రాయలసీమ… ఈ ఏరియా పేరు వినగానే మూవీ లవర్స్ కి సీడెడ్ గడ్డ గుర్తొస్తుంది. ఈ ఏరియాలో నందమూరి నట సింహం బాలయ్యకి స్పెషల్ క్రేజ్ ఉంది. బాలయ్య సినిమాలు ఏ సెంటర్ లో ఎలా ఆడుతాయి అనేది పక్కన పెడితే సీడెడ్ లో మాత్రం సాలిడ్ గా ఆడుతాయి. డబ్బులు తెస్తాయి, లాభాలు ఇస్తాయి. బాలయ్య సినిమాలకి చూడడానికి, బాలయ్య సినిమా రిలీజ్ సమయానికి సీడెడ్ అభిమానులు చేసే రచ్చ వేరే లెవల్ లో ఉంటుంది. ఇటీవలే భగవంత్ కేసరి సినిమాతో వంద కోట్లు కలెక్ట్ చేసి హ్యాట్రిక్ హిట్ కొట్టిన బాలయ్య… తన నెక్స్ట్ సినిమాని రిలీజ్ చేయడానికి టైమ్ పడుతుంది. దసరాకి బాలయ్య నెక్స్ట్ సినిమా వచ్చే అవకాశం ఉంది. ఈ గ్యాప్ ని ఫిల్ చేస్తూ… సీడెడ్ గడ్డకి పూనకాలు ఇవ్వడానికి బాలయ్య వస్తున్నాడు. బాలయ్య నటించిన ఫ్యాక్షన్ డ్రామా ‘సమరసింహారెడ్డి’ రీ రిలీజ్ కి రెడీ అవుతోంది.
బాలయ్యకి సీడెడ్ లో సాలిడ్ ఫ్యాన్ బేస్ తెచ్చిన సినిమాల్లో సమరసింహా రెడ్డి ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. ఈ సినిమాలోని ఇంటర్వెల్ బ్లాక్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్… మాస్ ని రీడిఫైన్ చేస్తాయి. 1999లో సంక్రాంతి సందర్భంగా రిలీజై బాక్సాఫీసు బూజులు దులిపేసిన సమరసింహా రెడ్డి అప్పటి వరకు టాలీవుడ్‌లో ఉన్న అన్ని రికార్డులను తుడిచిపెట్టేసింది. బి గోపాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మణిశర్మ మ్యూజిక్‌తో థియేటర్లో పూనకాలు తెప్పించింది. బాలయ్య ట్రైన్ సీన్, గొడ్డలితో విలన్ల ఊచకోత లాంటి సీన్స్ గూస్ బంప్స్ తెప్పించాయి. ఈ హై ఓల్టేజ్ ఫ్యాక్షన్ డ్రామాను పాతికేళ్ల తర్వాత రీ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు. మార్చి 2 ప్రపంచవ్యాప్తంగా సమరసింహారెడ్డి సినిమాను రీ మాస్టర్ చేసి… 4కే వెర్షన్‌తో పాటు 7.1 డాల్బీ సౌండ్‌లో రీ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఈ రీ రిలీజ్ సందర్భంగా వచ్చిన డబ్బులను నందమూరి బసవతారకం కాన్సర్ హాస్పిటల్‌కు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. మరి థియేటర్లు తగలబడిపోయేలా హై ఇచ్చే సీన్స్ ఉన్న సమరసింహారెడ్డి… రీ రిలీజ్‌తో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.