Pudi Srihari Arrest: పూడి శ్రీహరి అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించిన వైసీపీ.. హైకోర్టులో పిటిషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pudi Srihari Arrest: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (పొలిటికల్) పూడి శ్రీహరి అరెస్ట్‌పై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అరెస్ట్‌ను అక్రమంగా పేర్కొంటూ వెంటనే బేషరతుగా విడుదల చేయాలని పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు. వైసీపీ ఎమ్మెల్సీ, పార్టీ కేంద్ర కార్యాలయ ఇంచార్జ్ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం పౌర హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. ఈ ఉదయం మఫ్టీలో వచ్చిన పోలీసులు ఎలాంటి వివరాలు చెప్పకుండా శ్రీహరిని బలవంతంగా తీసుకెళ్లారని అన్నారు. ఏ పోలీస్ స్టేషన్‌కు చెందినవారో, ఏ కేసులో అదుపులోకి తీసుకున్నారో కూడా వెల్లడించలేదని విమర్శించారు. ఉదయం వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను కలిసి తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో మార్గమధ్యలో అడ్డగించి శ్రీహరిని తీసుకెళ్లారని తెలిపారు. ఆయన ఫోన్, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారని, ఇంటికి వెళ్లే అవకాశమూ ఇవ్వలేదని అన్నారు.
తర్వాత మరికొంత మంది పోలీసులు శ్రీహరి ఇంటికి వెళ్లి బలవంతంగా లోనికి ప్రవేశించి సోదాలు నిర్వహించారని ఆరోపించారు. ఇంట్లో ఉన్న సహాయకుడిని బయటకు పంపించి, ఇంట్లోకి ఎవరినీ అనుమతించలేదని చెప్పారు. పార్టీ ప్రజాప్రతినిధులు వెళ్లినా లోపలికి రానివ్వలేదని అన్నారు అప్పిరెడ్డి. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వైసీపీ నేతలు, కార్యకర్తలపై కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయని వైసీపీ నేతలు ఆరోపించారు. అక్రమ కేసులు, అరెస్టులు పెరిగిపోయాయని విమర్శించారు. సీనియర్ జర్నలిస్టుగా పనిచేసిన శ్రీహరిని అరెస్ట్ చేయడం అత్యంత హేయమని పేర్కొన్నారు.
Also Read
- Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
- YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
- Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
- OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
మరోవైు చిత్తూరులో వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు గురించి ప్రజలకు ఇప్పటికే తెలుసని, ఇలాంటి కేసులతో వైసీపీ కేడర్‌ను భయపెట్టలేరని అన్నారు. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా చట్టాన్ని అతిక్రమించి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇక, పూడి శ్రీహరి అరెస్ట్ నేపథ్యంలో వైసీపీ నేతలు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. హెబియస్ కార్పస్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా, ఈరోజే విచారణ జరిగే అవకాశం ఉందని సమాచారం.
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!