మిజోరం రాష్ట్ర 9వ ముఖ్యమంత్రిగా జెడ్పీఎం పార్టీ అధ్యక్షుడు లాల్‌దుహోమా ఇవాళ ప్రమాణం స్వీకారం చేశారు. గవర్నర్ డా.కంభంపాటి హరిబాబు ఆయనతో రాజ్ భవన్ లో సీఎంగా ప్రమాణం చేయించారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన పార్టీ నేతల్లో కొందరు మంత్రులుగా ప్రమాణం చేశారు.
లాల్దుహోమా నాయకత్వంలోని ZPM (జోరం పీపుల్స్ మూవ్‌మెంట్) మిజోరంలో విజయం సాధించింది. 40 అసెంబ్లీ స్థానాల్లో 27 స్థానాలను గెలుచుకుంది. ఈ క్రమంలో అధికార MNF (మిజో నేషనల్ ఫ్రంట్)ను అధికారం నుండి తొలగించి.. జడ్పీఎం అధికారం చేపట్టనుంది. కాగా.. మిజోరాం నూతనంగా ఎన్నికైన ముఖ్యమంత్రి లాల్దుహోమ ఈనెల 8న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.