also Read
- Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
- Srikanth Odela: చిరంజీవి సినిమా పక్కన పెట్టేసి 3 నెలల బ్రేక్.. శ్రీకాంత్ ఓదెల మైండ్‌లో ఏముంది?
- Srikanth Odela:రోజుకో అప్‌డేట్ అంటే చిరాకు!
- Srikanth Odela: షూటింగ్లో ప్లానింగ్ ఫెయిల్.. అందరినీ టార్చర్ పెట్టా: 'ప్యారడైజ్' ఆలస్యంపై దర్శకుడి షాకింగ్ కామెంట్స్!
దానికి తగ్గట్టుగానే సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు ఒక రేంజ్ లో ప్రేక్షకులకు ఎక్కేశాయి. మూడో పాట కోసం ఇప్పుడు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. దానికి తగ్గట్టుగానే లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి తనవంతుగా తాను హైప్ ఎక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. మరొకపక్క మీడియాకి, సోషల్ మీడియా కి లీకులు ఇస్తూ సినిమా యూనిట్ కూడా సినిమా మీద హైప్ ఎక్కించే ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ హైప్ ఎంతవరకు ఉపయోగపడుతుంది? అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎందుకంటే పెద్దగా హైప్ లేకుండా వచ్చిన సరిపోదా శనివారం సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. కొంత నెగిటివ్ టాక్ ఉన్నా సింహభాగం పాజిటివ్ టాక్ తో హిట్ ట్యాగ్ వేసుకొని దూసుకుపోతోంది. ఈ విషయంలో దర్శక నిర్మాతలు ఒక తెలివైన పని చేశారు.
అది ఏంటంటే తమ సినిమా కథ కొత్త కథ కాదని ఏకంగా అసలు లైన్ ఏంటో కూడా చెప్పేసి ప్రేక్షకుల మైండ్స్ ని ప్రిపేర్ చేసేశారు. అంటే ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా ధియేటర్లకు రండి.. నాని, సూర్య నటన చూడండి- ఆనందించండి అన్నట్టుగా ప్రేక్షకులను రెడీ చేశారు. అదేవిధంగా ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి చెప్పినట్టుగానే ఎంజాయ్ చేసి బయటకు వస్తున్నారు. హైప్ లేకుండా వచ్చి ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంది. నానికి ఎన్టీఆర్ కి పోలిక పెట్టలేము కానీ నాని సినిమా రిజల్ట్ చూశాక దాదాపుగా ఇప్పుడు దేవరకి కూడా హైప్ కాస్త తగ్గించే ప్రయత్నం చేస్తే మంచిదేమో అనిపిస్తోంది. ఎందుకంటే హైప్ ఎంత పెరిగితే దర్శక నిర్మాతలకు అంత కత్తి మీద సాము లాంటి పరిస్థితి ఏర్పడుతోంది.
ఏమాత్రం అంచనాలకు తగ్గినా సినిమా ఏమీ బాలేదని సోషల్ మీడియాలో అభిమానులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్న రోజుల్లో ఈ హైప్ ని ఇంకా ఇంకా పెంచే బదులు కాస్త తగ్గించి ప్రేక్షకుల్లోకి వదిలితే మంచిదేమో అనే భావన సినీ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లకు వెళితే సినిమా కొంచెం బాగున్నా భలే ఉందే అనే ఫీలింగ్ కలుగుతుంది అదే భారీ అంచనాలతో థియేటర్లకు వెళ్లి సినిమా పర్వాలేదు అనిపించుకునేలా ఉన్నా ఇదేం బాగుంది అనే ఫీలింగ్ కలగడం సర్వ సాధారణం. కాబట్టి ఈ విషయంలో దేవర టీం సరిపోదా శనివారం టీం స్ట్రాటజీని ఫాలో అయితే కొంత సేఫ్ సైడ్ ఉండవచ్చు అని అంచనాలు వెలువడుతున్నాయి. అయితే మరి మీకు ఏమనిపించిందో చెప్పేయండి మరి.
తాజావార్తలు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
-
Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
-
Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి…
-
Harish Rao: ఎల్‌నినో కాదు.. కాంగ్రెస్ చేతకానితనమే కరువుకు కారణం
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!