Deepinder Goyal: మిస్టరీ పరికరంపై జొమాటో సీఈఓ సంచలన పోస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deepinder Goyal: జొమాటో వ్యవస్థాపకుడు, CEO దీపిందర్ గోయల్ తాజాగా ఒక మిస్టరీ పరికరంపై సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్ట్ పెట్టారు. గతంలో ఆయన తన కొత్త ఆఫర్ అయిన ‘టెంపుల్’ అనే మెదడులో రక్త ప్రవాహ పర్యవేక్షణను పరిశీలించే పరికరం గురించి పోస్ట్ చేసిన తర్వాత ఆదివారం కొత్త పోస్ట్‌లో “త్వరలో వస్తుంది” అని పంచుకున్నారు. టెంపుల్ పరికరం అనేది “మెదడులో రక్త ప్రవాహాన్ని కచ్చితంగా, రియల్ టైం, నిరంతరం లెక్కించడానికి ఒక ప్రయోగాత్మక పరికరం” అని గోయల్ గతంలో పెట్టిన పోస్ట్‌లో వివరించారు. తాజాగా ఆయన ఈ పరికరం యొక్క చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిని ఆయన గ్రావిటీ ఏజింగ్ పరికల్పనను పరిశోధించేటప్పుడు అభివృద్ధి చేసినట్లు సమాచారం.
Also Read
- WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్‌పై బయటకు వచ్చి!
- Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్‌కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
- K Annamalai: "కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా".. అన్నామలై సంచలన ప్రకటన..
నవంబర్ 15న గోయల్ చేసిన వరుస పోస్ట్‌లలో ఆయన ఈ పరికరాన్ని “శాస్త్రీయమైన కానీ అసాధారణమైనది” గా వివరించారు. “నేను దీనిని ఎటర్నల్ CEOగా పంచుకోవడం లేదు, కానీ ఒక వింత థ్రెడ్‌ను అనుసరించేంత ఆసక్తిగల తోటి మానవుడిగా, మానవ దీర్ఘాయువుపై శాస్త్రీయ పురోగతి కోసం మా సాధారణ అన్వేషణలో భాగంగా మీతో పంచుకున్న. గురుత్వాకర్షణ జీవితకాలాన్ని తగ్గిస్తుందని చెబుతున్నాను” అని ఆయన ఈ పోస్ట్‌లో పేర్కొన్నారు. తరువాత పోస్ట్‌లో ఆరోగ్యంపై గురుత్వాకర్షణ ప్రభావం గురించి తనకు ఉత్సుకత రేకెత్తించిన విషయాన్ని కూడా వివరించారు. “నేను నా ఆరోగ్యం, పనితీరును ఆప్టిమైజ్ చేయడానికి సంవత్సరాలు ప్రయత్నిస్తున్నాను. నేను నా రక్తాన్ని ట్రాక్ చేయడం, ఉపవాసం ఉండటం, శిక్షణ పొందడం, ధ్యానం, మంచులో, హైపర్బారిక్ గదులలో కూర్చోవడం, అలాగే లెక్కలేనన్ని సప్లిమెంట్లను తీసుకోవడం చేశాను. ఆరోగ్యంగా ఉండటం కష్టం, దానికి చాలా సమయం పడుతుంది” అని ఆయన పేర్కొన్నారు. ” నేను విస్మరించిన అంశం ఏంటో వెతుకుతూ నా మెదడును గందరగోళానికి గురి చేశాను. అన్ని జీవులలో స్థిరంగా ఉన్నది, మ్యుటేషన్ లేదా అనుసరణ ద్వారా తప్పించుకోలేనిది, స్పష్టంగా ఉన్నప్పటికీ కనిపించనిది ఏమిటి? అనేదానికి నా మనస్సులో ఒక పదం కనిపించింది,” అని ఆయన ఈ పోస్ట్‌లో జోడించారు. ఆదివారం సోషల్ మీడియాలో గోయల్ పోస్ట్‌కు మిశ్రమ స్పందనలను వెల్లువెత్తాయి. కొందరు ఈ టెంపుల్ ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభం అవుతుంది, ఎక్కడ లభిస్తుంది అని అడిగితే, మరికొందరు దాని వెనుక ఉన్న భావనను విమర్శించారు.
READ ALSO: Indian Cricketers Retirement 2025: రో-కోతో పాటు 2025లో రిటైర్ అయిన భారత ఆటగాళ్ల జాబితా ఇదే..
Coming soon.
Follow @temple for more updates. pic.twitter.com/E7S8NeUDP4
— Deepinder Goyal (@deepigoyal) December 7, 2025
తాజావార్తలు
-
KS Bharat Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్..
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
-
KL Rahul: కేఎల్ రాహుల్‌కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..