Actor Naresh Coments on Pawan Kalyan: మార్టిన్ లూథర్ కింగ్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న నరేష్ ను మళ్లీ ఏమైనా క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా? అని అడిగితే ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తనకి మళ్ళీ అస్సలు ఇప్పట్లో తిరిగి వచ్చే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చారు. ఏదైనా సినిమాతోనే చెబుతానని అన్నారు. తాను రాజకీయాల్లో ఉన్నప్పుడు ఐడియాలజీ బేస్డ్ గానో, ప్రాజెక్ట్ బేస్డ్ గానో తిట్టుకునే వాళ్లం కానీ ఇవాళ రాజకీయాలు ఒకళ్లని ఇంకొరు అసభ్య పదజాలంతో తిట్టుకునేలా మారాయని ఆయన అన్నారు. ఆడవాళ్లు ఆడవాళ్లగా కాకుండా ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని స్వార్థ రాజకీయం బాగా పెరుగుతోందని అన్నారు. కొన్ని ప్రాంతాలు అంధకారంలోకి వెళతున్నాయా అనిపిస్తోందని ఆయన అన్నారు. కానీ ఏదీ శాశ్వతం కాదని అన్నారు. హిట్లర్ లాంటి వాళ్లను కూడా చూశాం, మంచి వాళ్లనూ చూశామని పేర్కొన్న ఆయన రాజకీయం చెడ్డదని చెప్పను కానీ మనది గ్రేటెస్ట్ ప్రజాస్వామ్యం అని అన్నారు.
Naresh: చంద్రబాబు అరెస్ట్.. నటుడు నరేశ్ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలను డబ్బు శాసిస్తోందని పేర్కొన్న ఆయన ఎంపీగా పోటీ చేయాలంటే 100 కోట్లు కావాలని, పంచాయితీకి పోటీ చేయాలంటే రెండు కోట్లు కావాలని కానీ ఒకప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి యాభై లక్షల్లో అయిపోయేదని అన్నారు. ఈ రోజున ఎన్నికల్లో 100 కోట్లు ఖర్చు పెట్టే వ్యక్తి ఆ డబ్బును ప్రజల నుంచి మళ్లీ రాబట్టుకోవాలి, ఇదొక విషవలయం అని అన్నారు. ఇంకో గవర్నమెంటు రాగానే ఇతను జైల్లోకి పోతాడు, ఆ తర్వాత మళ్లీ గవర్నమెంట్ మారి వాళ్లు జైల్లోకి పోతారు ఇలా జైలు, బెయిలు రాజకీయమే నడుస్తోందని అన్నారు. సినిమా అనేది గొప్ప మాధ్యమం అని దేన్నయినా ఈ మాధ్యమంతో కన్వే చేయవచ్చని అన్నారు. కృష్ణగారి సమయంలో కూడా ఈనాడు, సాహసమే నా ఊపరి, నా పిలుపే ప్రభంజనం, మండలాధీశుడు లాంటి సినిమాలతో దమ్ముతో తీశారు, అలాగే ఆయన రాజకీయాల్లోకి కూడా వెళ్లారని అన్నారు. ఇప్పుడు కూడా పవన్ కల్యాణ్ లాంటి వారు పోరాడుతున్నారు కానీ ఇలా మాట్లాడుతున్నానని ఎవరికీ మద్దతు ఇస్తున్నానని కాదని అన్నారు.