Site icon NTV Telugu

YV SUbba Reddy: వైసీపీపై దుష్ప్రచారం.. తిప్పికొట్టాల్సిన బాధ్యత మనదే..

Yv Subbareddy

Yv Subbareddy

YV SUbba Reddy: చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ కలిసి వైసీపీపై దుష్ప్రచారం చేస్తున్నారు.. దానిని తిప్పికొట్టాల్సిన భాద్యత మీ అందరిపైనా ఉందంటూ పిలుపునిచ్చారు వైవీ సుబ్బారెడ్డి.. అనకాపల్లి జిల్లా
నర్సీపట్నంలో వైసీపీ విస్త్రత స్థాయి సమావేశం నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 26 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాలలో సామాజిక సాధికారిక బస్సు యాత్ర ప్రారంభమవుతుందన్నారు.. ఈ కార్యక్రమంలో సంక్షేమ, అభివృద్ధి పధకాలకు వివరించనున్నాం. ప్రతి నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. నవంబర్ 1 నుంచి జగనన్నే మరలా ఎందుకు సీఎం కావాలి అనే దానిపై రెండు రోజుల పాటు గ్రామస్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని.. అనంతరం గ్రామంలోని పార్టీ ప్రతినిధులపై ఇళ్లపై జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.

Read Also: Bhagavanth Kesari : కాజల్ కన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ ఆమెకే.. ఎవరెంత తీసుకున్నారంటే?

ఇక, రెండో రోజు గ్రామస్తులకు కరపత్రాల పంపిణీ చేయాలి.. మిగిలిన రోజుల్లో మండలస్థాయి నాయకులు వెళ్ళాలి.. జనవరి మొదటి నుంచి పింఛన్ల పెంపుపై ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నాం.. ఫిబ్రవరిలో చేయూత, మార్చిలో వైస్సార్ ఆసరా కార్యక్రమాలు ఉంటాయని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వరుస కార్యక్రమాలను వివరించారు వైవీ సుబ్బారెడ్డి. మరోవైపు.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ.. జగనన్న పేరు చెబితే చంద్రబాబు, అయ్యన్న పాత్రుడు ఉచ్చ పోసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ హాయాంలో వీళ్లిద్దరూ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. 2024లో మీ ముఖ్యమంత్రి ఎవరో టీడీపీ నాయకులు ఇప్పుడే చెప్పగలరా? ఒంటరిగా పోటీ చేసే దమ్ములేని పార్టీ టీడీపీ అంటూ సెటైర్లు వేశారు ఎమ్మెల్యే గణేష్‌.

Exit mobile version