Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Zaheer Khans Hilarious Answer About Ms Dhoni

MS Dhoni: ఐపీఎల్‌లో ధోని ఉన్నన్ని రోజులు స్టేడియాలు పసుపెక్కాల్సిందే..

Published Date :March 20, 2025 , 3:22 pm
By Rajesh Veeramalla
  • ఎంఎస్ ధోని ఉన్నంత కాలం, ఏ స్టేడియమైనా పసుపుమయమే- జహీర్ ఖాన్
  • ధోనికీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది- జహీర్ ఖాన్
  • అతను ఐపీఎల్ ఆడుతున్నంత కాలం.. ఇది కొనసాగుతూనే ఉంటుంది- జహీర్.
MS Dhoni: ఐపీఎల్‌లో ధోని ఉన్నన్ని రోజులు స్టేడియాలు పసుపెక్కాల్సిందే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

మరో రెండ్రోజుల్లో ఐపీఎల్ సంగ్రామం ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని జట్లు తమ తమ హోంగ్రౌండ్‌లలో ప్రాక్టీస్‌ల‌లో మునిగి తేలుతున్నారు. ఈ క్రమంలో.. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మెంటర్, భారత మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ మీడియాతో మాట్లాడారు. ఎం.ఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల మధ్య హైఓల్టోజ్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ రెండు జట్లు లక్నోలో ఆడినప్పుడు.. వారి అభిమానులు స్టేడియంలో అధికంగా ఉంటారని.. ఈ ట్రెండ్ మార్చడానికి ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు జహీర్ ఖాన్ సరదాగా స్పందించారు. “ఎంఎస్ ధోని ఉన్నంత కాలం, ఏ స్టేడియమైనా పసుపుమయంగా మారుతుంది. ధోనికీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతను ఐపీఎల్ ఆడుతున్నంత కాలం.. ఇది కొనసాగుతూనే ఉంటుంది,” అని చెప్పారు. చెన్నై సూపర్ కింగ్స్ లక్నోలో ఆడినప్పుడల్లా స్టేడియం మొత్తం ఎల్లో జెర్సీలే దర్శనమిస్తాయని తెలిపారు. ఏప్రిల్ 14, 2024న జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కూడా స్టేడియం పసుపుమయంగా మారింది. ఆ మ్యాచ్‌లో ధోని కేవలం తొమ్మిది బంతుల్లో 28 పరుగులు చేశాడు. 3 బౌండరీలు, 2 సిక్సర్లతో అభిమానులను ఉత్సాహపరిచాడు.

Read Also: KTR: రేవంత్ రెడ్డి జాక్ పాట్ సీఎం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

ఇదిలా ఉండగా.. జహీర్ ఖాన్‌కు మరో ఆసక్తికర సంఘటన ఎదురైంది. 2005లో బెంగళూరులో జరిగిన భారత్-పాకిస్తాన్ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా.. ఒక మహిళా అభిమాని స్టేడియంలో ‘జహీర్, ఐ లవ్ యూ’ అని రాసిన ప్లకార్డుతో ప్రపోజ్ చేసింది. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత.. అదే అభిమాని లక్నో సూపర్ జెయింట్స్ ప్రీ-సీజన్ శిబిరంలో జహీర్‌ను కలుసుకుని, మరోసారి ‘జహీర్, ఐ లవ్ యూ’ అని రాసిన ప్లకార్డుతో సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్ 2025 కోసం రిషబ్ పంత్‌ను కెప్టెన్‌గా నియమించుకుంది. అయితే, గాయాల కారణంగా మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, అవేష్ ఖాన్‌లు ప్రారంభ మ్యాచ్‌లకు దూరంగా ఉండనున్నారు. శివమ్ మావి, శార్దూల్ ఠాకూర్ జట్టుతో శిక్షణ పొందుతున్నారని, ప్రత్యామ్నాయంగా వారిని తీసుకునే అవకాశం ఉందని సమాచారం. లక్నో సూపర్ జెయింట్స్ తమ తొలి మ్యాచ్ మార్చి 24, సోమవారం విశాఖపట్నంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • chennai super kings
  • IPL 2025
  • Lucknow Super Giants
  • ms dhoni
  • RCB

తాజావార్తలు

  • CM Chandrababu : హైదరాబాద్ ను మించేలా అమరావతిని నిర్మిస్తాం

  • Rythu Bharosa: ఖాతాల్లోకి రూ.6 వేలు.. మూడు రోజులే ఛాన్స్..

  • Deep Sleep Tips: నిద్రలేమి సమస్యకు సులభ పరిష్కారాలు.. రాత్రంతా గాఢ నిద్ర ఖాయం

  • Benjamin Netanyahu: మేం ప్రపంచం కోసం పోరాడుతున్నాం, మాతో కలిసి రండి..

  • Bhatti Vikramarka : ప్రజల చుట్టూ తిరిగే బడ్జెట్ ఇది.. ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తాం

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions