China: ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వ్యక్తులు ప్రతిరోజూ ఆన్‌లైన్ వీడియోలను సృష్టించి, వ్యూస్, ఫాలోవర్స్ పొందాలనే ఆశతో YouTube, Instagram, Facebook వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వాటిని పోస్ట్ చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్ సృష్టికర్తలకు ఇటువంటి ప్లాట్‌ఫారమ్‌లు ప్రధాన ఆదాయ వనరుగా మారింది. వారిలో కొందరు బాగా సక్సెస్ అయి లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. ఈ కథనంలో ఒక మహిళ సంపాదన మిమ్మల్ని షాక్ చేస్తుంది. చైనాకు చెందిన జెంగ్ జియాంగ్ ఈరోజు సోషల్ మీడియాలో తుఫాను సృష్టిస్తోంది. ఈ మహిళ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేయడం ద్వారా వేల-లక్షలు కాదు కోట్ల రూపాయలు సంపాదిస్తోంది.
Read Also:Nagoba Jatara: నేడు నాగోబా మహా పూజ.. తరలి రానున్న మెస్రం వంశీయులు
జెంగ్ జియాంగ్ తన సోషల్ మీడియా ఖాతా డౌయిన్ (టిక్‌టాక్ చైనీస్ వెర్షన్)లో 50 లక్షలకు పైగా ఫాలోవర్స్ ను కలిగి ఉన్నారు. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ద్వారా జియాంగ్ చాలా సంపాదిస్తుంది. ప్రతి వారం కోటి రూపాయలు సంపాదించే ఆమె ఏమి చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. జెంగ్ జియాంగ్ తన సోషల్ మీడియా ఖాతాలో బట్టలు లేదా ఇతర వస్తువుల రివ్యూలను ఇస్తుంటుంది. ఆమె ఇచ్చే రివ్యూ కేవలం మూడు సెకన్లు మాత్రమే ఉంటుంది.
Read Also:Balayya: సింహం వస్తుంది… సీడెడ్ గడ్డకి మాస్ పూనకాలే
ఆమె లైవ్ స్ట్రీమ్ సమయంలో జెంగ్ జియాంగ్ సహాయకురాలు వివిధ వస్తువులతో నిండిన నారింజ రంగు పెట్టెలను ఒక్కొక్కటిగా అందజేస్తుంది. మిల్లీసెకన్ల వ్యవధిలో ఆమె ప్రతి ఉత్పత్తిని ఎంచుకొని కెమెరాకు ఫ్లాష్ చేస్తుంది. వస్తువు ధరను చెబుతుంది, స్క్రీన్ నుండి త్వరగా తీసివేస్తుంది. ఆమె ఒక ఉత్పత్తికి కేవలం మూడు సెకన్లు మాత్రమే ఇస్తుంది. కేవలం మూడు సెకన్ల ఈ వీడియోను చూసి ఆమె ఫాలోవర్స్ మంత్రముగ్ధులవుతుంటారు. జెంగ్ జియాంగ్ అందమైన కళ్ళ మాయాజాలం.. ఈ మ్యాజిక్ ఆమెకు నోట్ల వర్షం కురిపిస్తుంది. మూడు సెకన్ల రివ్యూల ద్వారా ఆమె ప్రతి వారం దాదాపు 14 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 120 కోట్లు) సంపాదిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.