YS Jagan : విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది
- విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. ఫీజు రియింబర్స్‌మెంట్ చెల్లించకపోవడంతో విద్యార్థులు చదువులు మానుకునే పరిస్థితులు వచ్చాయి. కొందరు విద్యార్థులు ఫీజులు కట్టలేక పనికి వెళ్తున్నారు. విద్యారంగాన్ని చంద్రబాబు దారుణంగా దెబ్బతీశారు. : జగన్ ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan : ఏపీ సీఎం చంద్రబాబు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకపోవడంతో విద్యార్థులు చదువులు మానేసుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. ఆదివారం ఆయన ఎక్స్ వేదికగా.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యార్థులపై కక్షగట్టినట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎక్స్ వేదికగా.. ‘@ncbn గారి కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. మూడు త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులను పిల్లల చదువులకు చెల్లించకపోవడంతో చదువులు మానుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. చంద్రబాబుగారు వారిపై కక్షకట్టినట్టు వ్యవహరిస్తున్నారు. ఒంగోలు జిల్లా జె.పంగులూరులో ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక, ఫీజులు కట్టలేక పనులకు వెళ్తున్న విద్యార్థి కథనం నాకు ఆవేదన కలిగించింది.
Sanjay Raut: మా ఓటమికి మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్ కారణం.. సంజయ్ రౌత్ సంచలన ఆరోపణ..
Also Read
- Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
- Plastic Chair Cleaning Tips: తెల్లటి ప్లాస్టిక్ కుర్చీలపై మొండి మరకలా? వంటింట్లో ఉన్న పదార్థాలతోనే ఈజీ క్లీనింగ్
- YSP MPs Meet Amit Shah: అమిత్ షాతో వైసీపీ ఎంపీల భేటీ.. జగన్ భద్రత, డీఎస్సీ అక్రమాలపై ఫిర్యాదు
- Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
చంద్రబాబుగారు రాగానే అన్ని రంగాల్లోనూ తిరోగమనమే కనిపిస్తోంది. ముఖ్యంగా విద్యారంగాన్ని దారుణంగా దెబ్బతీశారు. అమ్మ ఒడిని, ఇంగ్లీష్ మీడియంను, 3వ తరగతి నుంచి టోఫెల్, 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లు, సీబీఎస్‌ఈ, సీబీఎస్‌ఈ నుంచి ఐబీదాకా ప్రయాణం, 8వ తరగతి పిల్లలకు ట్యాబులు, బైజూస్ కంటెంట్, నాడు-నేడు ఇలా అన్నింటినీ రద్దుచేసి 1-12వ తరగతి విద్యార్థులను, వారి తల్లులను దెబ్బతీశారు. వసతిదీవెన, విద్యాదీవెన నిలిపేసి, డిగ్రీ, ఇంజినీరింగ్, డాక్టర్ చదువులు చదువుతున్నవారినీ తీవ్రంగా ఇబ్బందిపెడుతున్నారు.
వైయస్సార్‌సీపీ హయాంలో ప్రతి త్రైమాసికం పూర్తికాగానే తల్లుల ఖాతాలో జమచేసే వాళ్లం. ఇలా గత విద్యాసంవత్సరం డిసెంబర్ త్రైమాసికం వరకూ రూ. 12,609 కోట్లు ఒక్క విద్యాదీవెనకే ఖర్చు చేశాం. తలరాతలను మార్చేది చదువులు మాత్రమేనని గట్టిగా నమ్ముతూ వైయస్సార్‌సీపీ హయాంలో మొత్తం ఈ రెండు పథకాలకే రూ.18వేల కోట్లు వరకూ ఖర్చు చేశాం.
ఎన్నికల కోడ్ కారణంగా జనవరి-మార్చి త్రైమాసికానికి, ఏప్రిల్ లో వెరిఫికేషన్ చేసి మే నెలలో ఇవ్వాల్సిన ఫీజు డబ్బులు ఇవ్వనీయకుండా ఇదే కూటమి పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేశారు. పోనీ ఎన్నికలు అయిన తర్వాత వీళ్లు జూన్‌లో అయినా ఇచ్చారా అంటే అదీలేదు. అప్పటినుంచి ఒక్కపైసాకూడా చెల్లించడంలేదు. ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన వసతి దీవెన పరిస్థితికూడా అంతే. తర్వాత ఏప్రిల్-జూన్, తర్వాత జులై-సెప్టెంబరు త్రైమాసికాలకు సంబంధించి ఫీజులు చెల్లింపులో ఎలాంటి అడుగూ ముందుకు పడ్డంలేదు. ఇప్పుడు అక్టోబరు-డిసెంబరు త్రైమాసికం కూడా సగం గడిచిపోయింది. దీంతో కలుపుకుంటే సుమారు రూ.2,800 కోట్లకుపైగా ఫీజులు రీయింబర్స్ చేయాల్సి ఉంది. మరో రూ.1,100 కోట్లు లాడ్జింగ్, బోర్డింగ్ ఖర్చుల కింద వసతిదీవెన బకాయిలు కూడా ఉన్నాయి. మొత్తంగా బకాయిలు పెట్టిన డబ్బులు డిసెంబర్ నాటికి రూ.3,900 కోట్లకు చేరుకుంటాయి. కానీ, ఈ ప్రభుత్వం తీరుచూస్తే మాటలేమో కోటలు దాటుతున్నాయి, కాళ్లేమో గడపకూడా దాటడం లేదు.
ఫీజులు కట్టకపోతే కాలేజీలకు రానివ్వడంలేదు, చదువులు పూర్తిచేసినవారికి బకాయిలు కడితేగానీ సర్టిఫికెట్లూ ఇవ్వడంలేదు. ఇలా 11 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. చేసేదిలేక తల్లిదండ్రులు అప్పులు చేయడమో, వాటిని తీర్చలేక ఆస్తులు అమ్ముకోవడమో చేయాల్సి వస్తోంది. ఏదారీలేనివారు తమ పిల్లలను పనులకు తీసుకెళ్తున్నారు. చదువులకు నిలయమైన ఏపీలో దౌర్భాగ్యకర పరిస్థితులు ఇవి.
ప్రభుత్వం వచ్చాక ఇసుక స్కాం, లిక్కర్ స్కాం, పేకాట క్లబ్బులు, మాఫియా సామ్రాజ్యాలు, ప్రైవేటీకరణ ముసుగులో స్కాములు చేస్తూ మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ పోర్టులను దోచిపెట్టే స్కాంలు తప్ప పిల్లల చదువుల మీద శ్రద్ధలేకుండా పోయింది. వెంటనే అమ్మకు వందనం, ఫీజు రీయింబర్స్‌మెంట్ సహా వసతి దీవెన డబ్బులు విడుదలచేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. పిల్లల చదువులను దెబ్బతీసే చంద్రబాబుగారి నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.’ అని పేర్కొన్నారు వైఎస్ జగన్.
Satya: ఫిలింఫేర్ షార్ట్ ఫిలిం అవార్డ్స్ లో పోటీకి దిగిన సాయి తేజ్ “సత్య”
తాజావార్తలు
-
AAA Cinemas Vizag: ఈసారి పుష్పరాజ్‌ని కలవడం కష్టమే.. వైజాగ్ AAA ఓపెనింగ్‌కు ఫ్యాన్స్‌కు నో ఎంట్రీ!
-
Shahid Kapoor: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్! AA23లో ఆ బాలీవుడ్ హీరో ఎంట్రీ?
-
Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
-
Plastic Chair Cleaning Tips: తెల్లటి ప్లాస్టిక్ కుర్చీలపై మొండి మరకలా? వంటింట్లో ఉన్న పదార్థాలతోనే ఈజీ క్లీనింగ్
-
Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!