నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ సినిమా రెండో భాగం రూపొందుతోంది. ‘అఖండ’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక రెండో భాగం మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్‌లో సింహభాగం పూర్తయింది. ప్రస్తుతం విఎఫ్‌ఎక్స్ వర్క్ జరుగుతోంది. ‘అఖండ’ సూపర్ హిట్ కావడం, ఈ కాంబినేషన్ మీద భారీ అంచనాలు ఉండడంతో ఈ సినిమాను దక్కించుకునేందుకు ఓటిటి సంస్థలు పోటీపడుతున్నాయి.
Also Read: Bollywood : రాముడి కథకి రూ. 4 వేల కోట్లు.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు!
ముందుగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ సంస్థలు సినిమాను దక్కించుకునే ప్రయత్నం చేశాయి. ఇప్పుడు పోటీలోకి మరో ఓటిటి సంస్థ కూడా ఎంట్రీ ఇచ్చింది. హాట్‌స్టార్‌తో జియో చేతులు కలిపి ‘జియో హాట్‌స్టార్’గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సంస్థ కూడా సినిమాను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. సినిమా నిర్మాణ సంస్థ ఈ సినిమా డిజిటల్ రైట్స్ నుంచి 60 కోట్ల రూపాయలు ఆశిస్తోంది. ఈ మూడు సంస్థలు పోటాపోటీగా సినిమాను దక్కించుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో, ఎవరు ఎక్కువ మొత్తం కోట్ చేస్తే వారికి సినిమా ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Also Read: Exclusive : తమ్ముడు ఎఫెక్ట్.. ‘ఎల్లమ్మ’ నితిన్ తో డౌటే
తాజాగా ఒక ఓటిటి సంస్థ ప్రతినిధులు సినిమా రఫ్ కట్‌ను వీక్షించినట్లు తెలుస్తోంది. వారంతా నార్త్ ఇండియా ప్రతినిధులు కాగా, సినిమా చూసిన తర్వాత ఒక రకమైన డివోషనల్ శివరింగ్‌తో బయటకు వచ్చినట్లు సమాచారం. వారు సినిమాను తీసుకోవడానికి చాలా ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద, నందమూరి బాలకృష్ణ సినిమాకు కేవలం డిజిటల్ రైట్స్ నుంచి 60 కోట్ల రూపాయలు రాబట్టే ప్రయత్నం జరుగుతుండటం అంటే అది సామాన్య విషయం కాదని చెప్పాలి. ఓటిటి బిజినెస్ కాస్త తగ్గిన ఈ రోజుల్లో, సినిమా ఫైనల్ కాపీ సిద్ధం కాకముందే ఇలా డిమాండ్ ఏర్పడటం అనేది మామూలు విషయం కాదు.