ఎలక్ట్రిక్ స్కూటర్ తక్కువ ధరలో ఎక్కువ రేంజ్ ఇచ్చే వాటికోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. జెలియో కంపెనీ చౌక ధరలోనే అద్భుతమైన ఫీచర్లతో ఎలక్ట్రిక్ స్కూటర్ ను తీసుకొచ్చింది. జెలియో మొబిలిటీ జెలియో గ్రేసీ+ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి విడుదల చేసింది. తక్కువ వేగం కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో, జెలియో భారత మార్కెట్లో గ్రేసీ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ స్కూటర్‌ను ఆరు వేరియంట్‌ల ఆప్షన్ తో తీసుకొచ్చారు.
Also Read:MaheshBabu : కొలంబోకు మహేశ్ బాబు.. శ్రీలంక ఎయిర్ లైన్స్ ట్వీట్..
కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌లో జెల్ బ్యాటరీ, లిథియం అయాన్ బ్యాటరీ ఆప్షన్ ఉన్నాయి. ఇది 60V/ 32AH బ్యాటరీతో పాటు 72V/ 42AH జెల్ బ్యాటరీని కలిగి ఉంది. మరోవైపు, 60V/30AH మరియు 74V/32AH లిథియం అయాన్ బ్యాటరీ ఎంపికలు కూడా అందుబాటులో ఉన్నాయి. దీనితో, స్కూటర్ 80 కి.మీ నుంచి 130 కి.మీ వరకు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది.
Also Read:Hari Hara Veera Mallu Pre Release Event LIVE: హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్
జెలియో నుంచి వచ్చిన గ్రేసీ ప్లస్ లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 10, 12 అంగుళాల టైర్లు, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్, డిజిటల్ మీటర్, DRL, కీ-లెస్ డ్రైవ్, యాంటీ-థెఫ్ట్ అలారం, పార్కింగ్ గేర్, USB ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు అందించారు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 54 వేల నుంచి ప్రారంభమవుతుంది. దీని టాప్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 69500. ఇది తెలుపు, బూడిద, నలుపు, నీలం వంటి నాలుగు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. దీనితో పాటు, లిథియం-అయాన్ బ్యాటరీతో కూడిన వేరియంట్లపై రెండు సంవత్సరాల వారంటీ, మూడు సంవత్సరాల వారంటీతో అందించబడుతోంది.