Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ysrcp Activist Murdered In Kadapa

Kadapa Crime: సంచలనం రేపుతోన్న వైసీపీ నేత హత్య.. కారణం అదేనా..?

Published Date :June 24, 2023 , 10:51 pm
By Sudhakar Ravula
Kadapa Crime: సంచలనం రేపుతోన్న వైసీపీ నేత హత్య.. కారణం అదేనా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Kadapa Crime: కడపలో బుర్ఖాలు ధరించి బైక్‌పై వచ్చిన ఆ ఇద్దరు ఎవరు? సంధ్యా సర్కిల్‌లో జిమ్‌ నుంచి బయటకు వస్తున్న శ్రీనివాసులురెడ్డిపై వేట కొడవళ్లు, బాకులతో దాడి చేసి చంపేసింది ఎవరు? అసలీ హత్యకు కారణమేంటి? అంటే.. ల్యాండ్ సెటిల్‌మెంట్లు, వాటా పంపకాల్లో తేడాలేనని వినిపిస్తోంది. శ్రీనివాసులురెడ్డిని అతని స్నేహితుడు ప్రతాపరెడ్డి చంపేశాడనే స్థానికంగా చర్చించుకుంటున్నారు. కడపలో కమలాపురం నేతల భూదందాలపై అనేక ఆరోపణలు ఉన్నాయి. కమలాపురం నియోజకవర్గంలోని వల్లూరుకు చెందిన APSRTC చైర్మన్ దుర్గాయపల్లె మల్లికార్జున్‌ రెడ్డి అనుచరులు కడపలో భూ దందాలు, సెటిల్మెంట్లతో ప్రత్యర్థులను బెదిరిస్తున్నారనే విమర్శలున్నాయి. మల్లికార్జున్‌రెడ్డి ముఖ్య అనుచరుడు చిన్న నాగిరెడ్డిపల్లికి చెందిన శ్రీనివాసులు రెడ్డి.. కొండూరుకు చెందిన ప్రతాపరెడ్డితో కలిసి కడప పరిసరాల్లో ల్యాండ్ సెటిల్మెంట్లు చేసేవాడు.

నాలుగు నెలల క్రితం కడప రిమ్స్ పోలీస్ స్టేషన్ సమీపంలో ప్రహరీ గోడను కూల్చి వేసిన ఘటనలో ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తాయి. ఆ సెటిల్మెంట్‌లో వచ్చిన కోట్ల రూపాయల్లో తనకు వాటా ఇవ్వలేదని శ్రీనివాసులు రెడ్డితో ప్రతాపరెడ్డి గొడవ పడుతున్నట్లు వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీంతో శ్రీనివాసులు రెడ్డిపై కక్ష పెంచుకున్న ప్రతాప రెడ్డి రెక్కీ నిర్వహించి మరీ హత్య చేసినట్లు అనుమానాలున్నాయి. నలుగురైదుగిరిపై అనుమానాలు ఉన్నాయని.. నిందితులను పోలీసులు పట్టుకోవాలని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. పథకం ప్రకారమే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజ్‌తో పాటు, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. కడపలోని ఎర్రముక్కపల్లిలో అద్దె ఇంట్లో నివాసముంటున్న ప్రతాపరెడ్డి..శ్రీనివాసులురెడ్డి హత్యకు ముందుగానే ఇళ్లు ఖాళీ చేశాడు. దీంతో అతనే ఈ హత్యకు పాల్పడినట్లు వాదన వినిపిస్తోంది. బురఖాలతో వచ్చి హత్య చేసిన నిందితులను గుర్తించి, పట్టుకునేందుకు పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Kadapa
  • murder
  • tdp
  • YSRCP

తాజావార్తలు

  • Ustaad Bhagat Singh Pre Release Event LIVE : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ జాతర.. నేడే ప్రీ-రిలీజ్ ఈవెంట్..

  • Rythu Bharosa : తెలంగాణ రైతులకు శుభవార్త.. ఈనెల 22న రైతు భరోసా మొదటి విడత నిధులు

  • KTR : డ్రగ్స్ టెస్టుకు నేను సిద్ధం.. ప్రజాప్రతినిధులంతా ముందుకు రావాలి

  • Middle East Health crisis: యుద్ధాలు..వ్యాధులు.. ప్రమాదంలో ప్రపంచం! ఆరోగ్య సేవలను యుద్ధం ఎలా కుప్పకూల్చుతోంది?

  • IPL 2026: కేకేఆర్ కెప్టెన్‌గా మళ్లీ అతనే.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న షారుక్ ఖాన్ టీమ్!

  • Half Day Schools : చిన్నారుల రక్షణే ముఖ్యం.. పాఠశాలల తరహాలోనే అంగన్‌వాడీలకు హాఫ్ డే స్కూల్స్

ట్రెండింగ్‌

  • Ulavala Rasam Recipe : నోరూరించే ఉలవల రసం.. సింపుల్ టిప్స్ తో ఇలా చేసుకోండి..

  • Suryakumar Yadav: ఆ స్థానం నాకు ఫిక్స్ అయిపోయింది.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Chicken Price Hike: కొండెక్కిన కోడి, క్వాడ్రపుల్ సెంచరీ పక్కా?.. సామాన్యులకు చికెన్ కూర దూరం!

  • Suryakumar Yadav: కేరళ కింగ్, యార్కర్ మెషిన్, ఫ్యూచర్ స్టార్.. టీ20 వరల్డ్ కప్ హీరోలపై సూర్య ఆసక్తికర కామెంట్స్!

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
advertisement will close in 5 seconds ×
ads