YS Sharmila: పోలీసులతో వైఎస్ షర్మిల దురుసు ప్రవర్తన.. వీడియో ఇదిగో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Sharmila: ఇందిరాపార్క్ వద్ద దీక్షకు బయలుదేరిన వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. లోటస్ పాండ్ నుంచి బయటకు వస్తున్న క్రమంలో షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగింది. సొంత పనులకు కూడా బయటకు రాకుండా అడ్డుకుంటారా? తనను హౌస్ అరెస్ట్ చేయడానికి పోలీసులకు ఏమి అధికారం ఉందని షర్మిల పోలీసులను ప్రశ్నించారు. ఆమెను ఇంట్లో నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్న క్రమంలో వారిని షర్మిల తోసేసి మరి బయటకు వచ్చారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన షర్మిలను అడ్డుకోగా.. ఆమె ఓ ఎస్సై, మహిళా కానిస్టేబుల్‌తో దురుసుగా ప్రవర్తించింది. ఓ ఎస్సైపై చేయి చేసుకోగా.. మాపై ఎందుకు చేయి వేస్తున్నారని ఎస్సై షర్మిలను ప్రశ్నించారు. నిరుద్యోగ ధర్నాకు వెళ్తున్న షర్మిలను పోలీసులు అడ్డుకోవడంతో ఆమె దురుసుగా ప్రవర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియోల్లో ఈ విషయం అర్ధమవుతుంది. చివరకు షర్మిలను మహిళా పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Read Also:Bhatti Vikramarka: మత కల్లోలం సృష్టించేందుకే బీజేపీ కుట్రలు
Also Read
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్‌కు బిగ్ షాక్.. రాజ్యసభ ఆశలు ఆవిరి
- వృద్ధాప్యాన్ని తిప్పికొట్టే 'ER-100' ఇంజెక్షన్.. తొలి రోగికి డోస్ సక్సెస్! ఇక మానవులు అమరులు అవుతారా?
- NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్‌పై ఫోకస్
- Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
వైఎస్ షర్మిల తీరుతో పోలీసులు చుక్కలు చూశారు. అడ్డుకుంటున్న మహిళా కానిస్టేబుళ్లను నెట్టేయడం చేయగా.. పురుషులను ప్రశ్నిస్తూ వచ్చారు. అలా నడుచుకుంటూ వస్తున్న ఆమె తన కాన్వాయ్ ఎక్కే ప్రయత్నం చేశారు. దీనితో అక్కడి పోలీసులు ఆమె కారును అడ్డుకున్నారు. దీనితో ఆమె దిగగా పోలీస్ వాహనంలోకి ఎక్కించేందుకు చూశారు. కానీ అక్కడే ఉన్న ఓ ఎస్సైపై కూడా షర్మిల చేయి చేసుకున్నారు. దీనితో ఆ ఎస్సై తిరిగి ప్రశ్నించగా ఆమె కూడా అంతే ఆగ్రహానికి గురయ్యారు. ఇదిలా ఉండగా.. పోలీసులపై చేయి చేసుకున్న వైఎస్ షర్మిలపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. షర్మిలపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఐపీసీ 353, 330 కింద కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం షర్మిల అదే పీఎస్‌లో ఉండగా..ఆమె తల్లి విజయమ్మ స్టేషన్‌కు బయలుదేరినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం స్టేషన్ వద్దకు భారీగా కార్యకర్తలు చేరుకుంటున్నారు.
కాగా రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలపై వైఎస్ షర్మిల ఇతర పార్టీ నాయకులతో కలిసి బీఆర్ఎస్పై పోరాడడానికి కంకణం కట్టుకున్నారు. ఈ మేరకు నిరుద్యోగ దీక్షకు పూనుకున్నారు. కానీ పోలీసులు ఆమె దీక్షకు అనుమతి నిరాకరించగా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు షరతులతో కూడిన దీక్షకు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో షర్మిల సోమవారం నిరుద్యోగ దీక్షకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో వారి పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం.
తాజావార్తలు
-
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్‌కు బిగ్ షాక్.. రాజ్యసభ ఆశలు ఆవిరి
-
వృద్ధాప్యాన్ని తిప్పికొట్టే ‘ER-100’ ఇంజెక్షన్.. తొలి రోగికి డోస్ సక్సెస్! ఇక మానవులు అమరులు అవుతారా?
-
Allu Aravind: ఇప్పుడు లవ్ స్టోరీస్ అన్నిటికీ ఓయోలో ఎండ్ కార్డ్.. అల్లు అరవింద్ సంచలనం
-
NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్‌పై ఫోకస్
-
Nuclear Warheads: ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్న భారత్ నిర్ణయం.. ఆ 12 న్యూక్లియర్ వార్ హెడ్ల కథేంటి?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!