YSR Bima: వైఎస్సార్ బీమా నమోదు ప్రక్రియ ప్రారంభం.. వారికి రూ.5లక్షల సాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSR Bima Scheme: ఆంధ్రప్రదేశ్‌లో 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను వైఎస్సార్ బీమా పథకం నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 7వ తేదీ వరకు ఇది కొనసాగనుంది. ఈ పథకం ద్వారా 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న కుటుంబ పెద్ద ప్రమాదవశాత్తూ మరణిస్తే కుటుంబసభ్యులకు ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్ధిక సాయం అందిస్తుంది. కుటుంబ పెద్ద సహజంగా మరణిస్తే ఆ కుటుంబానికి రూ. లక్ష అందిస్తారు. అలాగే 18- 70 సంవత్సరాలోపు వయస్సు ఉన్న కుటుంబ పెద్ద ఏదైనా పెద్ద ప్రమాదం జరిగి మరణించినా లేదా శాశ్వత వైలక్యం పొందినా రూ.5 లక్షలు పరిహారం ఇస్తారు.
గత నెల 29న నమోదు ప్రక్రియ ప్రారంభమవ్వగా.. గ్రామ, వార్డు సచివాలయాల్లో వాలంటీర్లు వివరాలను నమోదు చేస్తున్నారు. ఈ నెల 7లోగా నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్‌రెడ్డి ఆదేశించారు. వైఎస్సార్ బీమా పథకాన్ని 2021 జులై 1న సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. అప్పటినుంచి ప్రతి ఆర్ధిక సంవత్సరంలో వైఎస్సార్ బీమా నమోదు ప్రక్రియను చేపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.32 కోట్ల కుటుంబాలకు వైఎస్సార్ బీమా అమలు చేస్తున్నారు. పథకం ప్రారంభించిన మొదటి రెండు సంవత్సరాల్లో రూ.1307 కోట్లు ఖర్చు చేశారు. గత టీడీపీ ప్రభుత్వం చంద్రన్న బీమా పథకం ఉండగా.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ బీమా పేరుతో అమలు చేస్తోంది. ఈ పథకానికి ప్రతి ఆర్ధిక సంవత్సరానికి ఒకసారి నమోదు ప్రక్రియను చేపట్టి లబ్ధిదారులను గుర్తిస్తారు.
Also Read
- Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్‌కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
- AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
- Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
- వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! 'FIFA World Cup' గురించి తెలియని విషయాలు మీకోసం..
Read Also: GVL Narasimha Rao: పోలవరంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ కీలక ప్రకటన
దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న కుటుంబాలకు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.కాగా, 2023–24కు సంబంధించి జూలై 1 నుంచి వైఎస్సార్ బీమా పథకం అమలుకు కార్మిక శాఖ ఉత్తర్వులిచ్చింది. బీమా కంపెనీలు, బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారానే పరిహారం చెల్లింపును ఏపీ సర్కారు చేపట్టింది. ఈ పథకానికి బడ్జెట్లో రూ.372 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.
తాజావార్తలు
-
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్‌కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
-
AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
-
K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్‌బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
-
PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..