NTV Telugu Site icon

VIjaya Sai Reddy: టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు.. విజయసాయిరెడ్డి సెటైర్లు

Vijaya Sai Reddy

Vijaya Sai Reddy

VIjaya Sai Reddy: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యం అంటున్న విపక్షాలు.. జట్టు కట్టాయి.. టీడీపీ-జనసేన మధ్య పొత్తు ఇప్పటికే ఉండగా.. బీజేపీ విషయంపై ఈ రోజు క్లారిటీ రానుంది.. ఇప్పటికే దాదాపు పొత్తు ఖరారు అయిపోగా.. ఈ రోజు మధ్యాహ్నం మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌.. ఢిల్లీలో బీజేపీ పెద్దలతో మాట్లాడనున్నారు.. ఆ తర్వాత టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై అధికారిక ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. అయితే, టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపై సోషల్‌ మీడియా వేదికగా స్పందించి ఎంపీ విజయసాయిరెడ్డి.. సెటైర్లు వేశారు.

Read Also: Gold Prices At Record High: రికార్డు సృష్టించిన బంగారం ధర.. అంతర్జాతీయ సంకేతాలే ఇందుకు కారణమా ?

2014-19 మధ్య కాలంలో ఏపీ చూసిన మోసం, అబద్ధాలు, అమలు చేయని వాగ్దానాలన్నింటికీ భిన్నంగా ఈ కూటమి ఎలా ఉంటుంది? అంటూ ప్రశ్నించారు విజయసాయిరెడ్డి… ఇది మరొక ప్యాకేజీతో ఏర్పాటైన పొత్తు దుయ్యబట్టిన ఆయన.. ఈ మూడు కాళ్ల కూటమి కుర్చీ కూలిపోతుంది అని జోస్యం చెప్పారు.. ఆంధ్రప్రదేశ్‌లో సుస్థిర ప్రభుత్వం కోసం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకే ఓటు వేయండి అంటూ.. సోషల్‌ మీడియా వేదిక పిలుపునిచ్చారు ఎంపీ విజయసాయిరెడ్డి. కాగా, వచ్చే ఎన్నికల్లో వై నాట్ 175 అంటూ వైసీపీ ప్రచారం చేస్తోంది.. ఇప్పటికే సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలను నిర్వహిస్తూ ప్రచారంలో స్పీడ్‌ పెంచారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.

Show comments