No MS Dhoni in Yuvraj Singh Team: వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) 2024 టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. శనివారం బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ నేతృత్వంలోని భారత జట్టు ట్రోఫీ గెలిచి.. మరోసారి భారత అభిమానులను ఖుషీ చేసింది. ఈ సందర్భంగా యువరాజ్ తన ఆల్‌టైమ్ ప్లేయింగ్ ఎలెవన్ జట్టును ప్రకటించాడు. ఇందులో ముగ్గురు భారత ఆటగాళ్లకు యువీ అవకాశం ఇచ్చాడు.
ఆశ్చర్యకరంగా టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఎంఎస్ ధోనీని యువరాజ్ సింగ్ తన ఆల్‌టైమ్ జట్టులోకి తీసుకోలేదు. భారత్ నుంచి సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు అవకాశం ఇచ్చాడు. యువీ తనను 12వ ఆటగాడిగా ఎంపిక చేసుకున్నాడు. రికీ పాంటింగ్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్, ఏబీ డివిలియర్స్, వసీం అక్రమ్, ఆండ్రూ ఫ్లింటాఫ్‌లను జట్టులోకి తీసుకున్నాడు. యువీ జట్టులో కీపర్‌గా గిల్‌క్రిస్ట్ ఉన్నాడు.
యువరాజ్ సింగ్ ఆల్‌టైమ్ జట్టు:
సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, రికీ పాంటింగ్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, ఆండ్రూ ఫ్లింటాఫ్, మెక్‌గ్రాత్, వసీం అక్రమ్, షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్.