Medak Student: బాగా కాలేజీకి వెళ్లి చదివి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాల్సిన విద్యార్థులు దారి తప్పుతున్నారు. తల్లిదండ్రుల పరువు తీస్తున్నారు. వారి ఆశలు అడియాశలయ్యేలా ప్రవర్తిస్తున్నారు. చేతులారా జీవితాలను నాశనం చేస్తుకుటుంన్నారు. ఇటీవలి కాలంలో పాఠశాలలు, కళాశాలల్లో చిన్న చిన్న విషయాలకు విద్యార్థులు గొడవ పడటం సర్వసాధారణమైపోయింది. గొడవలు కాస్త పెద్దదై ఒకరినొకరు చంపుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే ఇక్కడ ఓ కాలేజీ యాజమాన్యం మాత్రం పట్టించుకోకుండా ఉండటం విమర్శలకు దారితీస్తోంది. ఓ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు చిన్న గొడవ జరిగింది. వాగ్వాదం కాస్త పెరిగి చివరకు పెద్ద దుమారానికి దారి తీసింది. దీంతో ఓ విద్యార్థి అర్ధనగ్నంగా తిరుగుతూ హంగామా చేశాడంతో కాలేజీ సెక్యూరీటి సిబ్బంది ఎంట్రీ ఇచ్చారు. కాగా.. అదిగమనించిన కాలేజీ విద్యార్థులు పరార్ అయ్యారు. ఈ ఘటన నర్సాపూర్ లోని ఓ ఇంజనీరింగ్ కాలేజ్ లో చోటుచేసుకుంది.
Read also: Janhvi Kapoor: స్విమ్ సూట్ తో చెమటలు పట్టిస్తున్న జాన్వీ కపూర్…
మెదక్ జిల్లా నర్సాపూర్ లోని ఓ ఇంజనీరింగ్ కాలేజ్ లోని సీనియర్లు, జూనియర్ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. కాలేజీ బయట ఓ ప్రదేశంలో సీనియర్లు, జూనియర్లుగా విద్యార్థులు విడిపోయి పరస్పరం చితకొట్టుకున్నారు. గ్యాంగ్ వార్ లో జూనియర్ విద్యార్థికి గాయాలయ్యాయి. అతన్ని పట్టుకుని విచక్షణా రహితంగా కొట్టడంతో.. చొక్కా చిరిగింది. దీంతో ఆ విద్యార్థి చిరిగిన చొక్కాతోనే కాలేజీ గ్రౌండ్ లో అర్ధనగ్నంగా తిరుగుతూ హంగామా చేశాడు. సీనియర్ల ఆగడాలు మితిమీరుతున్నాయని, ఇది సరైన పద్దతి కాదంటూ గ్రౌండ్ చుట్టూ అర్ధనగ్నంగా తిరగడంతో ఈ విషయం కాస్త కాలేజీ సెక్యూరిటీ సిబ్బందికి చేరింది. దీంతో ఘటనా స్థలానికి హుటా హుటిన సెక్యూరిటీ సిబ్బంది రావడంతో గమనించిన కాలేజీ విద్యార్థులు అక్కడి నుంచి పరారయ్యారు. కానీ.. సీనియర్లు, జూనియర్ల మధ్య వార్ ఎందుకు మొదలైంది అనేది ఇంకా క్లారిటీ రాలేదు. సీనియర్లు, జూనియర్లకు ర్యాగింగ్ చేశారా? లేక గొడవకు మరేదైనా కారణముందా అనేది ఇంకా తెలియలేదు. ఇంత జరుగుతున్నా యాజమాన్యం మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా ఉండటం విమర్శలకు దారితీస్తోంది.
Vijayakanth: కెప్టెన్ విజయకాంత్ సూపర్ హిట్ సినిమాలు ఇవే…