YS Jagan: జమిలి ఎన్నికలపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
- అన్ని జిల్లా పార్టీ అధ్యక్షులు..అనుబంధ సంఘాల నేతలతో వైఎస్ జగన్ సమావేశం
- జమిలి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేం సన్నద్ధం
- జగన్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తగిన సమయం ఉంటుందని, పార్టీని మరింత పటిష్టం చేయడానికి మంచి అవకాశం ఉంటుందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ పేర్కొ్న్నారు. ప్రతిక్షంగానూ, అధికారంలోనూ, మళ్లీ ఇప్పుడు ప్రతిపక్షంగానూ పార్టీ ఉందన్నారు. అన్ని జిల్లా పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలతో వైఎస్ జగన్ సమావేశం అయ్యారు. 15 ఏళ్లలో పార్టీ ప్రస్థానం ముందుకు సాగిందన్నారు. కాకపోతే మనం ఆర్గనైజ్డ్‌గా యుద్ధంచేస్తున్నామా? లేదా? అన్నది చాలా ముఖ్యమని పేర్కొన్నారు. పార్టీ వ్యవస్థీకృతంగా ముందుకు సాగితేనే అది మంచి ఫలితాలను ఇస్తుందన్నారు. అప్పుడే మనం రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ ఎఫెక్టివ్‌గా ఉంటామని పేర్కొన్నారు. జమిలి అంటున్నారు.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆర్గనైజ్డ్‌గా ఉంటే మన సన్నద్ధంగా ఉంటామని పార్టీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాష్ట్ర స్థాయి నుంచిజిల్లాల వరకూ కమిటీలు ఎలా ఉన్నాయి? అన్నదానిపై పరిశీలన, అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రలను నిర్వర్తించాలన్నారు. మరో ఆరు నెలల్లో మళ్లీ సమావేశం ఏర్పాటయ్యే నాటికి గ్రామస్థాయిలో కమిటీలు ఏర్పాటు కావాలని సూచించారు.
అనుబంధాల విభాగాలకు గ్రామస్థాయిలో కూడా కమిటీలు ఏర్పాటు కావాలన్నారు. బూత్ కమిటీలు కూడా ఏర్పాటు కావాలని వైఎస్ జగన్ పేర్కొన్నారు. కమిటీలు ఏర్పాటన్నది కాగితాలకే పరిమితం కాకూడదన్నారు. దానివల్ల పార్టీకి ఎలాంటి లాభం ఉండదని.. కమిటీల ఏర్పాటపై పర్యవేక్షణ, పరిశీలన ఉండాలన్నారు. ఇలాచేయగలిగితే.. దేశంలోకెల్లా నంబర్ ఒన్ పార్టీగా మనం ఎదుగుతామన్నారు. గ్రామస్థాయి నుంచి మనకు కమిటీలు, నాయత్వం లేక కాదన్నారు. కాకపోతే వీటిని నిర్మాణాత్మక వ్యవస్థల్లోకి తీసుకురావాలని.. గ్రామస్థాయిలో కూడా నిర్మాణాత్మకంగా ఉండాలని వైసీపీ నేతలకు సూచించారు. అప్పుడు మనం ఇచ్చిన పిలుపుకు ఉద్ధృతమైన స్పందన వస్తుందన్నారు.
Also Read
- Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ 'వాటర్ బాయ్'గానే.. మేనేజ్మెంట్ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం..
- 2027 World Cup: స్టార్ ప్లేయర్లకు నో ఛాన్స్.. వరల్డ్ కప్ జట్టులో ఊహించని ట్విస్ట్..
- Minister BC Janardhan Reddy: రూ.8,530 కోట్లతో రహదారుల అభివృద్ధి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
వైఎస్ జగన్ మాట్లాడుతూ.. “మనం ఇంట్లో కూర్చుంటే.. ఏమీ జరగదు. మనం చొరవ తీసుకుని అంశాలపై స్పందించాలి. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గాల స్థాయిలో, జిల్లాల స్థాయిలో ప్రజా సంబంధిత అంశాలపై స్పందించాలి. అన్యాయాలపై స్పందించాలి, బాధితులకు అండగా నిలవాలి. ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూసి ఉండం. నాలుగు నెలల్లోనే ఈ ప్రభుత్వం వద్దురా అని ప్రజలు చెప్పే పరిస్థితి. నేనెప్పుడూ ఇలాంటి ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదు. ప్రభుత్వం ఎలా విఫలమైందో నాకన్నా.. నాయకులుగా మీరే చెప్తారు. ఇప్పటికీ మనం ప్రతి ఇంటికీ సగర్వంగా వెళ్లగలం.ఎన్నికల మేనిఫెస్టోకు అర్థం తీసుకువచ్చిన పార్టీ మనది. బడ్జెట్‌తోపాటే మనం పథకాలు అమలు చేసే తేదీలతో సంక్షేమ క్యాలెండర్ రిలీజ్ చేసేవాళ్లం. ఇంతకుముందెన్నడూ ఇలా జరగలేదు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టలేకపోతున్నారు. ఎన్నికలప్పుడు ప్రచారంలో వారిలా మనం అబద్ధాలు చెప్పలేకపోయాం. ప్రతిపక్షంలో కూర్చోవడానికైనా మనం వెనకాడం కాని, అబద్ధాలు చెప్పలేం. నేను ఈ మాటలు చెప్తే ఎవ్వరికీ నచ్చకపోవచ్చు: విలువలు, విశ్వసనీయ అనే పదాలకు అర్థం ఉండాలి. అధికారం ఉండొచ్చు.. పోవచ్చు. కాని, మళ్లీ మనం అధికారంలోకి తీసుకు వచ్చేది మన విశ్వసనీయత, విలువలే. అవి లేనప్పుడు రాజకీయాలకు అర్థం లేదు. ప్రజలు మనం చేసిన మంచి పనుల గురించి ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. చెప్పివన్నీ జగన్ చేశాడని ప్రతి ఇంట్లోనూ చర్చ జరుగుతోంది.” అని జగన్ పేర్కొన్నారు.
Read Also: Sajjala Ramakrishna Reddy: విచారణకు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరు.. పీఎస్ వద్ద భారీ భద్రత
ప్రజల్లోకి మనం ధైర్యంగా వెళ్లగలుగుతామని.. టీడీపీ కూటమి కార్యకర్తలు ధైర్యంగా వెళ్లగలుగుతారా అంటూ జగన్ ప్రశ్నించారు. టీడీపీ వాళ్లు ప్రజల ఇళ్లకు పోయే పరిస్థితులు లేవన్నారు. ప్రతి కుటుంబానికి మంచి చేసే కార్యక్రమాలు మనం చేశామన్నారు. కాని, చంద్రబాబుగారు అబద్ధాలకు రెక్కలు కట్టారని విమర్శించారు. ప్రతి ఇంటికీ వైసీపీ నాయకులు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారని.. అమలు చేసిన హామీలే వైసీపీకి శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రిపేర్‌గా ఉండాల్సిన సమయం వచ్చిందన్నారు. “ఆరోగ్య శ్రీ పూర్తిగా నీరుగారిపోయింది, ఆరోగ్య ఆసరా లేదు. ఆస్పత్రులునిర్వీర్యం అయిపోయాయి. మూడు త్రైమాసికాలు వచ్చినా.. విద్యాదీవెన, వసతి దీవెన లేదు. ఇంగ్లిషు మీడియం లేదు, సీబీఎస్‌ఈ లేదు, టోఫెల్ క్లాసులు లేవు. గోరుముద్ద కూడా పాడైపోయింది. అన్ని రంగాలూ దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి.ఉచిత ఇన్సూరెన్స్ గాలికి ఎగిరిపోయింది. ఆర్బీకేలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. పంటలకు ఎంఎస్‌పీలు రాని పరిస్థితి. ఇంటివద్దకు సేవలు నిలిచిపోయాయి. ఏం కావాలన్నా మళ్లీ జన్మభూమి కమిటీలచుట్టూ తిరగాలి. లక్షన్నర పెన్షన్లు ఇప్పటికే తొలగించారు. లా అండ్ ఆర్డర్ సిట్యువేషన్ ఘోరంగా ఉంది. దిశయాప్‌కూడా ఏమయ్యిందో తెలియదు. దారుణంగా అత్యాచారాలు జరుగుతున్నాయి:పోలీసులు దొంగకేసులకు పరిమితం అయ్యారు. డ్యూటీ మరిచిపోయి మూడు సింహాలకు సెల్యూట్ కాకుండా, రాజకీయనాయకులకు మడుగులొత్తుతున్నారు. ఎక్కడ చూసినా స్కాంలే కనిపిస్తున్నాయి.” అని జగన్ అన్నారు.
“ఇసుక టెండర్లకు రెండు రోజులే గడువు. కనీసం టెండర్లు పిలుస్తున్నారన్న విషయం ఎవ్వరికీ తెలియదు. టెండర్లు వేయడానికి ఎవ్వరూ కూడా పోని పరిస్థితి. ఇసుక రేటు మన హయాంకన్నా డబుల్ రేటు, ట్రిపుల్ రేటు. మన హయాంలో ప్రజలకు రీజనబుల్ రేట్లకు ఇసుక వచ్చేది. ప్రతి ఆదివారం ప్రతి నియోజకవర్గంలో రేట్లు ఇచ్చేవాళ్లం. అక్రమాలకు పాల్పడితే… కేసులు పెట్టేవాళ్లం. అంత పగడ్బందీగా మనం అమలు చేశాం. ఇప్పుడు దీన్ని దోచుకోవడానికి పాలసీని మార్చారు. స్టాక్‌యార్డులు, రీచ్‌లు అధికారంలోకి వచ్చిన కొన్నిరోజులకే ఖాళీచేసేశారు. లిక్కర్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మన హయాంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో దుకాణాలు నడిపాం. ఉన్న షాపులు తగ్గించి, పర్మిట్ రూమ్స్ పెట్టి, టైమింగ్స్ తేసేసి, బెల్టుషాపులు లేకుండా చూసి, వాల్యూమ్స్ తగ్గించి… ప్రజలకు మంచిచేసేలా చూశాం.”అని జగన్ కూటమి సర్కారు గురించి విమర్శలు గుప్పించారు.
తాజావార్తలు
-
Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
-
Hushar Pittalu : నిజమా కలా? అంటూ స్టేజ్ మీద లైవ్‌లో పొట్టు పొట్టు కొట్టుకున్న నటుడు!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ‘వాటర్ బాయ్’గానే.. మేనేజ్మెంట్ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం..
-
2027 World Cup: స్టార్ ప్లేయర్లకు నో ఛాన్స్.. వరల్డ్ కప్ జట్టులో ఊహించని ట్విస్ట్..
-
Minister BC Janardhan Reddy: రూ.8,530 కోట్లతో రహదారుల అభివృద్ధి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!