YCP ZPTC Murder: నర్సీపట్నం పరిధిలోని కొయ్యూరు జడ్పీటీసీ వారా నూకరాజు హత్యకు పాల్పడ్డ ఏడుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.. రోలుగుంట పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రావణి వివరాలు వెల్లడించారు. నిందితుల్లో ఇద్దరు మహిళలు ఉన్నట్లు తెలిపారు. పథకం ప్రకారమే హత్య చేసినట్టు నిందితులు అంగీకరించారని చెప్పారు. కత్తులు, కర్రలతో దాడి చేశారన్నారు. నిందితులను నిన్న అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణ నేపథ్యంలో మరికొంత మంది అరెస్టయ్యే అవకాశం ఉందని వివరించారు. భూ వివాదం నేపథ్యంలో జరిగిన హత్యగా తేల్చారు. అదుపులోనికి తీసుకున్న నిందితులను రిమాండ్ కు తరలించారు.
READ MORE: Former CM YS Jagan: ఇదంతా పెద్ద మాఫియా.. రాష్ట్రంలో నకిలీ మద్యంపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఫైర్..
అసలు ఏం జరిగింది..?
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఈ నెల 20న దారుణం చోటుచేసుకుంది. కొయ్యురు మండలానికి చెందిన వైసీపీ జడ్పీటీసీ వారా నూకరాజు దారుణ హత్యకు గురయ్యాడు. భూతగాదాలే నూకరాజు హత్యకు కారణమని పోలీసులు చెప్పారు. ఈరోజు భూమి విషయంలో గిరిజనులకు, ఆయనకు మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం.. చివరకు హత్యకు దారితీసింది. సమాచారం అందుకున్న రోలుగుంట పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. నూకరాజు హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రోలుగుంట మండలం చటర్జీపురం వద్ద జడ్పీటీసీ వారా నూకరాజుకు పది ఎకరాల పొలం ఉంది. భూమికి సంబంధించిన పట్టా ఆయన పేరు మీదే ఉంది. ఆ భూమిని గిరిజనులు సాగు చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ భూమి విషయం మీద గిరిజనులకు, ఆయనకు గొడవలు జరుగుతున్నాయి. గతంలో నూకరాజు మీద గిరిజనులు దాడి చేశారు. ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో దాదాపు నెల రోజుల పాటు చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల మరోసారి దాడి చేసి హతమార్చారు.
READ MORE: Ram Charan – Upasana : మరోసారి తండ్రి కాబోతున్న రామ్ చరణ్.. ఉపాసన సీమంతం వేడుకలో మెగా హంగామా!