భారతీయ ప్రజల సంస్కృతి, మానవీయ విలువల పునాది అయిన రామాయణం ఇప్పుడు అంతర్జాతీయ ప్రేక్షకుల ముందు అద్భుత విజువల్స్‌తో, అత్యంత భారీ బడ్జెట్‌తో రానుంది. దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే బాలీవుడ్ లోనే కాకుండా, గ్లోబల్ సినిమా ఇండస్ట్రీలో కూడా సంచలనం సృష్టించబోతుంది. ఈ పౌరాణిక గాథలో ప్రధాన పాత్రలైన రాముడుగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. వారి లుక్స్‌పై ఇప్పటికే సోషల్ మీడియాలో హైప్ నడుస్తోంది. ఈ చిత్రంలో రావణాసురునిగా పాన్ ఇండియా స్టార్ యశ్ నటిస్తున్నట్టు సమాచారం.
Also Read : Infertility Causes in Women : పిల్లలు పుట్టకపోవడానికి ప్రధాన కారణాలు ఏంటో తెలుసా..!
అయితే తాజాగా నిర్మాత నమిత్ మల్హోత్రా ఈ మూవీ బడ్జెట్ గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. ‘ రామాయణం పార్ట్ 1, పార్ట్ 2 రెండు సినిమాలు కలిపి పూర్తయ్యే సమయానికి ఇది దాదాపు $500 మిలియన్లు అవుతుంది, అంటే దాదాపు రూ. 4000 కోట్లు. ప్రపంచం చూడవలసిన గొప్ప కథ రామాయణం. మేము ప్రపంచంలోనే అతిపెద్ద చిత్రాన్ని నిర్మిస్తున్నాము.. తక్కువ ఖర్చుతో పెద్ద చిత్రాన్ని నిర్మిస్తున్నామని నేను భావిస్తున్నాను. ఈ చిత్రం కేవలం డబ్బు కోసమే చేస్తుంది కాదు. ప్రపంచానికి మన రాముడి గురించి చెప్పాలని అనుకున్నాను’ అని నమిత్ అన్నారు. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతుండగా.. ఈ బడ్జెట్ గురించి విన్న నెటిజన్లు షాక్ అవుతున్నారు.
ఈ చిత్రం 20కి పైగా భాషల్లో, ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. DC, Marvel స్థాయిలో రామాయణం ప్రెజెంటేషన్ ఉండాలని నిర్మాతల లక్ష్యం. బ్యాట్‌మన్, వండర్ వుమన్ వంటి హాలీవుడ్ ఫ్రాంచైజీలను పోలి ఉండే విధంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్‌లో అత్యున్నతప్రమాణాలు పాటిస్తున్నారు. కాగా పార్ట్ వన్ – 2026 దీపావళి సందర్భంగా విడుదల కానుండగా,పార్ట్ 2 – 2027 దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మన సంస్కృతిని, మన ఇతిహాసాన్ని ప్రపంచానికి చూపించేందుకు తీసుకునే ఈ భారీ ప్రయత్నం, విజయం సాధిస్తే భారత సినిమా పుటల్లో చరిత్రలో నిలిచిపోతుంది.