NTV Telugu Site icon

YSRCP: వైసీపీకి బిగ్ షాక్‌.. కడప కార్పొరేషన్‌లో ఏడుగురు కార్పొరేటర్లు జంప్!

Kadapa

Kadapa

YSRCP: కడప జిల్లాలో వైసీపీకి బిగ్‌ షాక్ తగలనుంది. కడప కార్పొరేషన్‌లో ఏడు మంది కార్పొరేటర్లు పార్టీ మారనున్నట్లు తెలిసింది. సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో కార్పొరేటర్లు టీడీపీలో చేరనున్నారు. వైసీపీ కార్పొరేటర్లతో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చర్చలు జరిపారు. కడప నగరంలోని అలంకానపల్లెలో ఈరోజు సాయంత్రం మున్సిపల్ కార్పొరేటర్లతో ఎంపీ సమావేశం కాగా.. కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి సమావేశానికి అసంతృప్తి కార్పొరేటర్లు గైర్హాజరయ్యారు. గత రెండు నెలల క్రితం 25వ డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణ వైసీపీని వీడి టీడీపీలో చేరారు. కార్పొరేషన్‌లో కుర్చీల గోల తర్వాత అసంతృప్తి కార్పొరేటర్లపై టీడీపీ దృష్టి సారించింది. ప్రస్తుతం కడప మున్సిపల్ కార్పొరేషన్‌లో టీడీపీకి ఇద్దరు కార్పొరేటర్లు మాత్రమే ఉన్నారు.

Read Also: Krishna Crime: విషాదం.. అభం శుభం తెలియని 12ఏళ్ల బాలుడు బలవన్మరణం

Show comments